చక్కర కలిపిన తియ్యని కమ్మని-జొన్నవిత్తుల / chakkera kalipina theyani kammani song lyrics / jonnavittula

 చక్కర కలిపిన-తెలుగు పాట


పాట వినండి....🎵

పల్లవి:-
చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,

చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు  ||చ||

చరణం1:-
హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణ యతి ప్రాసల రస ధ్వని శాఖల కవితలల్లు పులుగు
నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు   ||చ||
చరణం2:-
అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రస ధారయై ధ్రువ తారయై మన దేశ భాషలను లెస్సయై
దేవ భాషతో చేలిమిచేసి పలు దేశ దేశముల వాసికెక్కినది  

 
                                                                    ||చ||
చరణం3:-
మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళి
అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం... ||చ||




     తెలుగుభాష యొక్క గొప్పతనాన్ని గూర్చి చక్కగా వర్ణించారు...జొన్నవిత్తుల గారు. తెలుగు శంఖారావం అనే పాటలపొత్తులలో ఈ పాట ఎక్కువ జనాదరణను పొందింది. మరిన్ని పాటలు,పేరడీలు, పద్యాలు...ఆయన రాసినవి అన్ని మచ్చుతునకలే.

2 కామెంట్‌లు:

  1. Sir can I use చక్కెర కలిపిన .... తెలుగు పాట Audio Song.. sung by M Bala Murali Krishna garu....

    రిప్లయితొలగించండి
  2. ఈవిధంగా ఈ పాటలను అందరికి అందించాలనే ఈ ప్రయత్నం. మీరు నిశ్చింతగా స్వీకరించవచ్చు...ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.