శప్తభూమికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం

"శప్తభూమికి  కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం"






అనంతపురం జిల్లాకు చెందిన రచయిత బండి నారాయణ స్వామి రచించిన నవల "శప్తభూమి"కి 2019వ సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. స్వామిగా ప్రసిద్ధులైన బండి నారాయణ స్వామి రచించిన ఈనవలకు 2017లో తానా నవలల పోటీలో  ఉత్తమ నవలాబహుమతి లభించింది.
     స్వామి  ఇదివరకే నలభైదాకా కథలు రాశారు. గద్దలాడతండాయి, మీరాజ్యం మీరేలండి, రెండుకలల దేశం శప్తభూమి నవలలు రాశారు. రాయలసీమ సమాజం సాహిత్యం అనే విమర్శగ్రంథం రాశారు. స్వామి గారిది దళిత బహుజన దృక్పథం. అంతేగాక రాయలసీమ అస్తిత్వస్పృహ కూడా ఉంది. అలాగే మార్క్సిజం  నేపథ్యమూ ఉంది.

           శప్తభూమి క్రీ.శ. 18వశతాబ్దపు రాయలసీమ సామాజిక వాస్తవికతకు నిరూపం. చారిత్రకమైన నవల. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా నడుస్తున్నకాలంలో స్వామి గారు ఆ ఉద్యమానికి మద్దతునిచ్చారు. ఆ సమయంలో ఈనవలను రాశారు.

         పూర్వము  త్రిపురనేని గోపీచంద్, మాలతీచందూర్, అంపశయ్య నవీన్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సలీం వంటిరచయితలు ఇదివరకే సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. ఈవరసలో స్వామి గారు ఇప్పుడు ఈ  పురస్కారానికి ఎన్నికైనారు.

           1956నుండి రాయలసీమ వాసులైన పుట్టపర్తి నారాయణా చార్యులు, రారా, మధురాంతకం రాజారాం, కేతు విశ్వనాథరెడ్డి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తిరుమల రామచంద్ర, రాచపాళెం, కొలకలూరి వంటివారు అందుకున్న సాహిత్యపురస్కారాన్ని ఇప్పుడు స్వామి గారు అందుకుంటారు.

   స్వామి గారు 1952 జూన్ 03న పుట్టారు. 
   ఎంఏ తెలుగు చదివి అధ్యాపకుడుగా పని           చేశారు. ఈ సందర్భంగా స్వామిగారికి శుభాకాంక్షలు తెలుపుతూ...🙏🙏.
         

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.