ద్రావిడభాషల - ప్రశ్నలు/ dravida bhashala prasnalu/ southren languages

ద్రావిడ భాషలు - ప్రశ్నలు



1. ద్రావిడ భాషలకు సంస్కృతానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన మొట్టమొదటి పాశ్చాత్య తుడు ఎవరు?

జ) ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్


2. ద్రావిడ భాషలకు దక్షిణ దేశ భాషల నీ మొదటి పేరు పెట్టింది ఎవరు?

జ) ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్


3. ద్రావిడ భాషా తత్వానికి మూల పురుషుడు ఎవరు?

జ) ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్


4. ఏడి కాంప్బెల్ రాసిన ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ గ్రంథానికిపీఠీక రాసింది ఎవరు? దాని పేరు ఏమిటి?

జ) ఏ డిజి గ్నేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనే పేరుతో ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ రాశారు.


5. తెలుగు సంస్కృతం కంటే భిన్నమైన భాషని పరిశోధనలతో నిరూపించింది ఎవరు?ఏ దేశం?

జ) రాస్మనే రాస్కే, డెన్మార్క్ దేశం.


6. ద్రావిడ భాషల్ని మలబారిక్ భాషలు అని పిలిచింది ఎవరు?

జ) రాస్మన్ రాస్కె


7. ద్రావిడ భాషా వాదానికి మూలపురుషుడు ఎవరు?

జ) రాస్మన్ రాస్కె.


8. దక్షిణ భారతదేశంలోనే భాషలకు ద్రావిడ భాషలు అని పేరు పెట్టింది ఎవరు?

జ) రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్.


9. రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ రాసిన ఏ గ్రంథంలో ద్రావిడ భాష కుటుంబ గా ప్రస్తావిస్తూ రెండు వర్గాలుగా చేసి మొత్తం 12 ద్రావిడ భాషలను ఒక కుటుంబంగా ప్రస్తావించిన గ్రంథం ఏది?

జ) ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ సౌత్ ద్రవిడియన్ లాంగ్వేజెస్.


10. తులనాత్మక ద్రావిడ భాషల పితామహుడు ఎవరు?

జ) రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్  

Telugodi donate



11. ద్రావిడ భాషలు గ్రంథకర్త ఎవరు?

జ) పి ఎస్ సుబ్రహ్మణ్యం


12. భారతదేశంలోని మాండలికాలపై బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ చేసిన వర్గీకరణ ఏమిటి?

జ) జార్జి గీయర్సన్. 1927లో లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే పేరుతో పదకొండు సంపుటాలు ముద్రించారు. అందులో 175 భాషలు మరియు 544 మాండలికాల ప్రస్తావన ఉంది.


13. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా రాసిన ఏ సంపుటాల్లో ద్రావిడ భాషల ప్రస్తావన ఉంటుంది?

జ) స్టెనో కొనొ రాసిన నాలుగవ సంపుటిలో. మొత్తం ద్రావిడ భాషల్ని 17 గా పేర్కొని రెండు శాఖలుగా విభజించారు అవి 1 తమిళ శాఖ,2 తెలుగు శాఖ.


14. తెలుగు వర్ణ నిర్మాణం పరంగా దక్షిణ ద్రావిడ భాషలకు పద నిర్మాణం పరంగా మధ్య ద్రావిడ భాషకు చెందిందని చెప్పిన మొట్టమొదటి భాషావేత్త ఎవరు?

జ) భద్రిరాజు కృష్ణమూర్తి గారు, తన తెలుగు వెర్బల్ బేసిస్ గ్రంథంలో


15) ద్రావిడ భాషల్లో సాధారణంగా ఉన్న సంధి ఏమిటి?

జ) పరరూప సంధి


16. ద్రావిడ భాషల్లో లింగవివక్ష దేనిని ఆశ్రయించి ఉంటుంది?

జ) అర్థాన్ని  ఆశ్రయించి ఉంటుంది.


17. ద్రావిడ భాషలలో కర్మణి ప్రయోగం సహజమేనా?

జ) సహజం కాదు


18. లలిత విస్తరణలో ద్రావిడ శబ్దమును గూర్చి ఏమని ఉంది?

జ) 64 భారతీయ లిపులలో 12వ లిపిగా ద్రావిడ లిపి అని ఉంది.


19. ద్రావిడ శబ్దం భాషాపరంగా కనిపించే గ్రంథాలు ఏవి?

జ) లలిత విస్తారం, నాట్యశాస్త్రం, తంత్ర వార్తికం.



20. ద్రావిడ శిశువుని ఎవరు ఏ గ్రంథంలో ప్రస్తావించారు?

జ) ఆది శంకరాచార్యులు తన సౌందర్యలహరిలో ప్రస్తావించారు.

 

21. ద్రావిడ శిల్పం దేశీ సంబంధమైన ఒక మూలికనే అర్థంలో చెప్పబడినది ఎందులో?

జ) అమరసింహుడు నామ లింగానుశాసనంలో


22. ఉత్తర ద్రావిడ భాషలు ఏవి?

జ) బ్రాహుయీ, మల్తో, కూడుఖ్.


23. ఉత్తర ద్రావిడ భాషలు కి పేరును సూచించింది ఎవరు?

జ) సర్ డేవిస్ బ్రే


24. దక్షిణదేశ ద్రావిడ భాషల పేర్లు ఏమిటి?

జ) తెలుగు, మలయాళం, కన్నడం తుళు, తొద, బడగ, కొడగు, కోత.


25. దక్షిణ ద్రావిడ భాషలు అన్న పేరును మొట్టమొదట 1938లో సూచించింది ఎవరు?

జ) వి. రామస్వామి అయ్యర్.


