శ్రీవేంకటేశ్వర స్తోత్రం/sri venkateswara sthothram/pradhana in telugu

<<శ్రీవేంకటేశ్వర స్తోత్రం>>


కమలాకుచ చూచుక కుంకుమతో

నియతారుణి తాతుల నీలతనో

కమలాయత లోచన లోకపతే

విజయీభవ వేంకటశైలపతే!


సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ

ప్రముఖాఖిల దైవతమౌలి మౌళిమణే

శరణాగత వత్సల సారనిథే

పరిపాలయమాం వృషశైలపతే!



అతివేలతయా తవ దుర్విషహై

రనువేల కృథై రపర దాశరథై

భరితం త్వరితం వృషశైలపతే

పరయా కృపయా పరిపాహి హరే!


అధి వేంకటశైల ముదారమతే

ర్జనతాభిమతాధిక దానరతాత్

పరదేవతయా గది తన్నిగమై

కమలా దయితాన్న పరం కలయే!


కలవేణు రవావశ గోపవధూ
శతకోటి వృతాత్స్మరకోటి సమాత్
ప్రతిపల్లవి కాభి మతాత్సుఖదాత్
వసుదేవవసుతాన్న పరం కలయే!
అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే!

అవనీ తనయా కమనీయ కరం
రజనీచర చారు ముఖాంబురుహం
రజనీకర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామమయే!

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘశరం
అపహాయ రఘూద్వహ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే!

వినా వేంకటేశం న నాథో ననాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ!

అహం దూరతస్థే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయాగత్య సేవాంకరోమి
సకృత్సేవయానిత్య సేవా ఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభు వెంకటేశా!

అజ్ఞానినా మయాదోషాన్న
శేషాన్ విహితాన్ హరే
క్షమస్తత్వం క్షమస్తత్వం
శేషశైల శిఖామణే!



నేను చదు వుకున్నటువంటి శ్రీ గోగినేని సంస్కృతాంధ్ర కళాశాల మరియు తెలుగు శిక్షణా విభాగంలో ఈ వేంకటేశ్వర స్త్రోత్రమును ప్రతి రోజూ ఉదయం తరగతులు ప్రారంభం అయ్యేటప్పుడు ప్రార్థనా గీతంగా ఆలపించడం జరుగుతుంది. అటువంటి వాటిని ఎన్నిసార్లు ఎన్ని రోజులు పాడినా కానీ మరల మరల మదిలో మెదులుతూనే ఉంటుంది. అందుకే ఈ శనివారం మా విద్యార్థులకు, నా మిత్రులకి మన యొక్క ప్రార్థన గీతాన్ని మరలా పాడుకునేందుకు వీలుగా అందచేయుచున్నాను... ధన్యవాదాలు!

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.