నిఘంటువు-ప్రశ్నలు/ telugu dictionary/ telugu nighantuvu

 నిఘంటువులు - ప్రశ్నలు


1.  నిరుక్తమును రచించినది ?

జ.  యాస్కుడు (600 – 500 BC).


2. నిరుక్తముకు మరొక పేరు? 

జ. “వేద శబ్ద వివరణ నిఘంటువు” 


3. బాణుడు వ్రాసినది? 

జ.  “శబ్ద రత్నాకరము”


4. శ్రీహర్షుడు, మయూరుడు, మురారి మొదలయిన వారు రచించినవన్నీ ఏ కోవకు చెందినది? 

జ. “శ్లేషార్థ పదసంగ్రహ” కోవలోకి వస్తాయి.


5. వాచస్పతి వ్రాసినది? 

జ. “శబ్దార్ణవము లేదా శబ్ద కోశము”


6. వ్యాడుడు వ్రాసినది? 

“ఉత్పాలిని"


7. విక్రమాదిత్యుడు వ్రాసినది?

జ. “సంసారావర్తము”


8. కాత్యాయనుడు (3 BC) వ్రాసినది? 

జ.  “నామమాల” 


9. పురాతన నిఘంటువులన్నీ ఎక్కువగా పదము యొక్క  ఏ రూపాన్ని ఆధారంగా చేసుకుని వివరించినవి? 

జ.  నామవాచక రూపం


10. అమరసింహుడు (నాల్గవ శతాబ్దము) వ్రాసినది? 

జ. “నామలింగానుశాసనం” అనే నిఘంటువు.



11. అమరసింహుని ఏ రచన లో మొదటిసారిగా పదాల లింగాలను (స్త్రీలింగం/పుల్లింగం/నపుంసక లింగం) వివరిస్తూ నామాల వివరణ కూడా తెలిపాడు?

జ.  నామలింగానుశాసనం .


12.నాగలింగానుశాసనంలో, పదాలను మూడు కాండలుగా వర్గీకరించాడు. అవి? 

జ. మొదటి కాండ స్వర్గాది, రెండవ కాండ భూవర్గాది, మూడవది సామాన్యాది.


13. నామలింగానుశాసనం లో మూడు కాండలు ఉండటం వలననే దీనిని ఇలా అంటారు? 

జ. త్రికాండము 

Telugodu rathalu kuthalu



14. ఒక రంగము లేదా విభాగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానాన్ని కలిగి వుండే నిఘంటువుని ఏమంటారు?

జ.  కోశము 


15. నిఘంటువులకి ప్రాధమిక రూపాలుగా చెప్పదగినవి? 

జ.  కోశములు


16.  కోశములు ఎన్ని రకాలు?

జ. రెండు రకాలు: నామమాత్రతంత్ర (నామాలను లేదా పదాలను కలిగి వుండేవి), లింగమాత్రతంత్ర (నామాల లేదా పదాల లింగమును తెలియచేసేవి). 


17. అమరసింహుడు వ్రాసిన నామలింగానుశాసనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? 

జ.  అమరకోశము 


 18. “అమరము రానివారికి నేనమరను” అని చెప్పినది? 

జ.  వాగ్దేవి


 19. పురాతన నిఘంటువులలో చాలా ముఖ్యమయినది?

జ. అమరకోశము 


20. శాశ్వతుడు రచించిన నిఘంటువు? 

జ.  “అనేకార్థ సముచ్చయ” 



21.  మహాక్షపణకుడు (10AD అని చరిత్రకారుల అభిప్రాయం) రచించిన నిఘంటువు? 

జ. “అనేకార్థ ధ్వనిమంజరి” (ఇందులో నాలుగు అధ్యాయాలు – శ్లోకాధికారము, అర్థ శ్లోకాధికారము, పాదాధికారము మరియు వివిధాధికారము వుంటాయి) 


22. పురుషోత్తమదేవుడి నిఘంటువు? 

జ. “త్రికాండ శేషము“( “హారావళి” / హారావళి కోశము)


23. హారావళి నిఘంటు విశేషము? 

జ .బౌద్ధ పదాలను ఎక్కువగా చేర్చి, అర్థ వివరణ ఇవ్వటం.


