తెలుగోళ్ళము

                   తెలుగోళ్ళము   


:)👉తెలుగోడి రాతలు-కూతలు👈:)


ఆంగ్లమాధ్యమ కాలంలో 

ఆగని కలం మా గళం. 

మేలిపొద్దులో మొదలై సందెపొద్దులో 

సమాప్తం కానీ చరితం మా స్నేహం. 

తెలుగులో తెలుగుతో తేటతెల్లమై 

తెలుగువెలుగుగా శ్రీశ్రీ మలుపుగా 

తిరిగి పండితులమనే మేము 

మా తెలుగు పైత్యంతో తెల్లబోయిన 

ముఖాల్లో తెలుగు తేజములై

నిలిచినోళ్ళము మేము.



అజంతభాషకు అమరత్వం మేము.

తెనుగామృతం సేయు 

తెనుగోళ్ళం మేము.

కవన పంటలు పండించు 

జంటకవులం మేము.

మా కల(ళ)ల మధ్య ఆగని ప్రయాణం 

మాధునికంతో సాగిపోతున్న కాలంలో..!!.

మేము భాషాభిమానులం

మేము పాఠకులం

మేము తెలుగోళ్ళం

మా గీతలే తెలుగోడి రాతలు-కూతలు...!

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.