తెలుగు-సాహిత్యప్రశ్నలు/ Telugu literature questions

సాహిత్యప్రశ్నలు - Telugu sahitya prasnalu



1. గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో             కనిపించే ఛందస్సు? (2)
    1. ద్విపద    2. సీసం       
    3. ఆటవెలది    4. తేటగీతి

2. ప్రాజ్ఞన్నయ యుగంలో వలపల గిలకను దేనికి                 బదులుగా వాడారు? (3)
    1. ల    2. ట    3. రేఫ    4. డ


3. ‘వస్తుకావ్యాబ్జరవి’ అని నన్నెచోడుడు ఎవరిని                 గురించి పేర్కొన్నాడు? (3)
    1. భారవి         2. వ్యాసుడు   
    3. వాల్మీకి    4. కాళిదాసు


4. రెండు భాషల్లో ఒకే కవి రాసిన కావ్యం? (1)
    1. శివతత్త్వసారం   2. బసవపురాణం   
    3. కుమార సంభవం  4. వృషాధిప శతకం


5. ‘నయన రగడ’ కర్త? (1)
    1. చక్రపాణి రంగన       2. పెద తిరుమలాచార్యుడు       3. పాల్కురికి సోమన   4.చిన్నన్న


6. ‘పండితారాధ్య చరిత్ర తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’ అన్న విమర్శకుడు? (2)
    1. జి.నాగయ్య    2. తిమ్మావజ్ఝల కోదండరామయ్య      3. జి.వి.సుబ్రహ్మణ్యం   4. బండారు తమ్మయ్య


7. ‘‘పద్యాది త్రివిధ కావ్యపారీణుడు’’ అని కేతన               ఎవరిని కీర్తించాడు? (2)
    1. నన్నయ    2. తిక్కన
    3. పావులూరి మల్లన   4. మల్లియ రేచన


8. సంజయ రాయబారం ఉన్న పర్వం? (2)
    1. విరాట        2. ఉద్యోగ   
    3. భీష్మ        4. ద్రోణ


9. ‘‘అచ్చమైన ఆంధ్రపురాణ శైలికి అబ్జాసనకల్పుడు’’ అని మారనను గురించి పేర్కొన్నదెవరు? (1)
    1. జి.వి.సుబ్రహ్మణ్యం    2. దివాకర్ల   
    3. కేతవరపు రామకోటిశాస్త్రి 
    4. భూపతి లక్ష్మీనారాయణరావు


10. జినవల్లభుని ‘కూర్కియాల’ శాసనంలో కనిపించే           ఛందస్సు? (2)
    1. మత్తేభం     2. కందం
    3. రగడ          4.తేటగీతి   


11. ‘కలభాషిణి’ పాత్ర ఉన్న ప్రబంధం? (2)
    1. ప్రబోధ చంద్రోదయం    2. కళాపూర్ణోదయం 
    3. మనుచరిత్ర    4. వసుచరిత్ర


12. పురవర్ణనాదులతో ప్రారంభం కాని ప్రబంధం? (1)
    1. పారిజాతాపహరణం   2. ఆముక్తమాల్యద 
    3. విజయవిలాసం          4. అన్నీ


13. ‘సుదర్శన రగడ’ కర్త? (3)
    1. సూరన     2.పాల్కురికి సోమన   
    3. పెద తిరుమలాచార్యుడు   
    4. చక్రపాణి రంగనాథుడు


14.  ‘ఆంధ్ర కవుల చరిత్ర’ కర్త? (2)
    1. గురజాడ శ్రీరామమూర్తి     2. కందుకూరి   
    3. శిష్ట్లా రామకృష్ణశాస్త్రి    4. వంగూరి సుబ్బారావు


15. భరతుడు చెప్పిన పతాకస్థానాలెన్ని? (1)
      1. 4    2. 8    3. 12    4. 16


16. రసం సామాజిక నిష్ఠం అన్న కవి? (1)
      1. భట్టనాయకుడు     2. భట్టలోల్లటుడు   
      3. శ్రీశంకుడు      4. మమ్మటుడు


17. పద్మినీ వల్లభుడైన నాయకుడు? (4)
      1. కూచి కుమారుడు 2. పాంచాలుడు   
       3. భద్రుడు       4. దత్తుడు


18.  ‘ఉజ్జ్వలనీలమణి’ కర్త? (2)
      1. మధుసూదన సరస్వతి   2. రూపగోస్వామి     
      3. ధనంజయుడు     4. హరపాలుడు


19.  అర్థవృత్తులలో ఒకటి? (1)
       1. సాత్వతి    2. లక్షణ   
       3. గౌడి    4.ఓజస్సు


20. కాటమరాజు కథను గానం చేసి చెప్పేవారు? (1)
      1. కొమ్ములవారు    2. బవనీలు   
      3. బీరన్నలు         4. తప్పెటగుళ్లు


21. అరకులోయలోని గిరిజనులు చేసే నృత్యం? (2)
      1. నెమలి     2. థింసా
      3. మామిడి    4. గూసాడి


22. నక్తుప్రస్థుని కథ ఉన్న పర్వం? (1)
      1. అశ్వమేధ    2. శాంతి   
      3. భీష్మ    4. ద్రోణ


23. ‘జానపద కళా సంపద’ కర్త? (3)
      1. చింతా దీక్షితులు   2. ఎల్లోరా   
      3. తూమాటి దొణప్ప  4. లింగారెడ్డి


24. పాక భేదాలు ప్రధానంగా ఎన్ని? (2)
     1. 2    2. 3    3. 8    4. 12


25. పరుషాక్షర బంధం, దీర్ఘ సమాస
      భూయిష్ఠమైన రీతి? (2)
     1. వైదర్భి    2. గౌడి   
     3. పాంచాలి    4. లాఠీయ


26. అప్పయ్య దీక్షితులు పేర్కొన్న అలంకారాలెన్ని? (4)
      1. 84   2. 72   3. 100  4. 124


27. ‘ఆకాశభాషణం’ గలది? (2)
       1. విష్కంభం       2. చూళిక
      3. అంకాస్యం     4. అంకావతారం

