గుడిపాటి వెంకటాచలం

*గుడిపాటి వెంకటాచలం* 



                    గుడిపాటి వెంకటచలం మే 19, 1894 లో జన్మించారు. చలం వృత్తిరీత్యా  ఉపాధ్యాయుడు. చలం గారి రచనలు మిగతా రచయితల రచనలకు భిన్నమైనవి. ప్రత్యేకించి *వీరూ రాసే వచనం లో ఎక్కువ కవితాత్మంగా వుండి ఆసక్తీకరంగా చదివించేస్తుంది*. 

              *చలం కు ఆత్మకథలు అంటే ఇష్టముండదు*.అయినా సరే తనమీద తానే ఒక పుస్తకాన్ని వ్రాసి (1972), దానికి "చలం" అని పేరు పెట్టాడు. వారి మాటలోనే చెప్పాలంటే 

          *ఆత్మకథలంటే నాకసహ్యం*
           *ఆత్మకథ వ్రాయడమంటే*
           *తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు*
           *తానేదో ప్రజలకి తీరని*
                   *ఉపకారంచేసినట్టు*,
           *తన సంగతి చెప్పుకోకపోతే*
           *లోకానికి తన గొప్ప తెలియనట్టు*,
           *తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు*
            *అనుకొంటున్నాడన్నమాట*,
                       *రాసినవాడు*.
            *ఎందుకు పుట్టానా*
            *పుట్టినవాణ్ణి చప్పున చావక*
            *ఎందుకింత కాలం తన*
            *పరిసరాలని ఇంత కల్మషం చేశానా*
            *అనుకునే నావంటివాడు*
            *తనకథ సిగ్గులేకుండా*
                   *చెప్పుకొంటున్నాడంటే*
            *ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు*

                          నిజానీకీ సంప్రదాయ కుటుంబం లో పుట్టిన చలం మొదట్లో నిష్ట గరిష్టుడిగా వుండేవాడు. తన చెల్లెలు పెళ్ళి అర్ధంతరంగా ఆగిపోవడం. ఇంట్లో కలతలు ఇవ్వన్ని కూడా తనను సంప్రదాయ నిరసన కు దారితీసింది. *స్త్రీల పట్ల న్యాయ విచక్షణ వైపు మళ్ళించింది*.

                  ఇక చలం రచనల్లో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. *అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని తీవ్ర విమర్శల పాలు అయినాడు. అంతేకాదు వ్యక్తీగతంగా చలం గురించి తెలిసిన వారూ ఎవ్వరూ ఆతనినీ దగ్గరకు రానిచ్చేవారూ కాదట. పోనీ కుటుంబ సభ్యుల జీవితాలు అయిన సరిగ్గా ఉన్నాయా అంటే అదీ కూడా అంతంతా మాత్రమే*. వీరి పెద్ద కొడుకు (రవి ) చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు (వసంత్ ) దురలవాట్లకు బానిసై, ఇల్లు వదలి ఎటో వెళ్ళి పోయాడు. ఇక కూతురు సౌరిస్ అయితే వివాహమే  చేసుకోలేదు. సన్యాసినిగా మారింది. ( ఈవిడే చలం చనిపోయాక దాహన సంస్కారాలు జరిపించారు) ఇలాంటి సమస్యలున్న చలం గారు పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద " *బిడ్డల శిక్షణ*  అనే పుస్తకం రాయడం విచిత్రం!

చలం రచనలు ....

*నవలలు* :- 
1) మైదానం (1928)
2) అరుణ (1939)
3) వివాహం (1928)
4) శశిరేఖ (1921)
5) దైవమిచ్చిన భార్య (1923)
6) అమీనా (1924)

*నాటకాలు* :- 
1) పూరురవ    2)  పద్మరాణి
3) వేలియాలి అబద్దాలు
4) చిత్రాంగి       5) జయదేవ
6) శశాంక
7) జానకీ వేదన (రష్యన్ భాష లో )

*కథలు* :-
1) మా కర్మ ఇట్లా కాలింది (1925)
2) మధుర మీనాక్షి (1925)
3) విడాకులు (1938)
4) కన్నీటి కాలువ (1924)
5) హంపీ కన్యలు
6) సినిమా జ్వరం
7) చక్కనమ్మ కథ (నార్వే భాషలో)
8) ఓ పూవు పూసింది

*ఇతరములు* :-
1) సుధ (కావ్యం )
2) విషాదం ( వ్యాస సంపుటి )

                  చలం రాసిన దోషగుణం కథ ఆధారంగా " *గ్రహణం* " అనే సినిమా వచ్చింది. దీనికీ *ఇంద్రగంటి మోహన్కృష్ణ* దర్శకులు. అలాగే *మైదానం* నవలను *తనికెళ్ళ భరణి* గారు సిన్మా తీయాలనీ ప్రయత్నించారు. కానీ ఎందుకో అదీ కార్య రూపం దాల్చలేదు.


