తెలుగు శతకాలు / Telugu sathakalu
తెలుగుశతకాలు౼లక్షణాలు౼రచయితలు
శతకసాహిత్యం - ఉపోద్ఘాతం:-
శతకము అనగా శత(100) అంతకు మించి ఉన్న పద్యాల సమాహారం..సంస్కృత, తమిళ, కన్నడ భాషాసాహిత్యాలలో ప్రారంభమైనప్పటికి శతక ప్రక్రియ ఆంధ్రసాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. తెలుగులో మొట్టమొదటి శతకము ఏదనే విషయంలో వాదనలు ఉన్నా, పాల్కురికి సోమనాథకవి 12వ శతాబ్దంలో వ్రాసిన శతకము మొదటి శతకంగా చాలామంది పండితులు అంగీకరించడం జరిగింది. అప్పటినుంచి ఈనాటివరకు ఈ శతకరచన ఎన్నో క్రొత్తదారులు తొక్కుతు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను సంపాదించుకొన్నది.
ఆకాలం నుండి నేటివరకు అనేకమంది కవులు ఎన్నో నీతి శతకాలను మనకందించారు. ఎందరోకవులు ఎన్నోసందర్భాలలో చెప్పిన శతకాలు ఇప్పటివరకు ఎన్ని అనేది ఒక అంచనాకి రావటం కష్టమే. వివిధ సందర్భాలలో దేశ కాలమాన పరిస్థితులు నాటి సమాజపు పరిస్థితులను ఆధారంగా చేసుకుంటూ అనేక సూక్తులు, జీవితవిలువలు, నీతిని బోధించే వాక్యాలు శతక ప్రక్రియ ద్వారా కవులు మనకు అందించారు. ఆ శతకంలోని విషయం ఆధారంగా శతకాలు వర్గీకరణ చెయ్యడం జరిగింది.
1. భక్తి శతకాలు: ఈ శతకాలు భక్తిరస ప్రాధాన్యాలు. వీనిని మరల
(అ) శివభక్తి
(ఆ) విష్ణుభక్తి
(ఇ) దేవీభక్తి
(ఈ) ఇతరదేవతా శతకాలు
(ఉ) మానవస్తుతి ప్రతిపాదకాలుగా విభజించవచ్చు.
2. నీతి శతకాలు: మనవ మనుగడకి మూలము ధర్మము నీతి. ఈతువంటి నీతిని మానవజాతికి సులభంగా అర్ధమయ్యే రీతిలో తెలియచేయటానికి నీతి శతకాలు ఎంతో దోహదం చేస్తాయి. సుమతీ, భాస్కర, కుమారీ, కుమార, మానినీ వంటి శతకాలు ఈ కోవలోకి వస్తాయి.
3. శృంగార శతకాలు: భగవంతుని శృంగార లీలలను వర్ణిస్తు చెప్పిన వేంకటేశ్వర శతకము, అంబికాశతకము లాంటి శతకాలతో మొదలై కాలక్రమేణా శృంగార రసముతో శతకాలు వచ్చాయి. స్త్రీ, పురుష విరహ వర్ణన, శృంగార భావనలు ఈ శతకాల ప్రధాన విషయం.
ఉదా:- కలువాయి శతకం, గోరంట్ల మాధవ శతకం, లావణ్య శతకము, భోగినీ శతకము మొదలైనవి ఈ కోవకి చెందుతాయి.
4. వేదాంత(తాత్విక) శతకాలు: భగవంతుని చేరే జ్ఞానమార్గాన్ని తెలుపుతూ చేయబడిన శతకాలు.
ఉదా:- సదానందయోగి శతకము, శివముకుంద శతకము, సంపంగిమన్న శతకము, దత్తయోగీంద్ర శతకము ఈ కోవకి చెందిన శతకాలు.
5. చారిత్రక శతకాలు: చారిత్రక, రాజకీయ సంఘటనల ఇతివృత్తంగా చెప్పిన శతకాలు ఈ కోవలోకి వస్తాయి.
ఉదా:- ఆంధ్రనాయక శతకము, సింహాద్రినారసింహ శతకము, భద్రగిరి శతకము, విశ్వేశ్వర శతకము మొదలైనవి ఈ కోవకి చెందుతాయి.
6. జీవిత చారిత్రిక శతకాలు: గొప్పవారి జీవిత చరిత్రలు శతకరూపంలో కొంతమది కవులు వ్రాసారు. ఉదాహరణకి కృష్ణమూర్తి శతకము ఈ కోవలోకి వస్తుంది.
7. హాస్య శతకాలు: ఇవి హాస్యరస ప్రధాన శతకాలు. ఒక చిన్న విషయాన్ని తీసుకొని నవ్వు పుట్టించే విధంగా వర్ణిస్తూ చెప్పినవి. ఇందులో హాస్యమే ప్రధానాంశం.
ఉదా:- పొగచుట్ట శతకము, పకోడీ శతకము, విసనకర్ర శతకము, చీపురుపుల్ల శతకము, పిల్లి శతకము లాంటి శతకాలు ఈ కోవకి చెందుతాయి.
8. స్వీయచరిత్ర శతకాలు: కొంతమంది కవులు తమ ఆత్మకధను శతకరూపంలో వ్రాసికొన్నారు.
ఉదా:- హరిహరేశ్వర శతకము, బిల్పేశ్వర శతకము, కామేశ్వరీ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.
9. వ్యాజ్య నిందాస్తుతి శతకాలు: కొందరు కవులు తమకు కలిగిన కష్టాలను కానీ, సమాజంలోని అన్యాయాలను కానీ చూచి భరించలేక భగవంతుడిని ఎత్తిపొడుస్తూ, ఆయనలోని గుణాలను లోపాలుగా చూపిస్తు వ్యాజ్యనిందలో స్తుతించారు.
ఉదా:- ఆంధ్రనాయక శతకం, విశ్వేశ్వర శతకం, భద్రగిరి శతకం, సింహాద్రి నారసింహ శతకం, వేంకటేశ్వర శతకం మొదలైనవి ఈ కోవలోకి వచ్చే కొన్ని శతకాలు.
10. కథా శతకాలు: కొందరు కవులు ఒక కథని వస్తువుగా స్వీకరించి ఆ కథను శతకరూపంలో వ్రాసారు.
ఉదా:- ముకుందరాఘవ శతకం, లవకుమార శతకం, భాగవత ప్రధమ స్కంధ శతకం, భాగవత దశమ స్కంధ శతకము మొదలైనవి కధా శతకాల కోవలోకి వస్తాయి.
11. సమస్యాత్మక శతకాలు: ఇవి ఇచ్చిన ఒక సమస్యను పద్యపాదమకుటంగా చేసుకొని చెప్పిన శతకాలు.
ఉదా:- సత్యవతీ శతకం, అనుభవరసిక శతకం మొదలైన శతకాలు ఈ పద్ధతిలో వచ్చిన శతకాలు.
12. నిఘంటు శతకాలు: 12 శతాబ్ధంలో వెలువడిన అచ్చతెలుగు నిఘంటువులు శతకరూపంలో ఉండేవి.
ఉదా:- వేంకటేశాంధ్రం, సాంబనిఘంటువు, ఆంధ్రభాషార్ణవము, మొదలైనవి నిఘంటు శతకాలు.
13. అనువాద శతకాలు: ఇతరభాషల్లో నుండి తెలుగు భాషలోకి అనువదించిన శతకాలన్ని ఈ విభాగంలోకి వస్తాయి.
ఉదా:- సూర్యశతకం, సౌందర్యలహరి, గాథాసప్తశతి, శివానందలహరి, మొదలైన అనేక సంస్కృత, ప్రాకృత కావ్యాలు శతక రూపంలో తెలుగులోనికి అనువదించ బడ్డాయి.
14. అచ్చతెలుగు శతకాలు: 18వ శతాబ్ధం నుండి మొదలైన అచ్చతెలుగు శతకాలలో ఇతర భాషలు వాడకుండా పూర్తిగా తెలుగు పదాలతోనే శతకరచన చేసిన కవులున్నారు.
ఉదా:- భళిరా కరివేళ్పు శతకం లాంటివి ఈ కోవకు చెందే శతకాలు.
15. చాటు శతకాలు: సందర్భోచితంగా అనేక విషయాలపై చెప్పిన ఒకే మకుటంగల శతకాలు.
ఉదా :- రఘుపూరి కేశవ శతకము, రామతీర్థ శ్రీరామ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.
ఇలా వివిధ రకాల వైవిధ్యం ఉన్న శతకాలు లభిస్తున్నప్పటికీ మన శతక కవులు శతక రచనకు కొన్ని నియమాలను, కొన్ని లక్షణాలను ఏర్పరుచుకొని ఆ నియమాలను అనుసరిస్తూనే శతక రచనలను సాగించారు.
