తవ్వా వెంకటయ్య- తెలుగు సాహిత్య పరిశోధకుడు/ Telugu phd/ Dr.thavva venkataya

 పరిశోధక విధ్యార్ది-పడుతున్న కష్టాలు



డాక్టర్ తవ్వా వెంకటయ్య గారి ఊరు కడపజిల్లాలోని తవ్వారిపల్లె. దళితుడైన వెంకటయ్య కడపజిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి ఖాజీపేటలోని ప్రవైట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

తనకున్న కష్టాలలో కూడా చదువుకు ప్రాముఖ్యం ఇచ్చి  పరిశోధన(phd) వరకు చదువుకున్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన పరిశోధనకి మంచి ప్రశంసలు వచ్చాయి. "రాయలసీమ కథానికి తొలిదశ ఒక అధ్యయనం" పేరుతో ఆధునిక కథల అవిర్భావం రాయలసీమలో ఎపుడు జరిగింది పరిశోధించి మొత్తం 115 తొలి కథలను వెలికితీశారు.


            అలాగే ‘సీమ కథా తొలకరి’ అన్న పేరుతో కథల మీద ఆయన రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. రాయలసీమలో తొలికథ 1941లో  జి.రామకృష్ణ రాసిన ‘చిరంజీవి’ అని అనుకుంటున్న రోజుల్లో డా.వెంకటయ్య రాయలసీమ కథని 1918వ సంవత్సరం వరకు ఉన్నవని నిరూపించారు. ఇలా 1918 -1941 సంవత్సరాల మధ్యలో వచ్చిన మొత్తం 115 కథలను పరిశోధించి వెలికితీశారు. ఇందులో 50  కథలను ‘రాయలసీమ తొలి తరం కథలు’ అన్న పేరుతో ప్రచరించారు. 

కరోనా చేస్తున్న చికటిపోరాటంలో కళాశాల లేక తనకి జీతం రాకపోవడంతో కుటుంబ పోషణ కరువుయింది. కాగా ఇంట్లో అమ్మ నాన్న, తమ్ముడు,తన కూతురుకి అండగా  ఉండాలి. అందుకే బేల్దారి పనిచేసే కర్షక సైనుకుడిగా, నిర్మాణ కూలీగా మారారు.


మొదట్లో‘కూలికి వస్తాను. ఏదైనా పని ఇవ్వండని అడిగితే, అంత పెద్ద చదవు చదివావు, నువ్వేం పని చేస్తావులే అని కూలిపని ఇవ్వలేదని వాపోయారు. అందుకే దూరంగా వెళ్లి, చదువుకోలేదని చెప్పి పని చేస్తున్నానని అన్నారు. తాను చదువుకొక పోకుంటే మా ఊర్లోనే పనిదొరికేదని తన పరిస్థితిని బాధతో వివరించారు.


డా. వెంకటయ్యకు సాయం చేసేందుకు  మొబైల్ నెంబర్ : 9703912727 నకు కాల్ చెయ్యగలరు.


2 కామెంట్‌లు:

Blogger ఆధారితం.