రుధిరక్షర శాంతి సంతకం /Santhi Santhakam

  

ఏ పేరైతే ఏమి ప్రాణాలు బలిగొనిన ప్రాంతమే

చరిత్ర ఏదైనా రుధిరక్షర సంతకాల సమ్మేళనమే

గతం ఎవరిదైనా సారాంశము ఒక్కటే

అసువులు బాసిన వీరుల రక్త ప్రవాహమే 

పసుపుతాళ్ళు తెగిన ఆడబిడ్డల అశ్రుధారలే

మరి గొప్ప చెప్పగా ఏమున్నది ఏ ప్రాంతమైనా

శాంతంటు జరిగిన పోరులో చిమ్మిన నెత్తుటి చుక్కల లెక్కలు తెలియవంటావా

నియంతల నీడలో బానిసత్వపు సంకెళ్లు చేసే నిశ్శబ్ద శబ్దాలు ఎవరికి వినబడవంటావా

పెద్ద గద్దెలనెక్కి పాలించి గొప్పలే చెప్పిన ఎన్ని పినుగులు తొక్కి పైకెక్కి నావో చూడరంటావా

ప్రాంతాల పేర్లు చెప్పి పోరు చెయ్యకు హింసనే రగిల్చే ఆయుధానికి సమీదవై

పుడమినే చిల్చు హద్దులే చెరిపి విశ్వమానవత చాటు మనిషివై

క్రాంతివై విశ్వశాంతివై చీకటిలో 
వెలుగు దివ్వేవై ఆర్తినే చల్లార్చు శాంతివై
         
                                                  -    కిలిమి అప్పలరెడ్డి


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.