శతక లక్షణాలు/ Sathaka Features:-
1. సంఖ్యా నియమం:
శతకం అనగా వంద. ఈ విధంగా చూస్తే శతకం వందపద్యాలకు పరిమితంకావాలి. అయితే సంస్కృత సంప్రదాయం అనుసరించి శతకాలలో 100, 108, 116 పద్యాలవరకూ వ్రాయటం ఆచారంగా తీసుకొన్నారు. వంద పద్యాలకు తక్కువగా ఉన్న పద్యాలు కల రచనలను శతకం అనలేము. శతక రచనలో సంఖ్యకు ప్రాధాన్యం ఉండటం వలన అంతకు పైబడిన పద్యాల రచనలను ద్విశతి (200), త్రిశతి (300), పంచశతి (500), సప్తశతి (700) అనే సంప్రదాయం ఏర్పడింది. వెయ్యిపద్యాలకు పైన ఒకే మకుటంతో ఉన్న పద్యాలున్న రచనలను కూడా శతకంలో చేర్చారు. వేమన పద్యాలు 3000కు పైగా ఉన్నా ఒకే మకుటంతో ఉండటంవలన వేమన శతకం అని పిలవబడుతున్నది.
2. మకుట నియమం: శతకంలోని చివరిపాదం గానీ, పాదాంతంలో గానీ ఒక పేరును సంభోదిస్తూ ఉంటుంది. దీనినే మకుటం అంటారు. ఈ మకుటం సంభోదనా విభక్తియై అన్ని పద్యాలలో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు వేమన శతకంలో విశ్వధాభిరామ వినురవేమ, కాళహస్తీశ్వర శతకంలో శ్రీకాళహస్తీశ్వరా, నారాయణ శతకంలో నారాయణా, అనేవి ఆ శతకాలకు మకుటాలు.
3. వృత్త లేక చంధో నియమం: శతక మకుట నియమం వలన శతకంలోని ప్రతిపద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలో మాత్రమే వ్రాయటానికి కుదురుతుంది. అందుచేతనే ఈ నియమం ఏర్పడుతున్నది. ఉదాహరణకు దాశరథీ శతకంలో "దాశరధీ కరుణాపయోనిథీ" అనే మకుటం చంపకమాల, ఉత్పలమాల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. అలాగే కాళహస్తీశ్వర శతకంలోని "శ్రీకాళహస్తీశ్వరా" అనే మకుటం మత్తేభ శార్ధూల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. ఐతే ఒకే వృత్తంలో సంపూర్ణ శతకాలు కూడా చాలానే ఉన్నాయి. సీసపద్య శతకాలు, కందపద్య శతకాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
4.రస నియమం: శతకాలన్నిటిలోను ఒకే రసం ప్రతిపాదించబడాలి. భక్తి రస శతకాలలో భక్తిరసంతో కూడిన పద్యాలు మాత్రమే వస్తాయి. వీర, రౌద్ర, హాస్య రసాలకు ఇక్కడ తావు ఉండదు.
దాదాపుగా మన తెలుగు శతక సాహిత్యంలో పై నియమాలను అనుసరిస్తు రచనలు చేసారు. ఇప్పటికీ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది కొన్నిచోట్ల ఈ నియమాలను పాటించక రచనలు చేసారు.
ఉదాహరణకి సంబోధనా విభక్తి మాత్రమే శతక మకుటంలో ఉంటుంది కానీ "రంగశాయి శతకం"లో సంభోదన విభక్తికి బదులు గోపాలుడు రంగశాయి మనపాలగలడు విచారమేటికిన్ అనే మకుటంతో, నార్లవేంకటేశ్వరావు గారి శతకంలో వాస్తవమ్ము నార్లవారి మాట అనే మకుటంతో వ్రాసారు. కొన్ని శతకాలు సంస్కృతాంద్ర మిశ్రమ రచనలైతే, మరికొన్ని అచ్చ తెలుగు శతకాలు మరి కొన్ని గ్రామ్యభాష లో రచించబడ్డాయి.
దశకవిభాగం: కొన్ని శతకాలలో ఈ దశకవిభాగం అనే ప్రక్రియ కనిపిస్తుంది. అంటే శతకంలోని ప్రతి పది పద్యాలను ఒక విభాగంగా చేసి వానిని ఒక శీర్షిక క్రింద వ్రాయటం. ఉదాహరణకి నారాయణ శతకంలో ఆది, అవతార, దివ్యరూప, నామ, కృష్ణవతారవిశంతి, జ్ఞానవిశంతి, మోక్షవిశంతి అనే విభాగాలున్నవి. ఇదేవిధంగా భర్తృహరి నీతి శతకంలో, శృంగార, వైరాగ్య శతకాలలో కూడా దశకవిభాగం ఉన్నది.
->ఆధార గ్రంధం :- తెలుగువారి సంపూర్ణ చిన్న బాలశిక్ష నుంచి
శతకము పేరు - రచయిత - మకుటము:-
1. అభినవకుమతీ శతకము - గాజులపల్లి వీరభద్రరావు - కుమతీ
2. అభినవసుమతీ శతకము - ధర్భా సుబ్రహ్మణ్యశర్మ - సుమతీ
3. అచలగురుగీతా శతకము - సరస్వతీ భోజరాజు - అసిపదాంతర్య శేషాచలార్యవర్యా
4. ఆచంటరామేశ్వర శతకము - మేకా బాపన్న - భూతలోకేశ ఆచంటపుర నివేశ భావ భవనాశ రమేశ పార్వతీశ
5. అచ్యుత శతకము - తిరువెంగడ తాతదేశికాచార్యులు - అచ్యుతా
6. ఆదినారాయణ శతకము - అబ్బరాజు శేషాచలామాత్య - ఆదినారాయణా
7. అగస్త్యలింగ శతకము - తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు - ఈమనియగస్త్యలింగ బాలేందు సంగ
8. అఘవినాశ శతకము - దాసరి అంజదాసు అంజదాసపోష - అఘవినాశ
9. ఆంధ్రనాయక శతకము - కాసుల పురుషోత్తమ కవి - చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హతవిమతజీవ శ్రీకాకుళాంధ్ర దేవా
10. ఆంధ్రసూర్య శతకం - మయూర కవి -(సంస్కృతం నుండి అనువాదం) సూర్యా
11. ఆంజనేయ శతకము - పరాశరం నరసింహాచార్యులు - ఆంజనేయప్రభో
12. ఆనందరామ శతకము - ముత్తెనపెద్ది సత్యనారాయణ - ఆనందరామా! ప్రభో
13. అనంత శతకము - తిరువెంగడ తాతదేశికాచార్యులు - అనంత
14. ఆరోగ్య వేంకటేశ్వర శతకము - రామసుబ్బారాయడు - వేంకటేశ్వరా
15. ఆర్తరక్షామణీ శతకము - అనంతరామ పట్నాయక - ఆర్తరక్షామణి
16. ఆత్మలింగ శతకము - ఆకుల గురుమూర్తి - అఖిలజీవసంగ ఆత్మలింగా
17. అవధూత నిర్మలానంద స్వామి శతకము - అవధూత నిర్మలానందస్వామి - నిజమనే యవధూత నిర్మలుండు
18. బాల శతకము - కొణిదెన వేంకటనారాయణ - బాల
19. బాల శతకము - అలపాటి వేంకటప్పయ్య - విమల వినుతశీల వినుర బాలా
20. బాలకృష్ణ శతకము - జక్కేపల్లి జగ్గకవి - కృష్ణా
21. బాలశశాంకమౌళి శతకము - కొమ్మోజు సోమనాధకవి - బాలశశాంకమౌళి మనపాలగలండు విచారమేటికిన్
22. భారతీ శతకము - కఱ్ఱి సాంబమూర్తి శాస్త్రి - భారతీ (వ్రాతపతి )
23. బర్హిశిలేశ్వర శతకము - నెమలికంటి బాపయ్య - భరభవ పాపనాశ వరబర్హి శిలేశ మహేశ యీశ్వరా
24. బెజవాడ కనకదుర్గాంబ శతకము - సరికొండ లక్ష్మీనృసింహ రాజు - శరజన్మాంబ బెజవాడ కాళికాంబ మదంబా
25. భద్రాద్రి రామచంద్ర శతకము - బళ్ళ రామచంద్రరాజ కవి - రమ్యగుణసాంద్ర భద్రాద్రిరామచంద్ర
