తెలుగు భాషా-సాహిత్య ప్రశ్నలు/ Telugu language and literature questions

 తెలుగు భాషా-సాహిత్య ప్రశ్నలు


పాట వినండి...👇

1. తెలుగులోని ఏ సంధర్బంలో విసంధిని                      పాటించవచ్చు   అని నన్నయాది మహా కవులు        చెప్పారు?

 2. ప్లుతానికి మరో పేరు?

 3. సూర్య ఇంద్ర గణాలను ఏ గణాలు అంటారు?

 4."తగణం " అది దేవత ఎవరు?

 5. తెలుగు దేశి పద్దతి ని అనుసరించి
 ఏర్పడ్డ               పద్యాలను ఏమంటారు?

 6. శ్రీనాధుడు వ్రాసిన  పలనాటివీరచరిత్ర ఏ                  ఛందస్సులో ఉంది?

 7. అట వెలది అనగా అర్ధం ఏమి?

 8. తేటగీతి అనగా అర్ధం ఏమి?

 9. పుష్పవిలాపo అనే పాఠ్యoశం ఏ  ఛందస్సులో          వ్రాసారు?

 10. నన్నయ భారతoలో ఎక్కువగా వాడిన                   ఛందస్సు ఏది?



జవాబులు:౼



1. వాక్యాంతములో.
2. కాకువు.
3. ఉపగణాలు.
4. ఆకాశం.
5. జాతి పద్యాలు.
6. మంజరీ ద్విపద.
7. నటి, నర్తకి, వేశ్య.
8. పాట.
9. తేటగీతి.
10. మధ్యాక్కర.


జంటకవుల - ప్రశ్నలు:౼

1. సోదర జంట కవులు

2. పిడుపర్తి కవులు

3. రాచమల్లు కవులు

4. తిరుపతి వేంకట కవులు

5. వేంకట పార్వతీశం కవులు

6. పింగళి కాటూరి కవులు

7. సత్యా0జనేయ కవులు


జవాబులు:౼

1. కాచవిభుడు, విఠలనాథుడు

2. పిడుపర్తి బసవన,  పిడుపర్తి సోమన

3. నంది మల్లయ ఘంట సింగన

4. తిరుపతి దివాకర్ల శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి

5. బాలాంత్రపు వెంకట రావు, ఓలేటి పార్వతీశం

6. పింగళి లక్ష్మీకాంతం,  కాటూరి వెంకటేశ్వరరావు

7. విశ్వనాథ సత్యనారాయణ, 
     కొడాలి ఆంజనేయులు


కవుల-బిరుదుల ప్రశ్నలు:౼

1. ఆంధ్ర జయదేవుడు
2. ఆంధ్ర భోజుడు
3. ఆంధ్ర కాళిదాసు
4. ఆంధ్ర సరస్వతి
5. ఆంధ్ర భర్తృహరి
6. ఆంధ్ర వాగీశుడు
7. ఆంధ్ర విశారదుడు
8. ఆంధ్ర పాణిని
9. ఆంధ్ర వాల్మీకి

జవాబులు:౼

1. బమ్మెర పోతన
2. శ్రీ కృష్ణ దేవరాయలు
3. కస్తూరి రంగకవి, ఆలూరి కుప్పన
4. ఊటుకూరి లక్ష్మీ కాంతం
5. తాత సుబ్బరాయ శాస్త్రి
6. తాత సుబ్బరాయ శాస్త్రి
7. తాపీ ధర్మారావు
8. నివర్తి శేషాచల కవి
9. వావికొలను సుబ్బారావు



బిరుదులు-ప్రశ్నలు:౼

10. ఆంధ్ర షెల్లీ
11. ఆంధ్ర కీట్స్
12. ఆంధ్ర మిల్టన్
13. ఆంధ్ర స్కాట్
14. ఆంధ్ర కల్హన్
15. ఆంధ్ర జాన్సన్
16. ఆంధ్ర వర్డ్స్ వర్త్
17. ఆంధ్ర ఎడిసన్
18. ఆంధ్ర కైయుతుడు

జవాబులు:౼

10- దేవులపల్లి కృష్ణ శాస్త్రి,వేదుల సత్యనారాయణ శాస్త్రి
11- దేవులపల్లి కృష్ణ శాస్త్రి
12- చిలకమర్తి వారు
13- చిలకమర్తి వారు
14- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
15- కొక్కొండ వేంకటరత్నం పంతులు
16- కవికొండల వెంకటరావు
17- పానుగంటి లక్ష్మీ నరసింహం


సాహిత్య - ప్రశ్నలు:౼

1. పద్దులు రాసే పద్ధతులను వివరించిన కావ్యం          ఏది?