28. కార్యావస్థల్లో ఒకటి? (2)
      1. పతాక    2. ప్రాప్త్యాశ   
      3. ప్రవేశిక   4. బీజం


29. ‘ఆంధ్రనవలా పరిణామం’ కర్త? (2)
      1. మొదలి నాగభూషణశర్మ 
      2. బి.వి.కుటుంబరావు   
      3. వల్లంపాటి వెంకటసుబ్బయ్య   
      4. పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు


30. ‘త్రేతాగ్ని’ ఎవరి నవల? (2)
       1. ఓల్గా    2. అడవి సూర్యకుమారి   
       3. యద్దనపూడి    4. కోడూరి కౌసల్యాదేవి


31. ‘‘జీవితం రేడియోసెట్టుకి భర్త ఏరియల్, భార్య                ఎర్తు’’ అన్న కవి? (2)
       1. శ్రీశ్రీ    2. ఆరుద్ర   
       3. దాశరథి    4. గోపాల చక్రవర్తి


32. ‘సూర్యస్థానం’ ఎవరి కవిత? (2)
       1. నిఖిలేశ్వర్‌       2. జ్వాలాముఖి   
       3. భైరవయ్య   4. నగ్నముని


33. ‘మైరావణ చరిత్ర’ కర్త? (2)
       1. వెన్నెలకంటి సూరన     2. మాడయ కవి
       3. సాళువ కంపరాయలు 
      4. బైచరాజు వేంకటనాథుడు


34. ‘హయ లక్షణ విలాసము’ ఎవరి రచన? (1)
      1. మనుమంచి భట్టు   
      2. తుపాకుల అనంతభూపాలుడు   
      3. పశుపతి నాథుడు    4. ఎవరూ కాదు


35. ఏ కవి తన రచనను ‘ప్రబంధమండలి’ అని                   పేర్కొన్నాడు? (3)
       1. పెద్దన    2. ఎర్రన   
       3. తిక్కన    4. నాచన సోమన


36. ‘స్వరోచి’కి పద్మినీ విద్యను ప్రసాదించిందెవరు? (2)
        1. విభావసి       2. కళావతి   
        3. వరూధిని       4. బ్రహ్మమిత్రుడు


37. ‘ఆముక్తమాల్యదా సౌందర్యం’ కర్త? (2)
       1. దివాకర్ల వెంకటావదాని
       2. తుమ్మపూడి కోటేశ్వరరావు   
       3. కొండూరి వెంగళాచార్యులు   
       4. వేదం వేంకటరాయశాస్త్రి


38. వైరాగ్యాదుల వలన చిత్తం నిర్వికారం కావడాన్ని             ఏమంటారు? (3)
        1. క్రోధం     2. విస్మయం   
       3. శమం     4. హాసం


39. ‘‘శృంగార ఏవ ఏకోరసః’’ అన్నదెవరు? (2)
        1. భవభూతి     2. భోజుడు   
        3. ప్రభాకరుడు   4. అభినవగుప్తుడు


40. ‘‘మనం వాడుక భాషే రాస్తున్నామా?’’
        ఎవరి రచన? (4)
       1. చే.రా    2. తమ్మారెడ్డి నిర్మల   
       3. స్ఫూర్తిశ్రీ    4. రంగనాయకమ్మ


41. రాజ్యాంగం గుర్తించిన భాషలెన్ని? (1)
      1. 22    2. 24    3. 26   4. 28


42. ‘కొండ’ భాషపై కృషి చేసిన భాషావేత్త? (3)
      1. టి.బరో    2. సేతు మాధవరావు   
      3. భద్రిరాజు     4. బూదరాజు రాధాకృష్ణ


43. బలరామకృష్ణాదుల నిర్యాణం ఉన్న పర్వం? (1)
       1. మౌసల    2. ఆశ్రమవాస   
       3. స్వర్గారోహణ  4. అశ్వమేధ


44. భావ వైవిధ్యాన్ని ఏమంటారు? (1)
       1. భావ శబలత    2 భావ సంధి   
       3. భావశాంతి     4. రసాభాసం


45. సంకేతితమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తి? (1)
      1. అభిధ    2. లక్షణ   
      3. వ్యంజన    4. వ్యంగ్యం


46. ‘ఆంధ్ర చంద్రాలోకం’ కర్త? (2)
      1. జయదేవుడు      2. అడిదం సూరకవి   
      3. భట్టోజీ దీక్షితులు  4. చెలమచర్ల రంగాచార్యులు


47. ‘ఆంధ్ర వచన వాఙ్మయము ఉత్పత్తి వికాసములు’            ఎవరి రచన? (2)
      1. వెల్చేరు నారాయణరావు 
      2. ఎం.కులశేఖరరావు   
      3. అమరేశం రాజేశ్వరశర్మ 
      4. ఎస్‌.వి.జోగారావు


48. ‘మనోరమా ఖండనం’ ఎవరి రచన? (2)
       1. మహిమ భట్టు     2. జగన్నాథ పండితుడు   
       3. విశ్వనాథుడు     4. మమ్మటుడు


49. చందులూరి గంగయామాత్యునికి అంకితం ఇచ్చిన         గ్రంథం? (2)
       1. సింహాసన ద్వాత్రింశిక    2. ప్రబోధచంద్రోదయం 
       3. జైమినీ భారతం   4. కొక్కోకము


50. ‘దుర్జయోపాఖ్యానం’ ఉన్న రచన? (2)
       1. కమల షష్ఠము  2. వరాహపురాణం   
       3. ప్రమీలార్జునీయం    4. శకుంతలా పరిణయం


51. ‘మదన విలాసం’ అనే సంస్కృత భాణము కర్త? (2)
       1. విశ్వేశ్వరయ్య 
        2. పశుపతి నాగనాథుడు   
       3. తాళ్లపాక చిన్నన్న     
       4. అయ్యలరాజు తిప్పయ్య


52. భీమేశ్వరస్వామి కృతిపతిగా ఉన్న రచన?(1)
       1. రుక్మాంగద చరిత్ర     2. విష్ణుపురాణం   
      3. అశ్వలక్షణ సారం       4. పంచతంత్రం


                                         



53. శకునాలు. సోది. పందేలు. చేతబడులు. ప్రకృతి వైద్యం మొదలైనవి జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందుతాయి?
 జ) సాంఘిక జానపద ఆచారాలు విభాగానికి చెందినవి.


