మల్లెతీగకు పందిరివోలే - గద్దర్ గారి పాట/ malle theegaku pandirivole by gadda/ anna-chelli pata
గద్దర్ గారు రాసిన ఒకేఒక్క సినిమా పాట
చిత్రం:- ఒరేయ్ రిక్షా
రచన:- గద్దర్ గారు
గానం&సంగీతం:- వందేమాతరం శ్రీనివాస్ గారు
పాటను వినండి:----🎶
పల్లవి:-
ఆ--- ఆ ఆ ఆ---
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా---
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా---
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా---
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా---
ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మా
ఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
అటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా---
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా---
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా---
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా---
"మల్లెతీగ"
అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా
ఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్
అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మా
కన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్
సిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువ్వు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
సిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువ్వు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
ఒక్క గడియ నువ్వు మాటాడకుంటే చెల్లెమ్మా---
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా---
బువ్వ తినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా---
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా---
"మల్లెతీగ"
ఇల్లువాకిలి వదిలిపెట్టి ఆడపిల్ల బడికి వెళ్లి
భుజం కట్టి చదువు చదివేదెందుకు
ఆ---కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
ఆ---కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతా
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పండో కూడబెట్టుతా
నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా---
నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా---
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా---
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా---
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా---
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా---
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా---
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా---
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా---
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా---
"మల్లెతీగ"
Leave a Comment