                          చలం గారి స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీనెదిరించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. *ఈ విషయాలపై  చలం చివరి దశలో వున్నప్పడూ తీవ్ర పశ్చత్తాపపడ్డాడు. రచనల ను బూతు సాహిత్యంగా పరిగణించి వెలివేశారు.ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదలి తమిళనాడులోని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతోసహా వెళ్ళిపోయాడు*. మొదటి నుంచి నాస్తికభావాలతో సతమతం అయ్యి దైవం పై అపనమ్మకం తో విప్లవాత్మక ఆలోచనలు వున్న చలం *చివరికాలం లో పూర్తిగా ఆధ్యాత్మిక తత్వం తో కూడి సంతృప్తి చెందాడు*.
                      ఇక వీరి చలం కవిత్వం విషయం కు వస్తే వీరి కవితలలోని తాత్వికత శైలి అందరినీ విస్మయపరుస్తుంది. వీరి  రచనాశైలీ ఇతివృత్తం ప్రభావితం గా వుంటుంది.

చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…

" *వానరాత్రి* " లో ఏమంటారో చూడండి…

       " *ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు*
         *వీస్తోంది గాలి*
         *నల్లని రాత్రి ఇంకా నల్లని*
         *మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది*
         *హోరుమని అరుస్తో వాన*
         *తలుపులు మూసి దీపం వెలిగించుకున్న*
         *వాన లోపలికి వస్తానని పంతం పట్టి*
          *తలుపు మీద ఈడ్చి కొడుతోంది*
         *తెరవమని కొంచం మర్చిపోతుంది*
         *మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును*
         *దబదబా బాదుతుంది*;
         *నా విరహ బాధని*
         *ఈ రాత్రిలో కలిపెయ్యలేను?*

                   వీరి కవిత్వం సామాన్యంగా ఆలోచిస్తే అర్ధం కాదు.టైం పాస్ గా కవితలు చదివే వాళ్లకు అస్సలు తలకెక్కదు. *స్థూలంగా అర్ద్రత తో రాసే వీరి కవిత్వం అసామాన్యం* 

                బసవరాజు అప్పారావు గారనట్లు " *ఒక గొప్ప కవిత్వపు పంక్తి కొసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు*" అనడం లోనే చలం ప్రత్యేకత తెలుస్తుంది.
                      ఎంతో మంది ఠాగూర్ " *గీతాంజలి*" నీ తెలుగు లో అనువదించారు. అయినప్పటికీ చలం తన శైలి లో రాసిన అనువాదమే ఇప్పటికీ ప్రత్యేకమైనది. 

       " *వొంటి పై రాజ వస్త్రాలు*
        *మెడలో బంగారు హారాలు*
        *ధరించిన బాలుడికీ*
        *ఆటలో సంతోషం ఎట్లా కలుగుతుంది*
        *ప్రతి అడుగునా ఆతని దుస్తులు*
       *అతనికీ అడ్డు పడతాయి* " 

       " *నా పాట అలంకారాల్ని విసర్జించింది*
         *నగల్ని చీరల్ని చూసీ గర్వపడదు*
         *ఆభరణాలన్ని మన*
         *ఐక్యన్నీ చేరుపుతాయి*
        *నీకూ నాకు మధ్య అవి అడ్డం*
          *నీ రహస్య వాక్కుల్ని వినపడకుండా*
          *చేస్తుంది గల గల* "



చలం రచనల పై *పరిశొధనలు* కూడా జరిగాయి.

1) చలం నవలలు - సామాజిక చైతన్యం - మైనవరం ఈదారెడ్డి
2) చలం సాహిత్యం అక్షరాభిషేకం - గొర్రెంపాటి వెంకట సుబ్బయ్య

                                  చివరగా ....విమర్శకులు అన్నట్లు చలాన్ని ఇష్టమున్న వాళ్లు చదివితే చదవనివ్వండి. *ఏ స్త్రీల స్వేచ్ఛ సానుభూతి గురించి తను రచనలు చేసాడో వారే చలం  రచనలు  వ్యతిరేకించారనేది నిజం. ఆస్తకీకరం వున్నంత మాత్రనా అన్నీ అనుకరించాలిసిన అన్నీ అక్కున చేకూర్చాలిసిన పని లేదు* అందుకే చలం రచనలు బహిరంగం గా వున్న నిషేధించబడాయి. సరే ఏదీ ఏమైన సెక్స్ ప్రసక్తి తేవడమే అపరాధం గా భావించే సాహిత్యం లో చలం ఒక విప్లవం.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.