54. ఊర్మిళాదేవి నిద్ర. లక్ష్మణ దేవర నవ్వు. ధర్మరాజు జూదం మొదలైనవి సేకరించింది ఎవరు?
 జ) శ్రీ పాద గోపాల కృష్ణమూర్తి.


55. జానపద. శిష్ట సాహిత్యాలను వేటితో పోలుస్తారు?
 జ) శారదా దేవి నేత్ర ద్వయాలతో.


56. తెలుగు-కన్నడ జానపద రామాయణ గేయాలు గ్రంథ కర్త ఎవరు?
జ) టీ. గోపాల కిష్ణ రావు.


57. పేరంటాళ్ళ కథలకు ఉదాహరణ. ఇవి జానపద కథల్లో ఏ రసానికీ చెందినవి?
 జ) సారంగధర చరిత్ర.. కామమ్మ కథ మొదలైనవి.
 ఇందులో కరుణ రస ప్రధాన గేయాలు ఉంటాయి.

58. చారిత్రక ప్రాధాన్యం గల కథలు అద్భుత కథలు గా మారటానికి చక్కని ఉదాహరణగా నిలిచిన కథ ఏది?
 జ)దేశింగు రాజు కథ.


59. పతులు మెచ్చని చెలువు నిష్ఫలముగాదె తన రచనల్లో ఈ సామెతను వాడిన ప్రాచీన కవి ఎవరు?
 జ) కవిసార్వభౌముడు శ్రీనాథుడు.


60. బోందై రుచి యై వీనుల విందు యై కనిపించు విభుదులమదికీన్ అని సామెతల గురించి తన రచనల్లో ప్రస్తావన చేసిన వారెవరు?
 జ) మొల్ల రామాయణంలో కవయిత్రి మొల్ల.


61. పొడుపు కథలను వర్గీకరించింది ఎవరు?
 జ) ఆర్చర్.టేలర్


62. ఉవ్విళ్లూరు అనే జాతీయాన్ని తన రచనలో ప్రస్తావన చేసిన ప్రాచీన కవి ఎవరు రచన ఏమిటి?
 జ) శాకుంతలం గ్రంథంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు.


63. ద్రౌపదీదేవి ఉత్సవాలు జరిగే ప్రాంతం ఏది?
 జ) చిత్తూరు జిల్లా పుత్తూరులో


64. చైత్ర మాస పాడ్యమి లో వచ్చే పండుగ ఏమిటి?
 జ) ఉగాది


65. సూత్రధారుడు ప్రస్తావన గల జానపద కళారూపం ఏమిటి?
 జ) తోలుబొమ్మలాట


66. తెలుగులో తోలుబొమ్మలాట గురించి పేర్కొన్న మొట్టమొదటి గ్రంథం ఏమిటి పేర్కొన్న కవి ఎవరు?
 జ) పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు.


67. వీధిభాగోతాలవారినీ తెర చీరలువారు అని పేర్కొన్న ప్రాచీన కవి ఎవరు?
 జ) పాల్కురికి సోమనాథుడు.


68. మల్లన్న దేవుని కథతో నృత్యం చేసే జానపద కళాకారులు ఎవరు?
 జ) బవనీలు


69. ఏక వీర ఎదుట నిలిచి పరశురాముని కథలు పాడిన జానపద కళాకారులు ఎవరుఅనీ అలా పేర్కొన్న గ్రంథం ఏది?
జ) క్రీడాభిరామం గ్రంథంలో బవానీలు అని జానపద కళాకారులు.


70. ఏ జానపద కళ లో వార నిషేధం ఉంది?
జ) బయలాట


71. కరడీ ఏ భాష పదం.. ఆ భాషలో ఆ పదానికి అర్థం ఏమిటి? వారి యొక్క కుల దైవం ఎవరు?
 జ) కన్నడం. అనగా అర్థం ఎలుగు బంటు. కులదైవం జుంజుప్ప.


72. జోకుమారఉత్సవం ఏ జిల్లాలో జరుగుతుంది? ఏ రోజు వస్తుంది?
జ) భాద్రపద శుద్ధ అష్టమిరోజున అనంతపురం జిల్లా.
 
73. వేదాంత ప్రకాశిక అనే పేరుతో నాలుగు వేదాలకు వ్యాఖ్యానం రాసింది ఎవరు?
జ) సాయణాచార్యులు.


74. శబ్దచంద్రిక అనే తెలుగు నిఘంటువును రాసింది ఎవరు?
 జ) వామన భట్టు.


75. అపరిమిత భూదాన పరశురామ బిరుదు కలిగిన రాజు ఎవరు?
 జ) ప్రోలయ వేమారెడ్డి.


76. సంస్కృత కవి అగస్త్యుడు ఎవరి ఆస్థాన కవి? ఇతని యొక్క రచనలు ఏమిటి?
 జ)కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఆస్థానకవి.

 రచనలు బాల భారతం నల్ల కీర్తి కౌముది. కృష్ణ చరిత్ర.


77. కాకతీయ సామ్రాజ్యం మూలపురుషుడు మూగల్లు శాసనం ప్రకారం.. బయ్యారం శాసనం ప్రకారం ఎవరు?
 జ) కాకర్త్య గుండన (ముగల్లు శాసనం ప్రకారం).                    బయ్యారం
 శాసనం ప్రకారం (వెన్నభూపతి).

78. పూర్తిగా తెలుగులో లభిస్తున్న తొలి తెలుగు శాసనం ఏమిటి? కర్త ఎవరు ఏ రాజ్య వంశం?
 జ) విప్పర్ల శాసనం. మొదటి జయసింహ వల్లభుడు.


