ప్రాచీన సాహిత్య - ప్రశ్నలు/ telugu old literature questions

             ప్రాచీన సాహిత్య ప్రశ్నలు




1) ఉదాహరణ,రగడలప్రక్రియలకు ఆద్యుడు                 పాల్కురికిసోమన అయితే,ఉదాహరణ,రగడ 
     లక్షణాలను ప్రథమంగా  వచించిన లాక్షణికుడు          ఎవరు ?

జ) విన్నకోటపెద్దన

2) విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ
    వచ్చినంత తేటపఱతు అన్న కవి ఎవరు ?

జ) భక్తకవి పోతన

3) పాల్కురికి సోమన తన గ్రంథములలో నలుగురు 
    గురువులను పేర్కొన్నాడు కదా!మరి సోమనకి          దీక్షాగురువు గురులింగార్యుడు అయితే,                   సాహిత్య గురువు ఎవరు ? 

జ) కరస్థలి విశ్వనాథయ్య

4) రాఘవాభ్యుదయము ఇంద్రవిజయము అనే
     గ్రంథాలు రచించిన ప్రాచీన కవిఎవరు ?

జ) నన్నయ

5) రాధాదేవిచరిత్ర,సుశీలకథ,సుశర్మ వృతాంతం           మొదలైన పాత్రల గల ప్రసిద్ద క్షేత్రమాహాత్మ్య             కావ్యము ఏది ?ఎవరు రాశారు ?

జ) తెనాలి రామకృష్ణుడు రాసిన                                    పాండురంగమాహాత్మ్యము

6) విజయవిలాసము అనే ప్రబంధాన్ని చేమకూర           వేంకటకవి రాయగా శివలీలా విలాసము అనే           గ్రంథాన్నిరాసిన ప్రాచీనకవి ఎవరు ?

జ) నిశ్శoక కొమ్మన

7) తెలుగులో విరచితమైన అశ్వశాస్త్రకావ్యం                 హయలక్షణ విలాసము గ్రంథ కర్త ఎవరు ?

జ) మనుమంచిభట్టు (1450)

8) రాయల ఆస్థానంలో ఉండి రాయలకు తన               రచనలను అంకితమివ్వని శతకకవి ఎవరు ?

జ) ధూర్జటి

9) ప్రబంధ కవులకు అంగాంగ వర్ణనపై వ్యామోహం       ఎక్కువ,అయితే అంగాంగ వర్ణన ఎక్కువ చేసిన       ప్రబంధకవిఎవరు ?

జ) రామరాజ భూషణుడు

10) రాధామాధవకవి ఎవరు?

జ)  చింతలపూడిఎల్లనార్యుడు



ప్రశ్నలు:-

1) వాల్మీకి రామాయణము ను ఏ ఛందస్సులో                 రాశారు? 

2) భూమిపై పర్వతాలు, నదులు ఉన్నంతకాలం           రామాయణ గాథను జనులు కీర్తిస్తారు అని               ఎవరు  పలికారు?

3) అయోధ్యానగర నిర్మాత ఎవరు? 

4) దశరథుడి ప్రధానపురోహితులు ఎవరు? 

5) కోసల దేశం ఏ నదీ తీరంలో ఉన్నది?

6) ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు?

7) శ్రీరాముడు ఏ రోజు జన్మించారు? 

8) సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడు ?

9) రావణాసురుడి తల్లిదండ్రులు ఎవరు?

10) విశ్వామిత్రుడి ఆశ్రమం పేరు ?

జవాబులు:-

1. అనుష్టుప్ 

2. బ్రహ్మ 

3. మనువు

4. వశిష్ఠ, వామదేవులు 

5. సరయు 

6. విభాండక మహర్షి 

7. చైత్ర శుద్ధ నవమి రోజూ

8. విశ్వామిత్రుడు 

9. విశ్రవసురుడు, కైకసి 

10. సిద్ధాశ్రమము


ప్రశ్నలు:-


1. బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి          ఎవరు?

2. శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి       ఎవరు?

3. రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరి ఇంటివద్ద       అతిధిగా ఉన్నాడు?

4. మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది            ఎవరు?

5. ఆంజనేయుని వాహనం ఏమిటి?

6. ద్రోణుని కుమారుని పేరేమి?

7. భీష్ముని తలిదండ్రులెవరు?

8. దశరధుడు ఎవరి నిర్వహణలో                                పుత్రకామేష్ఠియాగం చేసెను?

9. సీతాదేవితల్లిదండ్రులెవరు?

10. వాలికుమారునిపేరేమి?

11. జఠాయువు సోదరుడెవరు?

12. శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు?

13. దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది            ఎవరు?

14. సుగ్రీవుని మంత్రి ఎవరు?

15. కుచేలుని అసలు పేరేమి?

16. నరనారాయుణులు అని ఎవరిని                               సంభోదిస్తారు?

17. పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి?

18. ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు?

19. సీతాదేవికి రామునిచేతిలోరావణుడు
      మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది           ఎవరు?

20. ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు                            గురుదక్షిణగా  అడిగినదెవరు?

జవాబులు:-

1. పూతన 

2. తాటకి

3. విదురుడు 

4. శ్రీరాముడు

5. ఒంటె

6. అశ్వత్థామ 

7. శంతనుడు, గంగాదేవి 

8. ఋష్య శృంగుడు

9. జనకుడు ,రత్నమాల (సునయన)

10. అంగదుడు 

11. సంపాతి 

12. దేవకీదేవి, వసుదేవుడు 

13. శకుని 

14. హనుమంతుడు 

15. సుధాముడు

16. నరుడు అర్జునుడు నారాయణుడు కృష్ణుడు 

17. అర్జునుడి పది పేర్లు 

18. దుశ్శాసనుడు

19. త్రిజట

20. ద్రోణుడు

నన్ను ప్రోత్సహించడం ద్వారా మరిన్ని ప్రశ్నోత్తరాలు పొందగలరు...👉 లంకెను చూడండి...

1 కామెంట్‌:

Blogger ఆధారితం.