26. భద్రాద్రి సీతారామ శతకము - అబ్బరాజు పిచ్చయ్య - శ్రీకర భద్రాద్రిధామ సీతారామా
27. భద్రగిరి శతకము - భల్లా పేరయకవి - భద్రగిరివాస శ్రీరామభద్ర దాసపోష బిరుదాంక రఘుకులాంబుధిశశాంక
28. భక్తజీవన శతకం - వాసా కృష్ణమూర్తి - భక్తజీవనా
29. భక్తకల్పద్రుమ శతకము - పంగులూరి ఆదిశేషయ్య - భక్తకల్పద్రుమా
30. భక్తమందార శతకము - కూచిమంచి జగ్గకవి - రామా భక్తమందారమా
31. భక్తవత్సల శతకము - పతీ సూర్యనారాయణమూర్తి - భక్తవత్సలా
32. భక్తవత్సల శతకము - గూటాల కామేశ్వరమ్మ - భక్తవత్సలా
33. భరత శతకము - టంగుటూరి వరదరాజశర్మ - భరతా
34. భారతాంబికా శతకము - గరికపాటి మల్లావధాని(?) - భారతాంబికా
35. భాస్కర శతకము - మారద వెంకయ్య - భాస్కరా
36. భట్టి విక్రమార్కేశ్వర శతకము - పెనుమత్స మహాదేవకవి - భట్టీశ్వరా, విక్రమార్కేశ్వరా
37. భీమేశ శతకము - దేవరకొండ అనంతరావు - భీమేశా
38. భుజగభూపాల శతకము - క్రొత్తపల్లి సుందరరామకవి - భోగదేవేంద్ర నిర్మలభుద్దిసాంద్ర పండిత కవీంద్ర భుజగభూపాలచంద్ర
39. బ్రహ్మానంద శతకము - నిజానంద నరసింహస్వాములు - బ్రహ్మానందా
40. బుద్ధ శతకము - ఆచార్య బోధి భాస్కర - బుద్ధుఁడా
41. చక్రధారి శతకము - పింగళి వేంకటసుబ్రహ్మణ్య కవి - చక్రధారీ శ్రితమనోబ్జ చయవిహారీ
42. చంద్రశేఖర శతకము - (రచయిత తెలియదు) - చంద్రశేఖరా
43. చండి శతకము - బాణ మహాకవి - సంస్కృతం
44. చన్న మల్లేశ్వర శతకము - గంగాధర కవి - సర్వగుణధామ శ్రీశైలసార్వభౌమ చెన్నమల్లేశ శివలింగ శరణు శరణు
45. చన్నకేశవ శతకము - నారాయణం రామానుజాచార్యులు - సురుచిరవిలాస లశునాఖ్య పురనివాస చన్నకేశవదేవ విశాలభావ
46. చెన్నకేశవ శతకము - గి.కృష్ణమూర్తి
47. చెన్నకేశవ శతకము - రామ్మడుగు సీతారామ శాస్త్రి - చెన్నకేశవా
48. చెన్నకేశవ స్వామి శతకము - అడుగుల రమయాచారి - చెన్నకేశవా, దైవపురీశ కేశవా
49. చిద్విలాస శతకము - రప్తాడు సుబ్బదాస యోగి - చిత్సుఖానంద సర్వేశ చిద్విలాసా
50. చిత్తోప రమణ శతకము - వేంకట శోభనాద్రి కవి - చిత్తమా
51. చౌడప్ప శతకము - కవి చౌడప్ప - కుందవరపు కవిచౌడప్పా
52. దాశరధీ శతకము - కంచర్ల గోపకవి - దాశరధీ కరుణాపయోనిధీ
53. దత్తమూర్తి శతకము - వినుమల్లి సూరారెడ్డి - ధాత్రి సత్కీర్తి కంతేటి దత్తమూర్తి
54. దయా శతకము - ఎన్ యె నరసింహాచార్యులు (సంస్కృతం)
55. దేవకీనందన శతకము - (రచయిత తెలియదు) - కృష్ణా దేవకీనందనా
56. దీక్షిత శతకము - వజ్ఝ సూర్యనారాయణ కవి - రమ్యగుణధూర్య లక్ష్మీనారాయణార్య
57. దీనావన శతకము - పామర్తి బుచ్చిరాజు - దేవ దీనావనా
58. దృష్టాంత శతకము - శ్రీకుసుమ దేవ (సంస్కృతం)
59. దుర్గ భర్గ శతకం - కపిలవాయి లింగమూర్తి - దుర్గ, భర్గ
60. దుర్గామల్లేశ్వర శతకము - చల్లా పిచ్చయ్య - దుర్గామల్లేశ్వరా సర్వదేవ పరివారా హారాహీరా కృతీ
61. ద్వారకాపతి శతకము - ఆదిభట్ట శ్రీరామమూర్తి కవి - ద్వారకాపతీ
62. ద్వారకవేంకటేశ్వర శతకము - నరసింహకవి - ద్వారకవేంకటేశ్వరా
63. ద్విప్రాస శ్రీముఖలింగ శతకము - అమలాపురపు సన్యాసి కవి - శ్రీముఖలింగా (వ్రాతప్రతి)
64. గాలిబ్ ప్రేమ శతకం - బెజవాడ గోపాలరెడ్డి (అనువాదకుడు)
65. గాంధీ శతకము - బైరెడ్డి-సుబ్రహ్మణ్యం - గాంధీ
66. గాంధి శతకము - చొల్లేటి నృసింహశర్మ - మో.క.గాంధి మహాత్మా
67. గాంధీజీ శతకము - దుగ్గిరాల రాఘవచంద్రయ్య - గాంధీజీ
68. గాంధీనీతి శతకము - దివల్లి సూరకవి - వస్త్సా
69. గౌరీపతి శతకము - మబగాపు కృష్ణ మూర్తి - గౌరీపతీ
70. గోపకుమార శతకము - ప్రహరాజు గంగరాజు - గోపకుమారా
71. గోపాల శతకము - సత్యవోలు సుబ్బారావు - గోపాలా
72. గోవింద శతకము - తిరువెంగడ తాతదేశికాచార్యులు - గోవింద
73. గురు శతకము - బంకుపల్లి రామజోగారావు - గురూ
74. గురునాథేశ్వర శతకము - దోమా వేంకటస్వామి గుప్త - గురునాధేశ జగద్వల్లభా
75. గువ్వలచెన్న శతకము - పట్టాభి రామకవి (?) - గువ్వలచెన్నా
76. హైదరాబాదునగర బిర్లామందిర వేంకటేశ్వర శతకము - ఓగేటి అత్య్తరామశాస్త్రి - బిర్లమందిరవాస శ్రీవేంకటేశ
77. హంసతారావలి శతకము - సిరిపల్లె విశ్వనాధ శాస్త్రి - మానసరాజహంస చనుమా వినువాకకుఁ బ్రొద్దుగుంకెడిన్ల
78. హంసయోగ శతకము - వేంకట రామయోగి - రమ్యతరభోగి వేంకటరామయోగి
79. హర శతకము - పెండ్యాల నారాయణ శర్మ - హరా
80. హరి శతకము - భమిడిమర్రి రామచంద్రమూర్తి - శ్రీహరీ
81. హరి శతకము - తూము సీతారామయ్య - శ్రీహరీ
82. హరిహరనధ శతకము - మహమ్మద్ హుస్సైన్ - హరిహరనాథా
83. హరిముకుంద శతకము - కోట్రెడ్డి నాగిరెడ్డి - భువిని పందులకుంట సత్పురనివాస అరసినన్నేలు గోవింద హరి ముకుంద
84. హిమగిరి శతకం - త్యాగి - హిమగిరిస్థలి మాహాత్మ్య మెన్నఁదరమే
85. ఇందిరా శతకము - గోవర్దహ్న శ్రీరంగాచార్యులు - ఇందిరా
86. ఈశ్వర శతకం - అందె వేంకటరాజం - ఈశ్వరా
87. జగదీశ శతకము - సన్యాసి నారాయణ - శ్రీజగదీశా
88. జమ్మలమడ్క శ్రీ ఆంజనేయ శతకము - కన్నెకంటి వీరభద్రచార్యులు - శ్రీజమ్మలమడ్క పూర్వర నివాస ఆంజనేయ ప్రభో
89. జానకీనాయక శతకము - మాటూరు వేంకటేశం - రామ జానకీనాయా
90. జానకీనాయక శతకము - నరహరి గోపాలాచార్యులు - జానకీనాయకా
91. జానకీపతి శతకము - వాజిపేయుల రామసుబ్బారాయడు - జానకీ పతీ
92. జానకీపతి శతకము -(రచయిత తెలియదు) - జానకీపతి
93. జానకీప్రియ శతకము - వేంకటాఖ్య కవి - జానకీప్రియా
94. జానకిశ శతకము - శంకర నారాయణ రాజు - శరణుజొచ్చితి ననుబ్రోవు జానకీశా
95. జనార్ధన శతకము - మంగు వేంకటరంగనాధరావు - జనార్ధన