79. తెలుగు వారి యొక్క సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి నగర నిర్మాత ఎవరు?
 జ) మొదటి తిమ్మరాజు.


80. తెలుగును రాజభాష చేసుకొని తర్వాత శాసనభాషగా సేకరించి దానికి అధికార ప్రతిపత్తిని ఇచ్చి ప్రోత్సహించిన రాజులు ఎవరు?
 జ) రేనాటి చోళులు.


81. భారతదేశంలో తండ్రిని దైవంగా భావించే ఆచారం ఏ రాజవంశీయులతో మొదలైంది?
 జ) శాలంకాయనులు.


82. తెలుగును అమితంగా ఆదరించిన తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు యొక్క వాణిజ్య వివరాలు తెలియజేసే శాసనం ఏది?
 జ) అహాదనకరణశాసనం.
 
83. సంస్కృతంలో ప్రథమ గద్య కావ్యనిర్మాత ఎవరు?
 జ) సుబంధు.


84. నైషధ కావ్యానికి నారాయణ భట్టు రాసిన వ్యాఖ్యానం పేరేంటి?
 జ) నైషధ ప్రకాశం.


85. సంస్కృతంలో పారిజాతాపహరణ అనే మహా కావ్యం రాసింది ఎవరు?
 జ) కవికర్ణ పూరుడు.


86. తెలుగు నుండి సంస్కృతంలోనికీ అనువదించటం అనే ప్రయోగం చేసిన వారు ఎవరు?
 జ) కాళహస్తి కవి.


87. సంకల్ప సూర్యోదయం అనే పేరిట సంస్కృత నాటకం రాసింది ఎవరు?
 జ) వేదాంత దేశికులు.


88. నలమహారాజు ఏ మారు పేరు తో ఋతుపర్ణుడు దగ్గర చేరాడు?
 జ) బాహుకుడు.


89. దశరథుడు అల్లుడైన ఋష్యశృంగుని తండ్రి ఎవరు?
 జ) విభాండకుడు.


90. పుత్ర నిర్యాణం తో విలపిస్తున్న గంగానదిని వ్యాసుడు ఓదార్చటం ఏ పర్వం లో వస్తుంది?
 జ) అనుశాసనిక పర్వంలో


91. పాలసముద్రాన్ని చిలకడాని కి కవ్వానికి వాడిన తాడు ఏది?
 జ) వాసుకి


92. ఎవరు ఇచ్చిన శాపం వల్ల ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా
 జన్మించాడు?
 జ) అగస్త్య మహాముని.


93. రసక్రీడలు భాగవతంలో ఏ స్కంధంలో వస్తాయి?
 జ) దశమ స్కంధం.


94. మార్క్సిస్టు విమర్శ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది?
 జ) వస్తువు.


95. గురజాడ కవి కాదు అని అన్నది ఎవరు?
 జ) పొట్లపల్లి రామారావు.


96. తెలుగులో దండక వాఙ్మయం ఎవరి రచన?
 జ) భాస్కర్ రావు.


97. పోయిటిక్స్ అనే గ్రంథ రచయిత ఎవరు?
 జ) అరిస్టాటిల్.


98. విధవను నాయికగా గ్రహించింది ఎవరు?
 జ) నారాయణుడు.


99. బాగా అవమానం పొందినది విప్రలబ్ద అని చెప్పింది ఎవరు?
 జ) విశ్వనాథుడు.


100. హాసినీనాయిక ప్రియుడైన నాయకుడెవరు?
 జ) పాంచాలుడు.


101. ధర్మరాజు పురాణాల్లో చెప్పబడిన నాయకుల్లో ఏ వర్గానికి చెందిన వాడు?
 జ) ధీరోదాత్తుడు.


102. జుగుప్స ఏ రసానికి స్థాయి భావంగా కలదు?
 జ) బీభత్సం
 
103. అలక  నగరవాసి. ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు?
 జ) కుబేరుడు.


104. తుంబురుడు నారదుడు సరస్వతి వీణల పేర్లు వరుసగా తెల్పండి?
 జ)కళావతి..మహాతి. కచ్ఛపి.


105. స్వారభీఘడూ ఇందులోని పాత్ర ఏదీ?
 జ) మనుచరిత్ర.


106. జాబిల్లి మీద సంతకం నవల ఎవరిది?
 జ) మల్లాది వెంకట కృష్ణమూర్తి.


107. శతకపద్ధతిలో రాసిన నిఘంటువు ఏది? ఎవరు రాశారు?
 జ) గణపవరపు వేంకటకవి వెంకటేశాంద్రము.


108. సి పి బ్రౌన్ పై ఉదాహరణ కావ్యం రాసింది ఎవరు?
 జ) సన్నిధానం నరసింహశర్మ.


109. విశాఖ విరసం శాఖ ప్రచురించిన కథల సంపుటి పేరు ఏమిటి?
 జ) సువర్ణముఖి.


110. నా జీవిత నౌక పేరిట ఆత్మకథ రాసుకున్నది ఎవరు?
 జ) గొర్రెపాటి వెంకట సుబ్బయ్య.


120. అడవి బాపిరాజు ముత్యాలసరం లో రాసిన కావ్యం ఏది?
 జ) శశికళ.


121. సీసపద్యం కనిపించిన తొలి శాసనం ఏది?
 జ) కందుకూరి శాసనం.
 
122. శృంగార నైషధం.. కీరాతా ర్జునీయం.. ఋతుసంహారం.. రఘువంశం.. కుమార సంభవం.. సేతుబంధనం మొదలైన రచనలు సర్గలు వరుసగా?
 జ) శృంగార నైషధం ( 22) 
     కిరాతార్జునీయంలో(18)
     ఋతుసంహారం (6)
     రఘువంశం (19)
     కుమార సంభవం (17)
     సేతుబంధనం (15) సర్గలు కలవు.


123. అనర్ఘ రాఘవము.. ప్రసన్న రాఘవం అనే సంస్కృత నాటకాలు రాసిన వారెవరు?
 జ) మురారి.. జయ దేవుడు.