24. సంస్కృత నిఘంటువులు ఎన్ని రకాలు?

జ.  సమానార్థ నిఘంటువులు (ఏకార్థ నిఘంటువులు – వీటిలో పదాలు అంశముల క్రమములో అమరి వుంటాయి), నానార్ధ నిఘంటువులు (అనేకార్థ నిఘంటువులు – వీటిలో పదాలు అంత్యాక్షర లేదా ఆద్యక్షర క్రమములో అమరి వుంటాయి). 


25. హలాయుధుడు (10AD) వ్రాసిన సంస్కృత నిఘంటువు? 

జ.  “అభిధాన రత్నమాల” [ఇందులో పదాలను అయిదు (స్వర్గ, భూమి, పాతాళ, సామాన్య పర్యాయపదాలు, సామాన్య నానార్థాలు) కాండలుగా విభజించాడు]


26. యాదవ ప్రకాశుడు (11AD) వ్రాసినది? 

జ.  “వైజయంతి” (ఇందులో పదాలను రెండు భాగాలుగా ఏర్పాటు చేసి, మొదటి భాగంలో పర్యాయపదాలను, రెండవ భాగంలో నానార్థాలను వివరించాడు, మొదటిసారిగా ఒక పదాన్ని ఎలా పలకాలో ఇందులో వివరించాడు)


27. ధనుంజయ మహాకవి (1123-1140) వ్రాసినది? 

జ. “పర్యాయ శబ్దరత్న” మరియు “నామమాల” (ఇది 200 శ్లోకాలతో, జనపదాలతో రూపొందించబడింది) 


28. అమరకీర్తుడు వ్రాసినది? 

జ.  “అనేకార్థ నామమాల” (కేవలం 46శ్లోకాలతో ధనుంజయుని నామమాలను ఆధారంగా చేసుకుని రచించాడు)


29. హేమచంద్ర సూరి (12AD) వ్రాసినది? 

జ.  “అనేకార్థ సంగ్రహము” (ఇందులో పదాలను ఆద్యక్షరాలను, అంత్యహల్లులను ఆధారంగా చేసుకుని ఏర్పాటుచేశాడు) మరియు “అభిధాన చింతామయి” (ఇందులో దేవాధిదేవ, దేవ, మర్త్య, భూమి, మొదలైన విభాగాలలో ఒక పదాన్ని ఎన్ని రకాలుగా, ఎలా వాడవచ్చో వివరించాడు)


30. కేశవస్వామి (12AD) వ్రాసినది? 

జ.  “నామార్థార్ణవ సంక్షేపము”



31. మహేశ్వర కవి (12AD) వ్రాసినది? 

జ.  “విశ్వ ప్రకాశము”


32. అభ్యపాలుడు (12AD) వ్రాసినది? 

జ.  “నామార్థ రత్నమాల”


33. మంఖుడు (12AD) వ్రాసినది? 

జ.  “అనేకార్థ కోశము”


34. మల్లభట్టు (12AD) వ్రాసినది? 

జ.  “అఖ్యాత చంద్రిక” (ఇందులో క్రియా రూపంలో వున్న పదాలకు అర్థ వివరణ వుంటుంది)


35. ధరణిదాసుడు (12AD) వ్రాసినది? 

జ.  “అనేకార్థ సారము”


36. మేదినీకారుడు (14AD) వ్రాసినధి? 

జ “మేదినీ కోశము” (దీనినే అనేకార్థ శబ్దకోశము అని కూడా అంటారు. ఇందులో పదాలను క-కారాంత, ఖ-కారాంత, గ-కారాంత, ఘ-కారాంత,మొ., క్రమంలో ఏర్పాటు చేశాడు)


37.  శ్రీధరసేనుడు వ్రాసినది? 

జ. “విశ్వలోచన లేదా ముక్తావళి”


38. దండాదినాథుడు (14AD) వ్రాసినది? 

జ.  “నానార్థ రత్నమాల”


39. వామనభట్ట బాణుడు (15AD) వ్రాసినది? 

జ. “శబ్ద చంద్రిక” ,“శబ్ద రత్నాకరము”


40. పద్మసుందరుడు (16AD) వ్రాసినది? 

జ.  “సుందర ప్రకాశ శబ్దార్ణవము”



41.అప్పయ్య దీక్షితులు (17AD) వ్రాసినది? 

