నేను ఉదయించాల్సిన సమయం ఆసన్నమైంది...!!!

సందేహం లేదు... పునరాలోచనికి ప్రసక్తే లేదు...  


వర్తమాన వ్యవహారాలకు... జీవిత లక్ష్యాలకు పొంతన లేక విసిగి వేసారి... ఉన్నామా లేమా అన్న ఆందోళనలో ... వేగిరపాటు జీవితం గడుపుతున్నాను. మెదడు మొద్దుబారినట్టు సూర్యోదయాన్ని చూస్తుంటే అనిపిస్తుంది. ఒక కథ ముగిసినట్టు సాయంకాల సంధ్యని తలిస్తే అవగతం అవుతుంది. 


వర్తమాన జీవిత సామాజిక, ఆర్ధిక, ప్రాకృతిక, రాజకీయ, సాంఘీక, ఉద్యోగ  పరిస్థితుల్లో ఏమియు తోచక... ఎటువైపు చూడలేక... నలుదిక్కులా... నా చుట్టు పక్కలా....  అమాంతం అమావాస్య అంత చీకటి ఉన్నపళంగా అలుముకుంటే... కాలం అనే తాడు కంఠాన్ని కఠువుగా బిగుస్తుంటే.... ఆలోచన రాక... అడుగు ముందు పడక...    మిగిలివున్న జీవితం జీవన్మరణ సవాలు అనిపిస్తుంది. 


ఈ పదం ప్రతిఒక్కరు ప్రతిసారి పలుమార్లు ఉపయోగించినా ఎవరికీ ఎప్పుడూ మొత్తంగా అర్థం కాదనిపిస్తుంది. ఉదయించే భానుడిని భావోద్వేగం నిండిన కళ్ళతో చూడలేను. అలసిన మదికి సాగర తీరాన వీచే చిరు గాలి ఎటువంటి మార్పుని ఇవ్వడం లేదు.  బహుశా ఒక కథ ముగింపునకు వచ్చిందనిపిస్తుంది. 


ఒక కొత్త ఉషస్సును చూడాల్సిన సమయం ఆసన్నమైంది. జీవితంలో ఇప్పటివరకు ఎక్కడికక్కడ వదిలేసిన వేట కొడవళ్ళని వేరుకొనే పనిలో ఉన్నాను. వాటిని పదునుపెట్టే సమయం ప్రారంభం అయిన్ది. అడవిలో తిరుగుతున్నాను. అడవే జీవితంగా బ్రతుకుతున్నాను. చుట్టూ వున్న  ప్రతి ఒక్క వృక్షాన్ని కోరుతున్నాను. ఆకులను కాదు ఆయుధాలను  రాల్చమని....!!!

నేను ఉదయించాల్సిన సమయం ఆసన్నమైంది.  నిన్నటి అస్తమయాన్ని గురుతుపెట్టుకోను. కాలం నా కంఠమాల...!!

1 కామెంట్‌:

  1. మీ నిర్ణయం ఏదైనను...మీకు కావాల్సిన కత్తులవంటి ఆయుధాలను
    ఉపయోగించే నిర్మించాలన్న వంతెన అనే ముగింపు బాగుంది...
    అలాగే మీరు చూడాలనుకున్న ఉషస్సు బాగుంటుంది అన్న... ధన్యవాదాలు...!💐

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.