2. 'బణ జిగురు ' పేరుతో కన్నడ ప్రాంతంలో                  ప్రసిద్దులైన వృత్తి గాయకులు ఎవరు?

3. పోతన భాగవతంలో నాచన సోముని రచనతో        సంవదించే ఘట్టం ఏది?

4. పోసగముత్తేపు సరుల్ పోహలించి లిల.... అని        కవిత్వం చెప్పిన కవి ఎవరు?

5. క్షత్ర చూడామణి - కి  మూల మైన తమిళ గ్రంధం      ఏది?

6. "మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు"            గేయ రచయితఎవరు?

7. జానపద విజ్ఞానం పరిధిలో చేరని అనుకరణ            ప్రక్రియ ఏది?

8. 'ఓరులేయవి యొనరించిన.... పరమధర్మ                 పదముల కెల్లన్ ' పద్యం ఉన్న పర్వం ఏది?

9. జాoబపురాణం చెప్పే  వృత్తి గాయకులు ఎవరు?

10. మిశ్ర భాషా నిఘంటువు కర్త?


జవాబులు:౼

1. విజ్ఞానేేశ్వరి
యం

2. బలిజలు

3. నరకవధ

4. పింగళి సూరన

5. జీవక చింతామణి

6. అందెశ్రీ

7. హరి కధ

8. శాంతి పర్వం

9. డక్కలి వారు

10. సి. పి బ్రోన్


పూర్తి పేర్లు-ప్రశ్నలు:౼

1.బాపు

2.ఆత్రేయ

3.ఆరుద్ర

4.శ్రీశ్రీ

5.జాలాది

6.సాహితి

7.వనమాలి

8.వెన్నెలకంటి

9.దాశరథి

10.జంధ్యాల

జవాబులు:౼

1. సత్యరాజు వేంకట లక్ష్మీ నారాయణ

2. కిళాంబి నరసింహాచార్యులు

3. భాగవతుల సదాశివశంకర్ శాస్త్రి

4. శ్రీరంగం శ్రీనివాసరావు

5. జాలాది రాజారావు

6. చెరుకుపల్లి శ్రీరామచంద్ర మూర్తి

7. మునిగోపాల్

8. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్

9. దాశరథి కృష్ణమాచార్యులు

10. జంధ్యాల వీర వేంకట శివ సుబ్రహ్మణ్య శాస్త్రి


సాహిత్య -ప్రశ్నలు:౼


1. రసం చేతనే కావ్యం సర్వం జీవిస్తుంది రస                
శూన్యమైన కావ్యంలేదు అని చెప్పినది ఎవరు?

2. భరతుని దృష్టిలో కావ్యం అంటే ఏమిటి?

3. దృశ్యకావ్యానికి ప్రధానమై నది  రసం అనే              భావాన్ని చెప్పింది ఎవరు?

4. భామహుని మతంలో కావ్య శరీరము ఎన్ని              రకములు?

5. అలంకారాములు ఆ కావ్య శోభా                              సంపాదకములు
  అని అలంకార ప్రాధాన్యతను        తెలిపిన వారు ఎవరు?

6. మొట్ట మొదటిసారిగా గుణ ప్రాధాన్యత తెలిపిన      వారు ఎవరు?

7. గుణ సిద్ధాంతంను ప్రతిపాదించినవారు ఎవరు?

8. దండి దృష్టిలో కావ్యానికి ఆత్మ వంటిది ఏది?

9. అలంకారికులుచెప్పిన గుణములే కాకుండా              "రామాయణ ప్రశంసలో ఏ గుణం                              సూచించబడింది?

10. దోషాల విపర్యయములే గుణములు అని                 అన్నది ఎవరు?