124. స్థానేశ్వర్న్ని రాజధానిగా చేసుకున్నా హర్ష దేవుడుచే రాయపడిన నాటకాలు నాగానంద ప్రియదర్శిక. రత్నావళి నాటకాల్లోని ఇతివృత్తం ఎవరిది?
 జ) ప్రియదర్శిని ..రత్నావళి నాటకాలలో (ఉదయనుడు వృత్తాంతం) నాగానందం నాటకంలో (జీమూతవాహనుడు).


125. బేతాళ పంచవింశతి కథల్ని గద్యరూపంలో.. సంక్షిప్త రూపంలో రాసిన కవుల ఎవరు?
 జ) జంబాల దత్తు.. వల్లభ దేవుడు.


126. కర్ణ సుందరి అనే చారిత్రక సంస్కృత నాటకాన్ని రాసింది ఎవరు?
 జ) బిల్హణుడు.


127. కాదంబరి.. అభినవ కాదంబరి.. సంక్షిప్త కాదంబరి సంస్కృతంలో రాసింది ఎవరు?
 జ) భాణుడు..డుండీ రాజు వ్యాసుడు. కాశీనాథుడు.


128. అశ్వఘోషుడు సుందరి నందుల వియోగాన్ని ఎవరితో పోల్చాడు?
 జ)  రాత్రి-చంద్రుడు లతో


129. నీ పద్య వళులాలకించుచెవులన్ విన్నాడు వాక్యంబులన్ తెలిపే ఈ పద్యం ఏ కావ్యం లోనిది?
 జ) భాగవతం దశమ స్కంధం లోనే శ్రీకృష్ణ క్రీడలు.


130. యయాతి చరిత్ర భాగవతంలో ఏ స్కంధంలో వస్తుంది?
 జ) నవమ స్కంధము


131. శ్రీమన్నారాయణ యొక్క ఆయుధాలు వరుసగా వాటి పేర్లు ఏమిటి?
 జ) శంఖం(పాంచజన్యం) 
         చక్రం (సుదర్శనం) 
           గదా ( కౌముధకం)


132. శ్రీ కృష్ణుడు అత్యంత సన్నిహితుడైన యాదవకుల మిత్రుడు ఎవరు? అతనికి గల మరొక పేరు ఏమిటి? అతను ఏ వంశానికి చెందిన యోధుడు?
 జ)సా త్యకి..ఇతనికేయుయుధానుడు.. వృష్ణి వంశం.


133. వ్యాఘ్ర గోమయ సంవాదం. వచ్చే మహాభారతంలోని                పర్వం ఏమిటి?
 జ) శాంతి పర్వం


134. శ్రీకృష్ణుడు అరికాళ్ళలో ప్రమాదం ఉంటుందని శాపించిన  ముని ఎవరు?
 జ) దుర్వాస మహర్షి.


135. మహాభారతంలో ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం చేసింది ఎవరు?
 జ) దక్షిణ గోగ్రహణం..(సు శర్మ). ఉత్తర గోగ్రహణం (అర్జునుడు)


136. అగ్నిదేవుడికి అజీర్ణానికి కారణమైన యజ్ఞం పేరు ఏమిటి?
 జ) ద్వాదశ వర్ష యజ్ఞం.


137. సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా మానవోత్తముడిలోనే దైవత్వాన్ని వీక్షించమన్న కవి ఎవరు?
 జ) గురజాడ అప్పారావు.


138. బాల వితంతువు విలాపం కావ్యకర్త ఎవరు?
 జ) మంగిపూడి వెంకట శర్మ.


139. మద్యపాన నిషేధ కీర్తనలు రచించిన కవి ఎవరు?
 జ) నీలం వెంకయ్య.


140. పొట్టి శ్రీరాములు జీవితం ఇతివృత్తం గల కావ్యం ఏది? ఎవరు రాశారు?
 జ) ఆంధ్ర భ్యుదయం.. బండ్ల సుబ్రహ్మణ్యం.


141. ఖడ్గ తిక్కన అనే కావ్యం రాసింది ఎవరు?
 జ) సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి.


142. మగతనం లేని మగవాని కన్నాను పేడి వాడు మేలు వాడు ఈ పం క్తి ఏ కావ్యం లోనిది?
 జ) ఖడ్గ తిక్కన


143. కారెంపూడి కదనం అనే అలభ్య రూపకం రాసింది ఎవరు?
 జ) త్రిపురనేని రామస్వామి చౌదరి.


144. మహాభారత చరిత్రము అనే విమర్శ గ్రంథం ఎవరిది?
 జ) పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి.


145. ముసలమ్మ మరణం నవ్యకవిత ప్రభాతానికీ వేగుచుక్క అని అన్నది ఎవరు?
 జ) పింగళి లక్ష్మీకాంతం.


146. ఒక సంవత్సరం గడిస్తే ఒక మైలు రాయి గడిస్తే అన్న కవి ఎవరు? అతని కలం పేరు ఏమిటి?
జ) మల్లవరపు విశ్వేశ్వర రావు. కలం పేరు హ్రీ-హ్రీ.
 
147. సంస్కృత తత్సమ పదాలను స్వీకరించరాదు అని పేర్కొన్న కవి ఎవరు?
 జ) తోల్కపియమ్.


148. గోండి భాషకు లిపి సహకారం అందించిన భాష ఏది?
 జ) తెలుగు


149. భాషానువర్తనం.. భాషాంతరంగం.. తెలుగులో వెలుగులు.. తెలుగులో కొత్త వెలుగులు.. తెలుగు భాషా తత్వం మొదలైన భాషాశాస్త్ర గ్రంథాలు వాటి కర్తలు ఎవరు?
జ) చేకూరి రామారావు.. తూ మాటి దోణప్ప.. కొమర్రాజు లక్ష్మణరావు.


150. అల్లాహో అక్బర్ నవల రాసిన భాషావేత్త ఎవరు?
 జ) గంటి జోగి సోమయాజి.