26. మధ్య ద్రావిడ భాషలు ఎన్ని? వాటికి ఆ పేరు సూచించినది ఎవరు?

జ) మధ్య ద్రావిడ భాషలు 10. అవి తెలుగు, కొండ, కుయి, కువి, కోలామి, గొండి, గదబ, నాయకి, పర్జి, ఓల్లరి. మధ్య ద్రావిడ భాషలకు పేరుని సూచించింది థామస్.బరో.


27. ద్రావిడ భాష నుండి వేరుపడిన తొలి భాష ఏది?

జ) బ్రాహుయీ


28. బ్రాహుయీ భాషను మాట్లాడే వారు ఏ ప్రాంతంలో ఉన్నారు?

జ) పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బెలుచిస్తాన్.


29. బ్రాహుయీ ద్రవిడియన్ కంపేరేటువ్ గ్రామర్ గ్రంథకర్త ఎవరు?

జ)ఎంవీ.ఎమినో


30. ఒకే రకమైన లింగభేదం కలిగి ఉండే ద్రావిడ భాషలేవి?

జ) కూడుఖ్, మాల్తో, తెలుగు.



31. లింగ వివక్ష లేని ద్రావిడ భాషలు ఏవి?

జ)తొద, బ్రాహుయీ.


32. ఏకవచన బహువచన భేదం లేని ద్రావిడ భాష లు ఏవి?

జ) కోత, కోడగు.


33. స్త్రీలింగ ఏక బహువచన బోధక ప్రత్యయాలను ప్రత్యేకంగా గల ద్రావిడ భాష ఏది?

జ) పెంగో


34. ద్రావిడ్ భాషల్లో వచన బోధక ప్రణాళిక దేనితో ముడిపడి ఉంటుంది?

జ) లింగ బోధక ప్రణాళిక.


35. మూల ద్రావిడ భాషల్లో మొత్తం వర్ణాలు ఎన్ని?

జ)26... అచ్చులు 10 హల్లులు 16.


36. ఆళ్ అనే అక్షరం చేరని ద్రావిడ భాషలు ఏవి?

జ) ఉత్తర దక్షిణ ద్రావిడ భాషలు.


37. ద్రావిడ భాషల్లో పదాది సంయుక్తాక్షరాలు అనేవి వస్తాయా?

జ) రావు


38. ఔప విభక్తికాలను కాల్డ్వెల్ ఏమని పేర్కొన్నారు?

జ) inflectionalincrements.


39. ఔప విభక్తికాలను తమిళం లో ఏమంటారు?

జ) సారియై


40. మలయాళంలో ఔప విభక్తికాలను ఏమంటారు?

జ) అనుసంధాయక వర్ణాలు



41. కన్నడంలో ఔప విభక్తికాలను ఏమంటారు?

జ)  ఆగమ వర్ణాలు


42. మూల ద్రావిడంలో ఏకవచన ఆత్మ ఆర్థక సర్వనామం ఏది?

జ)తాన్


43. మూల ద్రావిడంలో బహువచన సర్వనామం ఏది?

జ) తామ్


44. సంఖ్య వాచకాలలో అన్ని దేశీయ పదాలనే వాడే ద్రావిడ భాషలేవి?

జ) దక్షిణ మధ్య ద్రావిడ భాషలు


45. మొదటి మూడు మాత్రమే దేశి పదాలు మిగిలినవి అన్య దేశీయ పదాలు వాడే ద్రావిడ భాషలు ఏవి?

జ) ఉత్తర ద్రావిడ భాషలు


46. తెలుగులో మహాత్ ఏకవచన ప్రత్యయంకీ మూల రూపం ఏది?

జ) న్.త్



 47. అమహాత్ బహువచన ప్రత్యయం నిత్యం ఉపయోగించే భాషలేవి?

జ) మధ్య ద్రావిడ భాషలు


48. అమహాత్ బహువచన ప్రత్యయం వికల్పకంగా ఉపయోగించే భాషలేవి?

జ) దక్షిణ ద్రావిడ భాషలు


49. అమహాత్ బహువచన ప్రత్యయంలేని ఉత్తర ద్రావిడ భాషలేవి?

జ) కూడుఖ్, మాల్తొ.


50. మూలద్రావిడభాషా పదాదియ వర్ణం ఏ ప్రాచీనభాషల్లో మాత్రమే నిలిచి ఉంది?

జ) తమిళం


< br /> 51. మధ్య ద్రావిడ భాషల్లో పదాదియవర్ణం ఉంటుందా?

జ) లోపిస్తుంది.


52. మూల ద్రావిడ భాష వర్ణాలు ణ,ళ వర్ణాలు కేవలం ఏ భాషల్లో మాత్రమే నిలిచి ఉన్నాయి?

జ) దక్షిణ ద్రావిడ భాషలు


53. మూలద్రావిడ భాషల్లో నాదవత్ స్పర్శలు లేవని చెప్పింది ఎవరు?

జ) కాల్డ్వెల్


54. ప్రాచీన ద్రావిడ భాషలో మహా ప్రాణ నాదవత్ స్పర్శలు కుడా ఉన్నాయని భావించింది ఎవరు?

జ) యూల్స్ బ్లాక్


55. నాద స్పర్శలు మూల ద్రావిడ భాషలో లేవని తర్వాత కాలంలో ఆయా భాషల ద్వారా ఏర్పడ్డాయని భావించింది ఎవరు?

జ) థామస్ బరో


56. ద్రావిడ భాషల్లో వచన, లింగభేధం రెండు ఉండే సర్వనామాలు ఏవి?

జ) ప్రథమ పురుషుల్లోనే ఉంటాయి.

5 కామెంట్‌లు:

Blogger ఆధారితం.