వంగపండుగారి పాట - ఏం పిల్లడో ఎల్దుమోస్తవా/ em pillado song lyrics/ vangapandu gari video song

                      ఏం పిల్లడో - వంగపడుగారి పాట
        
శ్రీకాకుళం నక్సల్బరీ  విప్లవోద్యమంలో ప్రజలను ఉద్దేశించి పాడిన  జానపద బ్రహ్మ వంగపండు ప్రసాదరావు గారి పాట జానపద సాహిత్యంలో ఒక మైలురాయి అని చెప్పాలి. ఎప్పటికీ ఎల్దామోస్తవా అంటే జనులు గుర్తించే పాట...ఇది...
వినండి...🎶  


 

ఏం పిల్లడో ఎల్దు మోస్తవా...
ఏం పిల్లో ఎల్దా మోస్తవా... 

అరె శ్రీకాకుళంలో సీమకొండకు            "ఏంపిల్లడో"

చిలకలు కత్తులు దులపరిత్తయట       "ఏంపిల్లడో"

సాలూరవతల సవర్ల కొండకు              "ఏంపిల్లడో"

సెమర పిల్లులు శంఖమూదెనట           "ఏంపిల్లడో"

నలగొండ నట్టడివిలోనికి.                     "ఏంపిల్లడో"

పాముల్ని పొడిచిన చీమలున్నయట     "ఏంపిల్లడో"

తెలంగాణ కొమరయ్య కొండకీ.             "ఏంపిల్లడో"

గెద్దని తన్నిన గేతులున్నయట              "ఏంపిల్లడో"

ఆకులు మేసిన మేకల కొండకి.              "ఏంపిల్లడో"

పులుల్ని మింగిన గొర్రెలున్నయట          "ఏంపిల్లడో"

రాయలసీమ రాలు కొండకీ                    "ఏంపిల్లడో"

రత్తం అరె రత్తం రాజ్జెం యాలతన్నదట    "ఏంపిల్లడో"

తూరుపు అరె తూరుపు దిక్కున దోరకొండకీ
                                                          "ఏంపిల్లడో"
తుపాకి చల్‌ తుపాకి పేల్చిన తూరీగలున్నయట 
                                                          "ఏంపిల్లడో"

కలకత్తా కొసకాడ కొండకీ.                   "ఏంపిల్లడో"

ఎలికలు పిల్లిని ఎంటాదగిలెనట          "ఏంపిల్లడో"

ఏం పిల్లడో ఎల్దుమోస్తవా...
ఏం పిల్లో ఎల్దామోస్తవా...


ఏయు - తెలుగుశాఖ వద్ద కలిసిన సందర్భంలో

 ఏయు తెలుగుశాఖలో స్వహస్తాలతో వాయిస్తూ విద్యార్థులను చైతన్య పరుస్తున్న జానపద బ్రహ్మ వంగపడుగారు...

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.