151. ద్రావిడ భాషా తత్వానికి మూల పురుషుడు.. ద్రావిడ వాదానికి మూలపురుషుడు.. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనానికి మూల పురుషుడు ఎవరు?
 జ) ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్..రాస్మన్ రాస్క్.. రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్.


152. తావీజు.. తేరు.. తమాషా మొదలైన అన్యదేశ్యాలు ఏ భాషకు చెందినవి?
 జ) మరాఠీ.. తమిళం.. ఉర్దూ.


153. భాష ప్రామాణీకరణకు ఆరు పద్ధతులు చెప్పిన వా రెవరు? ఇతను చెప్పిన ఈ ఆరు అంశాల వల్ల భాష ప్రామాణిక రణంలో అనేక సమస్యలను పరిష్కరించుకో గలిగాం!
 జ) టీనర్


154. గొలుసు అనే మాండలిక పదం ఏ మాండలిక కుటుంబానికి చెందింది?
 జ) కళింగాంధ్ర మాండలికం లేదా పూర్వాంధ్ర.


155. ఆంధ్ర భాష పేరుతో వ్యవహారిక భాషోద్యమం గురించి రాసింది ఎవరు?
 జ) వజ్ఝల చినసీతారామశాస్త్రి.


156. గ్రామ్య వాదుల భాషా వివాదాలు పేరిట గ్రాంథిక భాషా వాదాన్ని సమర్ధిస్తూ వచ్చిన రచన ఎవరిది?
 జ) పానుగంటి లక్ష్మీ నరసింహారావు.


157. పూజ్యం అర్థ పరిణామం లో దేనికి చెందినది?
 జ) అర్థ గ్రామ్యత లేదా అర్థ ప్రకర్ష.


158. కన్యకా పరమేశ్వరి కథ గానం చేసే వారు ఎవరు?
  జ) వీరముష్టి వారు.


159. వీర ముష్టి వారి యొక్క  వాయిద్యాలు ఏమిటి?
 జ) తప్పెట లేక జేగంటా.


160. ఏకతార ..తంబుర వాయిద్య పరికరాలు ఏ రకానికి చెందినవి?
 జ) తంత్రి వాయిద్యం.


161. మడేలు పురాణం ఏ సంబంధిత కులానికి చెందింది?
 జ) రజకులు.


162. బ్రాహ్మణ కులాన్ని ఆశ్రయించి వినోదాన్ని కలిగించి ద్రవ్యా ర్జానచేసే వారు ఎవరు?
 జ) విప్రవినోదులు.


163. జానపద హస్తకళలలో నిర్మల్ ..కరీంనగర్ ..తిరుపతి తిరుచానూర్ వీటికి ప్రసిద్ధి గాంచినవి?
 జ) బింధ్రినగీషి..పీలగ్రీ.. ఎర్ర చందనం బొమ్మలకు.


164. గొంగళి పురుగులు ప్రతీకవాదం లో వచ్చిన రచన ఎవరిది?
 జ) బాలగంగాధర్ తిలక్.


165. నా తల్లి ఉమ్మ నీరు ని ఉమ్మి చేయొద్దు అంటాను అన్న కవి ఎవరు?
 జ) అప్సర్


166. సత్యాగ్ని కథలు ఏకవితా వాదానికి చెందినవి? రాసినది ఎవరు?
 జ) ముస్లింవాద కవిత్వం.. షేక్ హుస్సేన్.


167. కుమారుడు.. కవి మొదలైన పదాలకు వికృతి పదాలు తెలపండి?
 జ) కొమరుడు..కయి.


168. రథము పదానికి పర్యాయపదాలు తెలపండి?
 జ) తేరు..స్కందనము.


169. బ్రాతృజనం అనగా అర్థం ఏమిటి?
 జ) బంధువులు.


170. యానాదులు.. భారతదేశంలో ఆదివాసులు.. అడవి పూలు.. నాగులు.. చెంచులు.. సంచార జాతులువంటి అనేక పుస్తకాలు రాసిందెవరు?
 జ) వెన్నెలకంటి రాఘవయ్య.


171. విశ్వనాథ సత్యనారాయణ తన ఆంధ్రప్రశస్తి రచనలో ఏరాజు యొక్క ధర్మ నిరతిని ప్రశంసిస్తూ తెలియజేస్తాడు? కన్న కొడుకు ఉరి శిక్ష అమలు చేసిన వ్యక్తి అతను మరి ఆ రాజు ఎవరు?
 జ) మాధవ వర్మ.


172. బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు?
 జ) చలం.


173. నిమ్నజాతి ముక్తితరంగిణి.. రచన ఎవరిది?
 జ) కుసుమ ధర్మన్న.


174. ఏకాకి నౌక చప్పుడు.. చివరి మనుషులు. బందీ.. వంకరటింకర.. ఆరు గ్లాసులు మొదలైనవి ఎవరి రచనలు? అదేవిధంగా అద్దంలో చందమామ ..పంచమం రచనలు ఎవరివి? ఇవి ఏ ప్రక్రియలో రచించబడినవి?
 జ) చిలుకూరి దేవపుత్ర. అద్దంలో చందమామ పంచమం అనేవి నవలలు.. మిగతావన్నీ కథాసంపుటాలు.


175. సుందర రామాయణం.. సుందర భాగవతం ..బలిదానం.. అపవాదు.. పేద కవి ..నా స్వామి.. నేటి కవిత్వం.. కావేటి నగర రాజా నిరాజనం. శ్రీనివాస శతకం ..బుద్ధ గీత మొదలైన రచనలు ఎవరివి?
 జ) శంకరంబాడి సుందరాచార్య.


176. దేవదత్తుడు.. తులసీదాసు.. త్యాగరాజు అనే పద్య కావ్యాలు.. గృహస్థ జీవితం.. స్త్రీ ధర్మం.. తార.. శ్రీమతి  మొదలైన నాటకాలు రాసిందెవరు?
 జ) పైడిమర్రి వెంకట సుబ్బారావు.


177. సమయస్ఫూర్తి పాఠంలో పేర్కొన్న రోమశుడు.. చంద్రుకుడు అనే పాత్రల పేర్లుగల జంతువులు ఏవి?
 జ) చంద్రుకుడు (గుడ్లగూబ) రోమశుడు(పిల్లి).