96. జీడికంటిరామ శతకము - కేశవపట్నం నరసయ్య - సిరులకిరువైనజుంటి శ్రీ జీడికంటిధామ సుగుణాభిరామ శ్రీరామరామ
97. జ్ఞానప్రసూనాంబిక శతకము - శిష్టు సర్వాశాస్త్రి - జ్ఞానప్రసూనాంబికా
98. జ్ఞానబోధ శతకము - మట్టపర్తి నడవపల్లి - వినుము జ్ఞానబోధ గనుము మనసా
99. కాళహస్తి శతకము - (రచయిత తెలియదు) - కాళహస్తీశ్వరా సాంబశివా మహాప్రభో
100. గ్రహరాజ శతకము - సరికొండ లక్ష్మీనృసింహ రాజు - గ్రహరాజా
101. లలిత శతకము - సిరిపల్లె విశ్వనాధ శాస్త్రి - లలితా రమ్మిఁక కాలయాపనములేల? రాజబింబానన
102. ఇక్బాల్ ఆత్మశతకము - బెజవాడ గోపాలరెడ్డి (అనువాదకుడు)
103. కలుముల జవరాల శతకము - కోసంగి సిద్దేశ్వర ప్రసాద్ - కలుముల జవరాల కరుణ గావుమమ్మా
104. కామేశ్వరీ శతకము - తిరుపతి వేంకటకవులు - కామేశ్వరీ
105. కాశీవిశ్వనాద శతకము - (రచయిత తెలియదు) - విగతపాపాయూధ విశ్వనాధా
106. కవిగారి స్వర్ణగోపాల శతకం - ఆకునూరు గోపాల కిషన్ రావ్ - స్వర్ణగోపాలా
107. కేవలాత్మ శతకము - రాయచూరు బలరాం పంతులు (పూర్తిగా లేదు)
108. కోదండరామ శతకము - (రచయిత తెలియదు) - శరణు శరణు రామా శ్రీరామ కోదండ రామచంద్ర
109. కోడంగలు వేంకటేశ్వర శతకము - చౌడూరి గోపాలరావు - కోడంగలు వెంకటేశ్వరా
110. కోలంక మదనగోపాల శతకము - పోలిపెద్ది వేంకటరాయ కవి - భూరిమయవాస కోలంకపురనివాస మదనగోపాల రాదికా హృదయలోల
111. కోటిలింగ శతకము - సత్యవోలు అప్పారావు - కుటిలజనభంగ సత్సంగ కోటిలింగా
112. కోటీశ్వర శతకము - ఈశ్వరప్రగడ నృసింహారావు - కోటీశ్వరా
113. కృష్ణ శతకము - సుబ్రహ్మణ్య భాగవతులు - కృష్ణా
114. కృష్ణ శతకము - (రచయిత తెలియదు) - కృష్ణా
115. కృష్ణాభక్తకల్పద్రుమ శతకము - ఓబుళాపురపు లింగమూర్తి - కృష్ణా భక్తకల్పద్రుమా
116. కుక్కుటలింగ శతకము - రంగశాయి - కుక్కుటలింగా
117. కుక్కుటేశ్వర శతకము - కూచిమంచి తిమ్మకవి - భూనుతవిలాస పీఠికోపురనివాస కుముదహితకోటి సంకాశ కుక్కుటేశ (వ్రాతప్రతి)
118. కుమార శతకము - మునగపాటి చినహనుమయ్య - కుమారా
119. కుమారి శతకము - ప్రక్కి వేంకటనరసింహ కవి - కుమారీ
120. కుమతీ శతకము - రాళ్ళబండి రాజయ్య కవి - కుమతీ
121. లక్కవరశ్రీవేణుగోపాల శతకము - లక్కాకుల వేంకటరత్నాఖ్యదాస్ - లక్కవరపురపాల హిరణ్యచేల వేణుగోపాల రుక్మిణీ ప్రాణలోల
122. లక్ష్మీశారదా శతకము - లక్ష్మీశారదలు (రమాపతి, శారదాపతి శతకము) - రమాపతి, శారదాపతీ
123. లోకభాంధవ శతకము - కొక్కిలిగడ్డ వరాహనరసింహ మూర్తి - లోక భాంధవా
124. లోకనాయక శతకము - ఆదిభట్ట రామమూర్తి - లోకనాయకా
125. మా స్వామి(విశ్వేశ్వర శతకము) - విశ్వనాధ సత్యనారాయణ - విశ్వేశ్వరా
126. మదన జనక శతకము - అడపా అప్పలస్వామి - నీదుదయకొంత దానిపైనిలిపియైన మునుపు, నీయందుమరులొంద మదనజనక
127. మదనగోపాల శతకము - మేకా బాపన్న - భుధజనోల్లాస ఆచంటపుర నివాస భక్తజనపాల మదన గోపాల బాల
128. మద్ధయవదవ శతకము - రామకవి (సంస్కృతం )
129. మాధవ శతకము - గంధం నరసింహాచార్యులు - మాధవా
130. మాధవ శతకము - అల్లంరాజు రంగశాయి కవి - మాధవా
131. మహనందీశ్వర శతకము - బండిఆత్మకూరు శివశాస్త్రి - మహానందీశా
132. మహేశ్వర శతకము - కొక్కెరగడ్డ వేంకటరెడ్డి - మహేశా
133. మల్లేశ్వర శతకము - తటవర్తి వెంకటామాత్య(?) - పండితోల్లాస మస్కరపల్లివాస భవభయవినాశా మల్లేశ పార్వతీశ (వ్రాతప్రతి)
134. మల్లికార్జున శతకము - యెల్లాప్రగడ వేంకటసుబ్బారావు - శ్రీగిరిమల్లికార్జున విచిత్రవిలాస నగాత్మజాధిపా
135. మానస శతకం లేక మానస సరోవరం - సిద్దేశ్వరం కొల్లప్ప కవి - మనసా
136. మానసబోధ శతకము - ఎం.నంజుండయ్య - మనసా
137. మానసబోధ శతకము - ఆయంచ వీరబ్రహ్మాచార్యులు - మనసా
138. మానసోద్బోధక శతకము - సత్యవోలు సుబ్బారావు - (మకుటం లేదు)
139. మరున్నందన శతకము - పట్టాభి రామకవి -(?)
140. మారుతీ శతకం - గోపీనాధ వేంకటకవి - మారుతీ
141. ముక్తీశ్వర శతకము - ముదిగొండ బసవయ్యశాస్త్రి, కొండపల్లి లక్ష్మణ పెరుమళ్ళ శాస్త్రి - ముక్తీశ్వరా
142. నా ప్రభూ శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకము - చొల్లేటి నృసింహశర్మ - మత్ప్రభూ
143. నగజా శతకము - చుక్కా కోటివీరభద్రమ్మ - నగజా
144. నానార్దశివ శతకము - మాదిరాజు రామకోటీశ్వర కవి - (మకుటం లేదు)
145. నరసింహ శతకము - శేషప్ప కవి - భూషణవికాశ శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర
146. నరసింహ శతకము - (రచయిత తెలియదు) - మంగళాద్రి నృసింహా
147. నారాయణ శతకము - బమ్మెర పోతనామాత్య - నారాయణా
148. నారాయణార్య శతకము - పెనుమల్లి సూరారెడ్డి - ఆత్మ నమ్మితి నారాయణార్య నిన్ను
149. నీలకంఠేశ్వర శతకము - బళ్ళ మల్లయ్య - దగ్గులూరి నివేశ పాతక వినాశ నీలకంఠేశ నన్నేలు నిరతమీశ
150. నిరంజనచలసీస శతకము - బీసపు కృష్ణమ్మ - అచలగురువర్య అలతోట సుబ్బనార్య
151. నీతి శతకము - పరిమి సుబ్రహ్మణ్య కవి - వత్సా
152. నృసింహ శతకము - యల్లాప్రగడ వేంకటసుబ్బారావు - నవ్యగుణరంహ అల్లూరి నారసింహ
153. పద్మలోచన శతకము - ధమరశింగి గురాచార్య - పద్మలోచనా
154. పాహిమాం శతకము - ఆత్మకూరి గోవిందాచార్యులు - పాహిమాం పాహి బాల తుభ్యం నమోస్తు
155. పందిళ్ళమ్మ శతకము - కట్టా అచ్చయ్య కవి - పందిళ్ళమ్మా
156. పాండురంగ శతకము - (రచయిత తెలియదు ) -ఘనకృపాసాంగ కుజనాళి గర్వభంగ భక్తచిత్తాబ్జభృంగ శ్రీపాండురంగ
157. పారమతల్లి శతకము - (రచయిత తెలియదు ) - పారమతల్లీ