జవాబులు:౼

1- అభినవగుప్తుడు

2- దృశ్యకావ్యం/ఇతివృత్తం

3- ఆనంద వర్ధనుడు

4- 2 రకాలు, శబ్దం-అర్ధం

5- భామహుడు

6- భరతుడు

7- దండి

8- గుణము

9- మధుర/మాధుర్య

10- భరతుడు.




జానపద సాహిత్యం-ప్రశ్నలు:౼

1. కాళ్ళగజ్జి-కంకాల‌మ్మ,వేగుచుక్క వెలగామొగ్గ"
    ఇందులో వెలగమొగ్గలో ఏ ద్రవ్యం దాగి ఉంది?

2. గుడుగుడు గుంచెం  గుండేరాగం పాటలో                  పాటలో దేనికి వైద్యం చెప్పబడింది?

3. లింగాదారిండ్లలో శుభాశుభకర్మలకై పురోహిత్యం       నేర్పేది?

4. బీరన్న-బీరప్పల ఆరాధ్య దైవం ఎవరు?

5. "బుడిగె" వీరు వాయించే వాయిద్యం పేరు?

6. పోతవి గదవే నా ముద్దుకాయ-పోతివీ గదవే            నస్యకాయ" ఇది ఏ పాట?

7. జానపద వాజ్మయంను "అనాదృత వాజ్మయం"       అన్నది ఎవరు?

8. "ఆంధ్ర పదములు పాటలు" ఎవరి రచన?

9. తెలుగు వీరగాధకవిత్వంలో మొత్తం ఎన్ని                వీరగాధలు ఉన్నాయి?

10. అనంతపురం జిల్లా పాటలు రచించినది                  ఎవరు?

11. పెద్దిరాజు కధ పోచిరాజు కధలు ఎందులో                కలవు?

12. గృహాలంకరణము-ముగ్గులు గ్రంధకర్త ఎవరు?

13. మిన్నేరులో జానపద పాటల సంఖ్య ఎంత?


 జవాబులు:౼

1. పాదరసం

2. పాముకాటుకు

3. శారదకాండ్రు

4. మల్లన్న స్వామి

5. జంగములు

6. హాస్యపు పాట

7. మల్లంపల్లి సోమశేఖరశర్మ

8. టేకుమళ్ళ అచ్యుతరావు

9. 910

10. జి.యస్.మోహన్

11. కాటమరాజు కధలు

12. జి.వెంకటేశ్వరరావు

13. 382



సాహిత్య-ప్రశ్నలు:౼


1. అర్ధ ప్రకృతులు ఎన్ని?

2. శ్రవ్య కావ్యం ముగింపులో ఏ ప్రత్యేకత                    ఉంటుంది?

3. దృశ్యం కావ్యం ముగింపు లో ఏ ప్రత్యేకత                 ఉంటుంది?

4. అలంకారం అంటే అత్యంత ప్రధానమైనది ఏది?

5. అలంకార శాస్త్రం లో ప్రధానంగా ఎన్ని                      గుణములు ఉన్నాయి?

6. అలంకారికులు ఎన్ని రీతుల్ని గురించి                      పేర్కొన్నారు?

7. "ఆరభటి" అంటే ఏమిటి?

8. నవవిద పాకములను గురించి పేర్కొన్న                    అలంకారికుడు ఎవరు?

9. అలoకార శాస్త్రంలోని ప్రధాన పాకాలు ఎన్ని?

10. కవి మన ప్రాచీన అలంకారికుల దృష్టిలో                  ఎలాoటి వాడు?



జవాబులు:౼


1. ఐదు

2 ఫలశృతి

3. భరత వాక్యం

4. సౌందర్యం

5. ఐదు

6. మూడు

7. అర్ధవృత్తి

8. రాజశేఖరుడు

9. మూడు

10. నిరంకుశుడు

2 కామెంట్‌లు:

  1. అచ్చుతప్పులు ఎక్కువగా ఉన్నాయండి. దయచేసి సవరించగలరు‌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్నించగలరు...రాయడానికి ఉపక్రమించినపుడు... మీటలు తడబాటు బడ్డాయి...సరిచేస్తాను...ధన్యవాదాలు..🙏🙏.

      తొలగించండి

Blogger ఆధారితం.