178. సర్వ సారస్వత ప్రపంచంబు నందు గాంధీ యనియెడి వర్ణ యుగంబుతోడ సాటి వచ్చెడు వేరొక మాట గలదె అన్న కవి ఎవరు?
 జ) నాళం కృష్ణారావు.


179. స్వరాజ్య గీతములు.. హరిజనుల పాటలు.. దండాలు దండాలు భారత మాత గేయాలు రాసిన కవి ఎవరు? అతని బిరుదు ఏమిటి?
 జ) గరిమెళ్ళ సత్యనారాయణ.


180. అమరావతి కథలు.. కార్తీక దీపాలు అనే కథా సంపుటాలు.. రేపటి దారి .. సీతా స్వగతాలు..ఆఖరి ప్రేమ లేఖ.. ఎడారిలో కలువ పూలు మొదలైన నవలలు.. హర హర మహాదేవ అనే నాటకం రాసిన ప్రముఖ ఆధునిక రచయిత ఎవరు?
 జ) సత్యం శంకరమంచి


181. పిల్లల కోసం బాల రసాలు.. పాలబడి పాటలు.. ఆవు- హరిచంద్ర . బాల తనం.. చిన్నారి లోకం.. పూల బాలలు.. ఋతు వాణి వంటి పిల్లల పుస్తకాలు రచించి బాలబంధుగా ప్రసిద్ధులైన ఆధునిక కవి ఎవరు?
 జ) బడిగ వెంకట నరసింహారావు


182. దాశరథి రచించిన అగ్నిధార కవితాసంపుటి నుంచి తీసుకోబడిన ఆలోచనం గేయంలో ఎన్ని పంక్తులు ఉన్నాయి?
 జ) 28.


183. కురవంజి అనగానేమి?
*జ) నిత్యం తాళంతో కూడిన లయబద్ధమైన అడుగు.


184. కోలాటం లో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఏమంటారు?
 జ) కోపు


185. పురాణ గాథలను నాట్య రూపంగా ప్రదర్శించే వారిని ఏమంటారు?
 జ) భాగవతులు.


186. చున్.అన్..ఇనన్.డున్..అనే ప్రత్యయాలు  ఏ అసమాపక క్రియలు?
 జ)శత్రర్ధాకం..తుమ్మున్నర్ధకం..

     చేదర్ధాకం..అనంతర్యర్ధకం.


187. వ్రాలు అనే పదానికి అర్థం ఏమిటి?
 జ) సంతకం

188. హరిహర చరణ రవింద వందనాభిలాషి. ఆంధ్ర కవిత గౌరవ జనమనోవిహారి అని పోతన పూర్వకవీ ప్రశంసలో పేర్కొన్న కవులు ఎవరు?
 జ) తిక్కన.. నన్నయ్య గురించి


189. తొలి నిరోష్ఠ్య రామాయణం ఏది? కర్త ఎవరు?
జ) మరింగంటి సింగరాచార్యులు.. దశరధ రాజనందన చరిత్ర.


190. నా నేర్చు విధంబున నీ క్కావ్యంబు రచించెదననీ అని పలికిన కవి ఎవరు?
 జ) నన్నయ్య


191. కీచక వధ వృత్తాంతం ఏ పర్వంలో ఏ ఆశ్వాసంలో వస్తుంది?
 జ) విరాట పర్వం ద్వితీయాశ్వాసం


192. రెంటిగలయిన్ శివ దాసుడు మధ్య నాయక శ్రీ రచియించే శారదా ధరియింప గవి త్రయ కీర్తిమించగన్ అని పూర్వకవి ప్రశంసలో భాగంగా ఎవరు ఎవరిని గురించి అన్నారు? ఏ రచనలో ?
 జ) రాధామాధవం లో చింతలపూడి ఎల్లనార్యుడు.


193. ధూర్జటి కవిత్వం ఈ విధంగా లోకానికి ప్రసిద్ధిగాంచింది?
 జ) మాధురీ మహిమ.


194. సకల విద్యా వివేక చతురుడు బిరుదు కలిగిన కవి ఎవరు?
 జ) నంది తిమ్మన


195. ధూర్జటి తన కవిత్వమును ఏమని పేర్కొన్నారు?
 జ) దివ్యకళ.


196. శ్రీకాళహస్తి మహత్యం ఆశ్వాసాది పధ్యాలలో కథలను చెప్పటమే కాకుండా కవి నియతంగా ప్రయోగించినది ఏమిటి?
 జ) పంచచామారము.


197. విజయ విలాసంలో కావ్యం ప్రారంభంలో కవి పేర్కొన్న పురము పేరేమి?
 జ) ఇంద్రప్రస్థ పురం.


198. చిన్నయ్యసూరి శబ్ద లక్షణ సంగ్రహము గ్రంథం ఎవరికీ అంకితం ఇచ్చారు?
 జ) గాజుల లక్ష్మీనరసింహ శెట్టి.


199. "ఏనుగు బొవ జూచి ధ్వను లెత్తుచు కుక్కలు గూయసాగుచో "అని చక్కని సామెతలు పదబంధాలతో వివరించి చెప్పిన శతక కవి ఎవరు? పదబంధాలతో లోకోక్తులతో చక్కగా పద్యాలు చెప్పగల దిట్ట. అతను రాసిన శతకం ఏమిటి?
 జ) కాకుత్సాం శేషప్పకవి.. నరసింహ శతకం.


200. వానమామలై వరదాచార్యులు కృతులు పరిశీలన అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రాసింది ఎవరు?
 జ) అందే వెంకట రాజం.


201. 1932లో తెలుగు సాహిత్యంలో వెలువడిన తొలిదళిత కథ ఏది? ఎవరు రాశారు?
 జ) భాగ్యరెడ్డి వర్మ.. వెట్టి మాదిగ.


202. రానున్నది ఏది నిజం రచన ఎవరిది? సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అని తను ఏ రచనలో పేర్కొన్నాడు?
 జ) దాశరధి రంగాచార్యులు.. మోదుగు పూలులో.