158. పార్వతీశ శతకము - నిష్టల కృష్ణమూర్తి - భక్తహృన్నివాస పార్వతీశ
159. పతివ్రతా శతకము - చేబ్రోలు సరస్వతీదేవి -(మకుటం లేదు)
160. పట్టాభిరామ శతకము - తోలేటి సీతారామయ్య - వరగుణస్తోమ శ్రీపైడివాడధామ రాజసుత్రామ పట్టాభిరామనామ
161. పెద్దనారాయణ శతకము - అదూరి కృష్ణుడు - నారాయణా నారాయణా
162. ప్రభు శతకము - మద్దూరి పాపారావు - సుబ్బరాట్ప్రభో
163. ప్రసన్నరాఘవ శతకము - మంగు వేంకటరంగనాధరావు - ప్రసన్న రాఘవా
164. ప్రత్యక్షరామచంద్ర శతకము - గొట్టుముక్కల కోటయ్య - భక్తవత్సలభాసుర భద్రశై లధామ, కృపాసాంద్ర ప్రత్యక్షరామచంద్ర
165. పుత్ర శతకము - జిలకర రామయ్య - పుత్రా
166. రాధాధవ శతకము - కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి - రాధాధవా
167. రాఘవ శతకము - తూము శేషయ్యా - రాఘవా
168. రాఘవ శతకము - కృష్ణ కుమార కవులు - రాఘవా
169. రాఘవ శతకము - అట్లూరి వేంకటసీతమ్మ - రాఘవా
170. రాఘవ శతకము - జనమంచి సీతారామస్వామి - రాఘవా
171. రాఘవేశ్వర శతకము - సామవేదుల వేంకటశాస్త్రి - రాఘవేశ్వరా
172. రాఘవేశ్వర శతకము - గుండ్లపల్లె నరసమ్మ - రాఘవేశ్వరా
173. రఘురామ శతకము - కడియం సత్యనారాయణ - కవి శ్రీరఘురామా
174. రాజ యోగి శతకము - కంతేటి వీరయ - రమ్యముగ దెలిపెదనువిను రాజయోగి
175. రాజగోపాల హరి శతకము - కుందనపు శేషయ్య - రాజగోపాల హరీ
176. రాజయోగ శతకము - టంగుటూరి రామమూర్తి - రమ్యగుణ భోగి సత్కీర్తి రాజయోగి
177. రామ బలరామ శతకము ఆర్చిరాది వర్ణనము - (రచయిత తెలియదు) - రామా, రేవతీకామ బలరామ రిపువిరామ (వ్రాతప్రతి) 3 శతకములు
178. రామ శతకము - పట్టం నరసింహం - రామా
179. రామ శతకము - బుగ్గవిడి వెంకటప్పయ్య చౌదరి - రామా
180. రామ శతకము - వెణుతురుపల్లి సన్యాసిరాజు - (మకుటం లేదు)
181. రామ శతకము - కొక్కెరగడ్డ వేంకటదాసు - రామా
182. రామ శతకము - బి కంబయ్య - రామా
183. రామభద్ర శతకము - బలివాడ సింహాచలం పట్నాయక్ - రామభద్ర మహారాజ రాజమౌళీ
184. రామభూపాలశతకము - పెన్మెత్స రాజంరాజు - దురితగణనాశ శ్రీచోడవరపురీశ భవ్యగుణసాంద్ర రామ భూపాలచంద్ర
185. రామచంద్రప్రభు శతకము - కూచి నరసింహము - రామచంద్రప్రభూ
186. రామానుజ శతకము - (రచయిత తెలియదు) - రామానుజార్యగ్రణీ (వ్రాతప్రతి)
187. రామరామ శతకము - తోటా వేంకటనరసింహ దాసుడు - రామరామ
188. రామతారక శతకము -(రచయిత తెలియదు) - రామతారక దశరాథరాజ తనయ
189. రామేలింగేశ శతకము - అడిదము సూరకవి - రామలింగేశా
190. రంగనాయక శతకము - బొమ్మరాజు నరసింహదాసు - రంగనాయకా
190. రుక్మిణీ పతి శతకము - (రచయిత తెలియదు) - రుక్మిణీపతీ
191. సాధన శతకము - నందనవనం వేంకట కోటేశ్వర రావు - (మకుటం లేదు)
192. సకలేశ్వర శతకము - నండూరు లక్ష్మీనరసింహరావు - గిరిజ హృదయేశ నండూరు పురనివాస స్ఫటిక సంకాశ సకలేశ భవబినాశ
193. సాంబ శతకము - మట్లూరు కోటయ సాంబా
194. సాంబమూర్తి శతకము - వద్దిపర్తి మంగయ్య - సంతతాహృత సుజనార్తీ సాంబమూర్తి
195. శంభు శతకము - కందుర్తి సుబ్బయ్యకవి - శంభో
196. శంకర శతకము - చామర్తి శంబులింగ కవి - శంకరా
197. శంకర శతకము - (రచయిత తెలియదు) - శంకరా
198. సనారీ విశ్వేశ్వర శతకము - కర్రి అత్యుతరామారావు - ధాతా సనారీప్రభో
199. సార్వభౌమ జానకీరామ శతకము - కోటికలపూడి కోదండరామ - జానకీరామదేవతా సార్వభుమ (వ్రాతప్రతి)
200. సర్వేశ్వర శతకము - బ్రహ్మశ్రీ ఆనందస్వామి - సకలజీవైక్యభావా సర్వేశ ఈశ
201. సర్వేశ్వర శతకము - అల్లమరాజు రంగశాయి - కవి సర్వేశ్వరా
202. సత్యరమేశ శతకము - సబ్బవరపు చినవేంకటాచార్య - సత్యరమేశా
203. సత్యవ్రతి శతకము - భాగవతుల లక్ష్మీనారాయణశాస్త్రి - సత్యవ్రతికిన్
204. శేషభుషణ శతకము - కట్రోజు శేషబ్రహ్మయ్య - శేషభూషణా
205. సీతారామ శతకము - పరుచూరి సీతారామాచార్యులు - కొండ్రుపాటి సీతారామా
206. సీతారామ శతకము - వెంకయాఖ్యుడు - సీతారామా
207. సీతారామ శతకము - పులవర్తి అన్నపూర్ణయ్యశాస్త్రి - సీతారామా
208. సీతారామ స్వామి శతకము - భల్లం పాలన్ రాజు - గిరిపల్లిధామ వరసీతారామ సద్భ్రహ్మమా
209. శివ శతకము - దరిమడుగు వేంకటసుబ్బయ్య - శివా
210. శివరామకృష్ణ శతకము - గుమ్మలూరు నరసింహశాస్త్రి (సంస్కృతం)
211. శ్రీ ఆలూరుకొన రంగనాయక శతకము - ఎం.చిదంబరయ్య రంగనాయకా
212. శ్రీ ఆపద్దుద్ధరక శతకము - బాపట్ల హనుమంతరావు - రామా! ఆపదుద్ధారకా
213. శ్రీ ఆత్మబోధసిద్ధేశ్వర శతకము - కే. రామస్వామి - భవ్యసిద్దేశ కలమళ్ళ భవవినాశ
214. శ్రీ బాబా ఖాదర్షా శతకము - భోగరాజు వెంకట్రామయ్య - ఖాదర్షా బాబా గురూ
215. శ్రీ బాలగోపాల శతకము - పుసులూరి సోమరాజామాత్య కవి - బాలగోపాల కరుణాలవాల నీలశైలపాలావనీపాల చారుశీల
216. శ్రీ బాలకృష్ణ శతకము - భ. పట్టభిరామయ్య - భంజితాచల భవతృష్ణ బాలకృష్ణ
217. శ్రీ బాపట్లభావనారాయణ శతకము -(రచయిత తెలియదు) - భావనారాయణ భక్తపోషణ మదాత్మవిలక్షణ రక్షనేక్షణా
218. శ్రీ భద్రశైలరామ శతకము - పొడుగు అప్పలానందం - శ్రీభద్రశైలధామా రామా
219. శ్రీ భగీరథీ శతకము - కొవ్వలి వేంకటసూర్యనారాయణ - భగీరధీ
220. శ్రీ భక్తరక్షామణి శతకము - (రచయిత తెలియదు)
221. శ్రీ భక్తసంరక్షక శతకము - గోపాలుని హనుమంతరాయ శాస్త్రి - భక్తసంరక్షకా
222. శ్రీ భక్తవత్సల శతకము - కందుర్తి ఆదినారాయణశర్మ - భక్తవత్సలా
223. శ్రీ భర్గ శతకము - కూచిమంచి తిమ్మకవి - భర్గా పార్వతీవల్లభా
224. శ్రీ భర్తృహరినీతి శతకము - భర్తృహరి
