తెలుగు శాఖ, రాష్ట్రీయసంస్కృత విద్యాపీఠం, తిరుపతి / Telugu department,Rashtra Sanskrit vidhya peetha,tirupati

తెలుగు శాఖ

శ్లోకం వినండి...👇


రాష్ట్రీయసంస్కృత విద్యాపీఠం, తిరుపతి నందు గల సంప్రదాయ విశ్వవిద్యాలయంలోనిది ఈ తెలుగుశాఖ. 


ఈ వీడియో తెలుగుభాషా, సాహిత్యాలను గూర్చి తెలియజేసే కార్యక్రమాలు, పండుగలు, సభలు-సమావేశాలు మొదలయిన చిత్రాలతో కూడుకున్న చిన్న రూపం....ఇదే


అప్పుడు మేమంతా మనమంతా కలిసిమెలిసి చేసిన విద్యాభ్యాసం. మాకు చెలిమి-కలిమిలు నేర్పిన, తెలిపిన, వాడిన వివిధ విధాలైన, విధానాలను, ఆలోచనలను, పనులను, ప్రదర్శనలను, హావభావాలను, ప్రతిభలను,
వెలికితీసిన వేదిక అన్నమాచార్య సాహిత్య కళా పరిషత్.

నిజం చెప్పాలంటే ఈ పరిషత్ మాలో ఎన్నో పరిస్థితులకు పరిష్కారాలని ప్రస్ఫుటీకరించింది. ప్రతి ఆదివారం ఉదయం, సాయంత్రం ఏదొక సమయంలో మమ్మల్ని అలరించేది. తెలుగు భాష-సాహిత్యం వైభవాన్ని తెలిపే చిత్రప్రదర్శనలు మధురానుభూతిని అందించేవి.

మా విద్యా సంవత్సరం చివరలో అన్నమాచార్య సాహిత్య కళా పరిషత్ లోని బృందచిత్రం⬆️

అలాగే ఈ అన్నమాచార్య సాహిత్య కళా పరిషత్  పంచుకోవడంలోని సహాయ బాధ్యతలను, స్నేహాలను, పరిచయాలను, ఒక్కటేమిటి అదొక సైన్యం లాగా ఉండేది. అదొక్కటి చాలు మాకు తెలుగు వాళ్ళముగా మేము మా సంస్కృతిని తెలపడానికి అనిపించేది. ఆ రోజులే నేను ఇప్పుడు ఇలా గడిపే రోజులకి పుట్టిన ఫలితాలు.

మరిన్ని వివరాలకు http://rsvidyapeetha.ac.in/ 

వ్యాఖ్యలు లేవు

Blogger ఆధారితం.