జ.  “నామ సంగ్రహమాల”


42. తారానాథ తర్క వాచస్పతి (18AD) వ్రాసినది? 

జ. “వాచస్పత్యము” (వేదాంతము యొక్క సనాతన, అత్యాధునిక వ్యవస్థలలో వుండే నిబంధనలు, సిద్ధాంతాలను కూడా వివరించింది)


43. తెలుగు నిఘంటువులు ఎన్ని రకములు?

జ. పద్యరూప నిఘంటువులు మరియు పదరూప నిఘంటువులు.


44. పద్యరూప నిఘంటువులలో – కవి రాక్షసుడు వ్రాసిన నిఘంటువు? 

జ. “శబ్దార్థ నిర్ణయము”


45. గణపవరపు వేంకటకవి వ్రాసినది? 

జ.  “వెంకటేశ ఆంధ్రము” , “దేశీయ ఆంధ్ర నిఘంటువు”.


46. ధూర్జటి వెంకటరాయ కవి వ్రాసినది? 

జ.  “పద్యరూప అమర కోశము”


47. పైడిపాటి లక్ష్మణ కవి వ్రాసినది? 

జ.  “ఆంధ్ర రత్నాకరము”, “ఆంధ్ర నామసంగ్రహము”.


48. అడిదం సూరకవి వ్రాసినది? 

జ.  “ఆంధ్ర నామవిశేషము”


49. విరపరాజు వ్రాసినది? 

జ.  “ఆంధ్ర పదకారం”


50. ప్రగడకవి వ్రాసినది? 

జ.  “నానార్థ నిఘంటువు”



51. నందపాక పార్వతీశ్వర శాస్త్రి వ్రాసినది? 

జ.  “అక్షర మాలికా నిఘంటువు”


52. జయరామరాయులు వ్రాసినది? 

జ.  “జయరామ నానార్థ నిఘంటువు” (ఇది మూడు భాగాలుగా వెలువడింది : నానార్థ నిఘంటువు, అర్థానుస్వార నిఘంటువు మరియు శకటరేఫ నిఘంటువు)


53. కస్తూరి రంగ కవి వ్రాసినదు? 

జ.  “సాంబ నిఘంటువు”


54. నుదురుపాటి వెంకటకవి వ్రాసినది? 

జ. “ఆంధ్ర భాషా అర్ణవము” 


55. చౌడప్ప కవి నిఘంటువు ఎన్ని పద్యాలు రూపంలో వ్రాశాడు? 

జ. “36 సీస పద్యాల” రూపంలో 


56. తెలుగులో పదరూప నిఘంటువులు ఏ శతాబ్దం లో వచ్చాయి? 

జ. 19వ శతాబ్దంలో


57. తెలుగులో మొట్టమొదటగా చెప్పుకోదగిన నిఘంటువు ఏది? 

జ. మామిడి వెంకటరాయ కవి వ్రాసిన “ఆంధ్ర దీపిక” (1816) 


58. మొట్టమొదటి పద నిఘంటువుగా పేరొందిన  జయంతి రామయ్య పంతులు వ్రాసిన నిఘంటువు?

 జ. “సూర్యరాయాంధ్ర నిఘంటువు” (1936).


59. పరవస్తు చిన్నయసూరి వ్రాసినది? 

జ.  “చిన్నయసూరి నిఘంటువు” (పదాలను ఎలా వాడాలో ప్రామాణిక రచనలను ఆధారంగా చేసుకుని విశదీకరించింది.)


  
60. చిన్నయసూరి నిఘంటువు ఎన్ని సంపుటాలుగా వెలువడింది?

జ.  ఏడు


61. పరవస్తు వెంకట రంగాచార్యులు వ్రాసినది? 

జ.  “శబ్దార్థ సర్వస్వం” 


62.  బహుజనపల్లి సీతారామాచార్యులు వ్రాసినది? 

జ.  “శబ్ద రత్నాకరము”, “వైకృత పద దీపిక”, “బాల చంద్రోదయము” (పిల్లల కోసం వ్రాసిన లఘు నిఘంటువు) మరియు “పదార్థ నామకోశము” 



1 కామెంట్‌:

Blogger ఆధారితం.