225. శ్రీ భవానీశంకరార్ధాష్టొత్తర శతకము - కూరపాటి వేంకటరత్నం భవానీశంకరా
226. శ్రీ భీమలింగేశ్వర శతకము - శానంపూడి వరదకవి - భీమలింగేశ్వరా
227. శ్రీ భోగేశ్వర శతకము - గోర్తి దీక్షిత కవి - ఈశ్వర కల్దిండిపురీనివేశ శివశర్వాణీశ భోగేశ్వరా
228. శ్రీ చక్రి శతకము - న్యాసావజ్ఝుల సూర్యనారాయణ మూర్తి - చక్రీ
229. శ్రీ చందలూరు మహలక్ష్మమ్మ శతకము - పోలవరం సుందర వెంకట శేషాచలపతిరావు - చందలూరు మహాలక్ష్మమ్మా
230. శ్రీ చంద్రమౌళీశ్వర శతకము - శంకరమంచి రామకృష్ణశర్మ - చంద్రశేఖరా
231. శ్రీ చంద్రమౌళీశ్వర శతకము - ములుగు వీరభద్రయ్య శాస్త్రి - చంద్రమౌళీశ్వరా
232. శ్రీ చిత్రాడ వేంకటేశ్వర శతకము - (రచయిత తెలియదు) (సంస్కృతం)
233. శ్రీ దీనకల్పద్రుమ శతకము - గదేపల్లి వీరరాఘవ శాస్త్రి - రామా దీనకల్పద్రుమా
234. శ్రీ దుర్గాగణపేశ్వర శతకము - జోస్యుల సూర్యనారాయణ శాస్త్రి - ఓ హరా దుర్గాగణపేశ్వరా ఫణిమణీహారా శివా శంకరా
235. శ్రీ గిరీశ శతకము - ఐతా చంద్రయ్య - సిద్ధిపురి నివాస శ్రీగిరీశా
236. శ్రీ గోపాల శతకము - ధనకుధరం రామానుజాచార్య - ఆలపలె గోపాలా
237. శ్రీ హర శతకము - కవిరాట్టు హనుమత్కవి - హరా
238. శ్రీ హరి శతకము - ఊలపల్లి గంగరాజమంత్రి - శ్రీహరీ
239. శ్రీ హరిహర పశుపతీశ్వర శతకము - మనీంపాటి శివనారాయణమూర్తి - భవవినాశక హరి హర పశుపతీశా
240. శ్రీ జంటనారాయణ శతకము - ఆదూరి కృష్ణుడు - నారాయణా నారాయణా
241. శ్రీ జానకీ వల్లభ శతకము - (రచయిత తెలియదు) - భక్త సులభా శ్రీజానకీవల్లభా
242. శ్రీ జానకీపతీ శతకము - శృంగారం అయ్యమాచార్య - జానకీపతి
243. శ్రీ కాకానిశివ శతకము - తోకచిచ్చు వెంకటప్పలరాజదాసు - దేవదేవ కాకాని శివా
244. శ్రీ కాకానీశ్వర శతకము - బండ్లమూడి వేంకటశాస్త్రి - పెదకాకానిపురాధినాధ శివ నన్బ్రేమన్మడి న్బ్రోవుమా
245. శ్రీ కాళహస్తీశ్వర శతకము - దూర్ఝటి కవి - శ్రీకాళహస్తీశ్వరా
246. శ్రీ కాళహస్తీశ్వర శతకము - మల్లాది పద్మావతి - కాళహస్తీవాస కావుమీశ
247. శ్రీ కాళీ శతకము - చిదంబర కవి (సంస్కృతం)
248. శ్రీ కామాక్షమ్మ శతకము - (రచయిత తెలియదు) - కామాక్షమ్మా
249. శ్రీ కాంచి వరదరాజ శతకము - అల్లూరి రాజేశ్వర కవి - భానుకోటితేజ వరదరాజ
250. శ్రీ కనకదుర్గా శతకము - దేవవరపు రాఘవులు - భవ్యగుణజాలలోల శివలోల భక్తపాలఘనవినుర శ్రీ విజయవాడ కనకదుర్గా
251. శ్రీ కన్యకాంబాసీస శతకము - నామా వెంకటసుబ్బయ్యశ్రేష్టి - కలిత కల్యాణ నికురుంబ కన్యకాంబ
252. శ్రి కాశీ విశ్వనాధ శతకము - రామకృష్ణ సీతారామ సోదర కవులు - తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ
253. శ్రీ కాశీవిశ్వేశ్వర శతకము - వంగల వేంకటరత్నం - కాశీవిశ్వేశ్వరా
254. శ్రీ కస్తూరిరంగ శతకము - రాయభట్టు వీరరాఘవకవి, వాడ్రేవు కామరాజు - శత్రుమదభంగ నవఘన శ్యామలాంగ సూరిచిత్తాబ్జభంగ కస్తూరిరంగ
255. శ్రీ కేశవ శతకము - పింగళి వేంకట సుబ్రహ్మణ్యం కేశవా
256. శ్రీ కోదండరామ శతకము - వంగనూరు చినవేంకటస్వామి - కొండుపల్లి కోదండధరా
257. శ్రీ కోదండరామ శతకము - పాణ్యం లక్ష్మీనరసింహయ్య - ధరణిమయ్యలవాడ కోదండరామ
258. శ్రీ కోదండరామ శతకము - ఏ.కే.వరప్రసాదరాయ కవి - రామా కోదండరామ రవిశతధామా
259. శ్రీ కొమర్పురీశ్వర శతకము - తగరంపూడి అప్పస్వామి - శ్రీకొమర్పురీశ్వరా
260. శ్రీ కోటిఫలీరాజరాజేశ్వరీ శతకము - మాకుపల్లి కృష్ణయాఖ్య కవి - కోటిఫలీ శ్రీరాజరాజేశ్వరీ
261. శ్రీ కృష్ణ కీర్తన శతకము - వారణాసి రామమూర్తి - (మకుటం లేదు)
262. శ్రీ కృష్ణ శతకము - పులుగుర్త వేంకటరామారావు - కృష్ణా! కృష్ణప్రియా
263. శ్రీ కృష్ణ శతకము - ఏనుగు తమ్మిరాజు - కృష్ణా
264. శ్రీ కృష్ణ శతకము - నరహరి గోపాలాచార్యులు - శ్రీకృష్ణా
265. శ్రీ కృష్ణ శతకము - పిసపాటి కోటేశ్వరశర్మ - శ్రీకృష్ణా
266. శ్రీ కృష్ణ శతకము - పీసపాటి కోటేశ్వరశర్మ - కృష్ణా రావే నన్బ్రోవవే
267. శ్రీ కుక్కుటేశ్వర శతకము - వక్కలంక శ్రీనివాస రాయ - కువలయానందకర శర్వ కుక్కుటేశా
268. శ్రీ కుమార శతకము - (రచయిత తెలియదు) - కుమారా
269. శ్రీ కురుమూర్తినాథ శతకము - చిలుకూరి నారాయణరాయ కవి - కురుమూర్తినాధ సురవంద్య పాహిపాహి ప్రభో
270. శ్రీ లక్ష్మీ నారాయణ శతకము - సందడి నాగదాసు - నతజనసురక్ష ఘనకరుణాకటాక్ష
271. శ్రీ లక్ష్మీ శతకము - సత్యవోలు సోమసుందర - లక్ష్మీ
272. శ్రీ లంకగిరీశ్వర ప్రభు శతకము - ఉప్పు వేంకటస్వామి - లంకాగిరీశ్వరప్రభో
273. శ్రీ మఱ్ఱిగుంట పాండురంగ శతకము - అరిగంటి శ్రీనివాస కవి - జై పాండురంగా
274. శ్రీ మదాంధ్ర నాయక శతకము - కాసుల పురుషోత్తమ కవి - చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావా హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవా
275. శ్రీ మాధవ శతకము - ఇనగంటి పున్నయ్య - చౌధరి మాధవా
276. శ్రీ మాధవ శతకము - డీ. బాబు సాహేబు - కుంజరహాద్రి పురీశ మాధవా
277. శ్రీ మద్రామచంద్ర ప్రభు శతకము - కోన రాఘవయ్య - శ్రీమద్రామచంద్రప్రభూ
278. శ్రీ మహాత్మా గాంధీ శతకము - డి.ఎల్.గంగాధరశ్రేష్ఠి - కలిభయ త్యాగీ జోహారు గాంధియోగి
279. శ్రీ మల్లభూపాలీయము నీతి శతకము - ఎలకూచి బాలసరస్వతి - సురభిమల్ల నీతివాచస్పతి
280. శ్రీ మల్లేశ్వర శతకము - మావుడూరు శ్రీశైలమల్లికార్జునరావు - సుందరశరీర రుచిజితకుంద సుందరాపురనివేశ మల్లేశ్వరా మహేశా
281. శ్రీ మల్లికార్జున శతకము - లక్కన మల్లికార్జనుడు - మల్లికార్జునా
282. శ్రీ మల్లికార్జున శతకము - చేవూరి వేంకటసోమసుందర స్వామి - మముబ్రోవు మల్లికార్జునలింగా
283. శ్రీ మన్నృసింహనఖ శతకము - తిరువేజ్ఞ్గడ తాతదేశికాచార్య (సంస్కృతం)
284. శ్రీ మోదుకూరి చెన్నకేశవ శతకము - రామానుజాచార్య కవి - క్షోణిసంపన్న శ్రీమోదుకూరి చెన్న
285. శ్రీ నడిగడ్డ పురాంజనేయ శతకము - శిష్టు వేంకటసుబ్బయ్య - నడిగడ్డపురాంజనేయ నతజనగేయ
286. శ్రీ నాగానంద చిద్విలాస శతకము, శ్రీ వేదాంతకీర్తనలు, కందార్ధములు - దేవన నాగానందస్వామి - నాగానంద సత్యానంద
287. శ్రీ నాగేశ్వర శతకము - మఠం నడిపూడి నాగభూషణ - దేవర చేబ్రోలు నాగేశ్వరా
288. శ్రీ నందిరాజు లక్ష్మినారాయణ దీక్షిత శతకము - వజ్ఝ సూర్యనారాయణ - రమ్యగుణధూర్య లక్ష్మీనారాయణార్య
289. శ్రీ నీతి సీతారామ శతకము - సీతారామశాస్త్రి - సీతారామా
290. శ్రీ నువ్వుకొండయోగిరామ శతకము - మండలీక సీతారామయ్య - యోగగుణధామ శ్రీరామ యోగిరామ
291. శ్రీ పాండురంగ శతకము - అంబటిపూడి సత్యనారాయణ - పాండురంగప్రభూ
292. శ్రీ పాండురంగ శతకము - రాళ్ళబండి యెల్లమంద రాజు - విదితకొల్లివిదెయ్య సధ్హృదయసంగ పండారీపురవిఠలేశ పాండురంగ
293. శ్రీ పన్నగాచలనాయక శతకము - పులహరి పీరోజిదేశికేంద్రులు - పన్నగాచలనాయకా
294. శ్రీ పోతులూరువీరబ్రహ్మేశ శతకము - ఆయంచ వీరబ్రహ్మాచార్యులు - పోతులూరి వీరబ్రహ్మా
295. శ్రీ ప్రభాకర శతకము - మద్దూరి పాపారావు - ప్రభాకరా
296. శ్రీ ప్రణవ శతకము - గంధం రత్నాచలం - ప్రణవముఁ గొలుతున్
297. శ్రీ పుత్ర శతకము - లక్కన మల్లికార్జునుడు - పుత్రా
298. శ్రీ రాధికేశ్వర శతకము - అయినపర్తి వెంకటసుబ్బరావు - రాధికేశ్వరా
299. శ్రీ రాఘవ శతకము - దుగ్గిరాల రామదాసు - రాఘవా
300. జ్ఞనప్రసూనాంబ శతకము - మల్లాది పద్మావతి - పూని రక్షింపు జ్ఞానప్రసూనదేవి
301. శ్రీ రాఘవవేంకటేశ్వర శతకము - తిరుమల రాఘవాచార్యకవి - విదిత పెద్దాపురీవాస వేంకటేశ
302. శ్రీ రఘురామ శతకము - రంగన్నగారి సాయులు - శ్రీరఘురామా
303. శ్రీ రఘురామ శతకము - భాగవతుల వేంకటసుబ్బారావు - రామా
304. శ్రీ రఘురామరామచంద్రప్రభో శతకము - శుభాద్రి దాసు - రఘురామ రామచంద్రప్రభో
305. శ్రీ రఘువీర శతకము - అయ్యలరాజు తిప్పకవి - రఘువీర జానకీనాయకా
306. శ్రీ రాజరాజేశ్వర శతకము - ములుగు వీరభద్రయ్య శాస్త్రి - రాజేశ్వరా
307. శ్రీ రాజరాజేశ్వరీ శతకము - ఇందుమతి - రాజరాజేశ్వరీ
308. శ్రీ రాజరాజేశ్వరీ శతకము - పండితారాద్యుల వీరేశలింగం - శ్రీరాజరాజేశ్వరీ
309. శ్రీ రామా శతకము - మంచిరాజు సీతమాంబ - రామా
310. శ్రీ రామ శతకము - మొలగపల్లి కమలమ్మ - రామా
311. శ్రీ రామ శతకము - శ్రీబాలాత్రిపురసుందర్యాంబ - రామా
312. శ్రీ రామ శతకము - కుడితిపూడి వేంకటరత్నమ్మ - రామా
313. శ్రీ రామ శతకము - సీరం సుభద్రయ్యమ్మ - రామా
314. శ్రీ రామ శతకము - కాశీబట్ట సుబ్బయ్య శాస్త్రి (సంస్కృతం)
315. శ్రీ రామ శతకము - బిరుదురాజు వేంకటసుబ్బరాజు - రామా
316. శ్రీ రామ శతకము - పొగరు కృష్ణమూర్తి - రామా
317. శ్రీ రామ శతకము - కోనం చినపుల్లయ్య - రామా
318. శ్రీ రామ శతకము - గొల్నపల్లి వేంకటసుబ్బరాయుడు - రామా
319. శ్రీ రామ శతకము - బి.నారాయణ - రామా
320. శ్రీ రామ శతకము - తాడేపల్లి శ్రీరాములు - విమలగుణధామ జానకీరమణ రామా
321. శ్రీ రామ శతకము - కల్లూరి విశాలాక్షమ్మ - రామా
322. శ్రీ రామచంద్ర శతకము - యేటుకూరు సీతారామయ్య - రమ్యగుణసాంద్ర శ్రీరఘురామచంద్ర
323. శ్రీ రామచంద్ర శతకము - రామపుత్రి - శ్రీరామచంద్ర
324. శ్రీ రామచంద్ర శతకము - బాలాత్రిపురసుందర్యాంబ - పుణ్యగుణధామ రవికులాంభోధిసోమ రమ్యకరుణాతిసాంద్ర శ్రీరామచంద్రా
325. శ్రీ రామచంద్ర శతకము - సరికొండ లక్ష్మీనృసింహరాజ కవి - శ్రీరఘురామ చంద్రమా
326. శ్రీ రామచంద్రప్రభు శతకము - చిలుకూరి శ్రీరాములు - రామచంద్ర ప్రభూ
327. శ్రీ రామచంద్రప్రభు శతకము - అడిపూడి సోదర కవులు - తండ్రీ రామచంద్రప్రభూ
328. శ్రీ రామలింగ శతకము - నూతి సూర్యనారాయణ పంతులు - శ్రీరామలింగా
329. శ్రీ రామలింగేశ్వర శతకము - చెళ్ళపిళ్ళ వేంకటేశ్వర కవి - రామలింగేశ్వరా
330. శ్రీ రామలింగేశ్వరశతకము - కూచిమంచి సాంబశివ - రామలింగేశ్వరా
331. శ్రీ రమామనోహర శతకము - పొడిచేటి నారాయణరావు - రమామనోహరా
332. శ్రీ రామరామ శతకము - ఆగూరు సింహాచలం పట్నాయక్ - రామా
333. శ్రీ రామరామ శతకము - రత్నాకర రామదాసు - ధరణి గుంతకల్లు కొట్టాలపుర నివాస రామ శ్రీరామ రఘురామ రామరామ
334. శ్రీ రామరామ శతకము - తోకచిచ్చు వేంకటప్పలరాజు - సంతగుడిపాటిపురధామ సత్యకామ రవికులంభోధొసోమ శ్రీరామరామ
335. శ్రీ రామరామ శతకము - బోడెపూడి వేంకట సుబ్బయ్య - శ్రీరామరామా
336. శ్రీ రామతారక శతకము - మంగు వేంకటరంగనాధరావు - రామతారక దశరాథరాజ తనయ
337. శ్రీ రంగ నాయక శతకము - పగడాల రంగప్ప - రంగనాయకా
338. శ్రీ రంగ శతకము - తిరుకుడ్యం దిగవింటి - నారాయణదాసు రంగా
339. శ్రీ రంగ శతకము - వేంకటకృష్ణరాయ - భళిరభవభంగ భక్తహృత్పద్మభృంగ విమలకరుణాంతరంగ కావేటిరంగ
340. శ్రీ సాకేతకోదండరామ శతకము - ములుకుట్ల వేంకటకృష్ణ - లలితసాకేతనగరీలలామభామ తారకబ్రహ్మనామ కోదండరామ
341. శ్రీ సంగమేశ్వర శతకము - పరిమి వెంకటాచల కవి - కూడలి సంగమేశ్వరా
342. శ్రీ శంకర శతకము - స్వేచ్చానంద యోగి - శంకరా
343. శ్రీ శనైశ్చర శతకము - వేలమూరి జానకిరామమూర్తి - శనైశ్చరా
344. శ్రీ శంకర శతకము - కస్తూరి రామచంద్ర రాయ - శంకరా
345. శ్రీ శారదాంబ శతకము - సత్తెనపల్లి హనుమంతరావు - సద్గుణకదంబ జగదంబ శారదాంబ
346. శ్రీ సరస్వతీ శతకము - చేబ్రోలు సరస్వతీ - దేవి శ్రీసరస్వతీ
347. శ్రీ సర్వమంగళా శతకము - కామభట్ల వేంకట్రామ కవి - సర్వమంగళా
348. శ్రీ సర్వేశ్వర శతకము - చెముడుపాటి వేంకట కామేశ్వర కవి - సర్వేశ్వరా
349. శ్రీ సర్వేశ్వర శతకము - సరస్వతుల సోమేశ్వర శర్మ - సర్వేశ్వరా
350. శ్రీ సత్యసాయి శతకము - కొమరగిరి కృష్ణమోహన రావు - (మకుటం లేదు)
351. శ్రీ సాయి శతకము - అంబట్ల రవి సాయి
352. శ్రీ సిద్ధేశ్వర శతకము - గుర్రము కోటయ్యాఖ్య కవి - సిద్ధేశ్వరా
353. శ్రీ సీతాసనాధ శతకము - నరహరి గోపాలాచార్యులు - హతవిరాధ విధూతసర్వాపరాధ తమ్మెరపురాథినాధ సీతాసనాథా
354. శ్రీ శివశంకర శతకము - గోరస అప్పలాచార్యుడు - శివశంకరా
355. శ్రీ సోమేశ్వర శతకము - గనముక్కల నాగులయ్య - కన్నెమడుగుపురీవాస కర్నసాలె కులజు లిలువేలుపని పేరుగొన్నదేవ శీలుడగు గనముక్కల శిద్దయార్య చిత్తసుమవాస సోమేశ చిద్విలాస
356. శ్రీ శ్రీనివాస శతకము - నారాయణం రామానుజాచార్యులు - మధుమదనిరాస కోటిమన్మధవిలాస శ్రితమనోవాస జయజయ శ్రీనివాసా
357. శ్రీ సుబ్బారాయస్మృతి శతకము - (రచయిత తెలియదు) - సుబ్బరాయా
358. శ్రీ శూన్యలింగ శతకము - ఓలేటి సుబ్బరాయడు - సుభగపుష్పభృంగ శూన్యలింగా
359. శ్రీ సూర్య శతకము - జెండా పెంటయ్య - సూర్యా
360. శ్రీ సూర్యనారాయణ శతకము - చింతపెంట సుబ్రహ్మణ్యం - సూర్యనారాయణా
361. శ్రీ తిరుమలవెంకటేశ్వర శతకము - మాలెకొండ రాయుడు - తిరుమల వెంకటేశ్వరా
362. శ్రీ ఉన్నవ వీరాంజనేయ శతకము - ఉన్నవ రామకృష్ణ - హరిపదవిధేయ ఉన్నవపుర సుగేయ అఖిల రిపుకులాజేయ వీరాంజనేయ
363. శ్రీ వరదరాజ శతకము - ఏగసిరి వెంకటపతి - శ్రీవరదా మహాప్రభో
364. శ్రీ వల్లభ శతకము - పీసపాటి సోమనాధము - నైర శ్రీవల్లభా
365. శ్రీ వాసుదేవ శతకము - కస్తూరి పెదకామేశ్వరరావు - దీనజనవర్తి శ్రీ వాసుదేవమూర్తి
366. శ్రీ వాసుదేవనామ శతకము - గురజాడ రాఘవశర్మ - కృష్ణా వాసుదేవప్రభూ
367. శ్రీ వాయునందన శతకము - పిన్నమ వెంకట సుబ్బయ్య - వాయునందనా
368. శ్రీ వేంకటరమణ శతకము - ప్రతాప రాఘవ పాకయాజి - వేంకటరమణా
369. శ్రీ వేంకటేశ శతకం - వేమూరి వెంకటేశ్వర శర్మ - విశ్వకల్యాణధాత వేంకటేశ
370. శ్రీ వేంకటేశ్వర శతకము - హేజీబు వేంకటరావు - వేంకటేశ్వరా
371. శ్రీ వెంకటేశ్వర శతకము - వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి - వేంకటేశప్రభూ
372. శ్రీ వెంకటేశ్వర శతకము - రాళ్ళబండి రామరాజ కవి - విమలగుణకోశ తిరుపతి వెంకటేశ
373. శ్రీ తిరుపతి వెంకటేశ్వర వృత్త శతకము - రాళ్ళబండి రామరాజ కవి - వెంకటేశ్వరా
374. శ్రీ వేంకటేశ్వర శతకము - మంథా రాయడు శాస్త్రి - వెంకటేశ్వరా
375. శ్రీ వేంకటేశ్వర శతకము - మహాకాళి వేంకటేశ్వర రావు - వేంకటేశ్వరా
376. శ్రీ వేంకటేశ్వర శతకము - ఆయంచ వీరబ్రహ్మాచార్యులు - వేంకటేశా నూజీవీట్పురీశ
377. శ్రీ వెంకటేశ్వర శతకము - యెల్లప్రగడ సుబ్బారాయడు - వెంకటేశ్వరా
378. శ్రీ వేంకటెశ్వర శతకము - నూతలపాటి వెంకటరత్న శర్మ - వేంకటేశ్వరా
379. శ్రీ వేణుగోపాల కృష్ణ శతకము - జూటూరు లక్ష్మీ నరసింహయ్య - వేణుగోపాలుఁడు కృష్ణమూర్తి మముఁబాలనసేయు దయాంతరంగుఁడై
380. శ్రీ వేణుగోపాల శతకము - ధనకుధరం రామానుజాచార్య - వేణుగోపాల నృపాల గోపకులబాల కృపాలలితాలవాలమా
381. శ్రీ వేణుగోపాలక శతకము - బొబ్బిలి కోట్కెలపూడి కోదండరామయ్య - శ్రీవేణుగోపాలకా
382. శ్రీ విసనకర్ర శతకము - హరి బ్రహ్మేశ్వర - విశ్వధాభిరామ విసనకర్ర
383. శ్రీ విశ్వేశ్వర శతకము - వేల్పూరి సాంబశివుడు - విజితపరాయూధ కాశికావిశ్వనాధా
384. శ్రీ విశ్వేశ్వర శతకము - వేమూరి వేంకటరామయ్యశర్మ, లక్ష్మీనారాయణశాస్త్రి - హృత్కమల కాశీవాస విశ్వేశ్వరా
385. శ్రీ యలమంద కోటీశ్వర శతకము - యెలమంద కోటినాయ్య దాసు - కోటీశ్వరా
386. శ్రీబలరామ శతకము - సాతులూరి సుభద్రాచార్య రేవతీ కామ బలరామ రిపువిరామ
387. శ్రీనివాస శతకము - చింతలపాటి పూర్ణచంద్రరావు - శ్రీనివాసా
388. శృంగార మారు శతకము - (రచయిత తెలియదు) - (మకుటం లేదు)
389. శృంగార శతకము - విజయరాఘవకవి (మకుటం లేదు)
390. సుబ్బరాయ శతకము - కొప్పారపు సోదరకవులు - సుగుణసముదాయ పున్నయసుబ్బరాయా
391. సుబుద్ధి శతకము - ఖసిం ఆలీషా సుబుద్ధీ
392. సుదతిసునితీ శతకము - సూరి కృష్ణయ్య - సుదతీ
393. సుగుణ శతకము - పట్టిసపు శ్రీరామమూర్తి - సుగుణా
394. సుగుణ శతకము - ఆకెళ్ళ వేంకటశాస్త్రి - సుగుణా
395. సుమతీ శతకము - బద్దెన - సుమతీ
396. సుప్రకాశ శతకము - రాప్తాటి సుబ్బదాసు సుగుణసంభావ్య సర్వేశ సుప్రకాశా
397. సూర్య శతకం - మయూర మహాకవి (సంస్కృతం)
398. సూర్యనారాయణ శతకము - జటావల్లభుల వెంకటేశ్వరులు - సూర్యనారాయణా
399. తాడికొండ వేణుగోపాల శతకము - దిట్టకవి కృష్ణకవి - తాడికొండపురీఫల ధర్మశీల వేణుగోపాల రుక్మిణీప్రాణలోల
400. తనయ శతకము - (రచయిత తెలియదు) -తనయా.
మూలము: ముఖపుస్తకము మరియు మిత్రుల సహకారంతో కూర్చబడినవి.
గమనిక:- పైన తెలిపిన వివరాలలో, అచ్చుతప్పులు-దోషాలు గానీ ఇంకా మిగిలిన శతకాలు కానీ ఉన్నయెడల (కామెంట్స్)వ్యాఖ్యలతో తెలియచేయగలరు. మీ సలహాలు-సూచనలు స్వీకరించి తగిన మార్పులు-చేర్పులు ఈ కూర్పునకు జోడించబడును.
సాహితీ విద్యార్థి
--- సాహితీ వారధి
మీ ఈ పేజీని ఇప్పుడే చూసి సంతోషించాను. ఈశతకాలలో మీదగ్గర ఎన్ని ఉన్నాయి?
రిప్లయితొలగించండి