203. వాన కడిగిన చీకటి అనే కవితాసంపుటి ఎవరిది? వ్యాస నవమి.. గవాక్షం.. సాలోచన మొదలైన విమర్శ గ్రంథాలు ఎవరు
 జ) డాక్టర్ .ఎన్.గోపి.


204. భార్య కోపవతీ.. అనే కథల సంపుటి.. తరం మారింది నవల తో సుప్రసిద్ధులైన రచయిత్రి ఎవరు?
 జ) మాదిరెడ్డి సులోచన.


205. గెలుపు సరే బ్రతకడం ఎలా? అనే పేరుతో సంపాదకీయాలు రాసింది ఎవరు?
 జ) కె.ఎన్.వై.పతంజలి.


206. నవ్యాంధ్ర కవిత్వంలో తొలి గ్రంథంగా పేరు పొందిన రచన ఏది?
 జ) తృణకంకణం.


207. సింహాసన ద్వాత్రింశిక కావ్యంలో పేర్కొనబడిన కమలాకరుడు ఎవ రి వద్ద శిష్యరికం చేస్తాడు?
 జ) చంద్ర కేతువు.


208. గుణగ విజయాదిత్యుని రామాయణం పాట ఏ ఛందస్సులో ఉంది?
 జ) చంపకమాల.


209. నన్నయ పూర్వయుగం శాసనాల్లో దొరకని క్రియా రూపాలు ఏవి?
 జ) ఉత్తమ పురుష ఏకవచన క్రియ రూపాలు.


300. సోమల దేవి శాసన కర్త ఎవరు?
 జ) భీమన భట్టు.


301."మతిదలపగ సంసారంబతి చంచలము"ఎందులోనిది వాక్యము?
 జ) నన్నయ భారతం.


302. పండితారాధ్యుడి కళ్ళు పోగొట్టి శిక్షించిన రాజు ఎవరు?
 జ) వీర రాజేంద్రచోళుడు.


303. వీర మహేశ్వర సారోద్దరము అని సోమనాధుని ఏ కృతికి పేరు?
 జ) సోమనాథ భాష్యం.


304. తెలుగులో మొట్టమొదటి వంశకథా కావ్యం పేరు ఏమిటి?
 జ) ఉత్తర హరివంశం.


305. సకల విద్యా సనాథుడు అని పేరు తెచ్చుకున్న కవి ఎవరు?
 జ) శ్రీనాథుడు.


306. శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారుడని అన్న విమర్శకులు ఎవరు?
 జ) విశ్వనాథ సత్యనారాయణ.


307. రాజ ఉద్యోగం కంటే భక్తి ఉన్నతమనీ చెప్పబడిన ఉపాఖ్యానం ఏది?
 జ) అంబరీషోపాఖ్యానం.


308. వేదాంతార్థాలను సులభంగా ఆకర్షణీయంగా చెప్పిన కావ్యం ఏది?
 జ) ప్రబోధ చంద్రోదయం.


309. నాటకీయత అధికంగా గల ప్రబంధం ఏది?
 జ) పారిజాతాపహరణం.


310. ఏవనితల్మముందలింపనేమిపనో అనే చాటువు చెప్పింది ఎవరు?
 జ) రంగాజమ్మ.


311. మీరుందరునరుగనరుగానరుగా అని అడిగింది ఎవరు?
 జ) విజయ విలాసం కావ్యంలో సుభద్ర వేషంలో ఉన్న అర్జును డిని


312. శృంగార రస తరంగిత పద కవిత్వ మహనీయమతి స్ఫూర్తిగా తన గురించి తాను చెప్పుకున్న వారు?
 జ) రంగాజమ్మ.


313. తన శిరస్సుపై రాముడు నిలవాలని రామునిని కోరింది ఎవరు?
 జ) శిలా కుమారుడు (భద్రుడు).


314. మాయ చిదానంద మంజరిగ్రంథం ఎవరిది?
 జ) నాదెండ్ల ఉమాపతి.


315. చూపు లేకున్నా జగము లో రూఢిలేదు ధనము లేకున్నా మరియు సంతకును కొరత అనే పద్యం ఎందులోనిది?
 జ) ధనాభిరామము.


316. మనోభోధ ద్విపద కావ్యం ఎవరిది?
 జ) కొలని గణపతిదేవుడు.


317. రాజ వాహన విజయము అనే ప్రబంధ కర్త ఎవరు?
 జ) కాకుమాని మూర్తి కవి.
 
318. విక్రమార్కుని కథలు రచించింది ఎవరు?
 జ) రావిపాటి గురుమూర్తి.


319. సకల వైద్య సంహితా సారార్ణవము అనే వైద్య గ్రంథకర్త ఎవరు?
 జ) కళువెవీరరాజు.


320. సుమతి శతకం పేరుతో రాసిన జంట కవయిత్రులు ఎవరు?
 జ) చదలవాడ నిర్మల. చదలవాడ నాగరత్నమ్మ.


321. క్షేత్రయ్య పదాలను నిశితంగా పరిశీలించిన వారు ఎవరు?
 జ) విస్సా అప్పారావు.


322. సిరియాళ చరిత్ర ద్విపద కావ్య కర్త ఎవరు?
 జ) చిత్తూరు గంగాధర కవి.


323. విజయ రాఘవుని కొలువుకూటం పేరు ఏమిటి? పండిత సభ పేరేంటి?
 జ) కొలువుకూటం పేరు రాజగోపాల విలాసం.
       పండిత సభ పేరు శారదా ధ్వజము.


324. తెలుగులో వెలువడిన మొట్టమొదటి గయోపాఖ్యానం ఏది?
 జ) కృష్ణార్జున సంవాదం.


325. శ్రీకృష్ణదేవరాయలచే  రాజప్రతినిధిగా నియమింపబడ్డా కవి ఎవరు?
 జ) నాదెండ్ల గోప మంత్రి.


326. ఘటికాచల మహత్యంలో రామకృష్ణుడు స్తుతించీన దైవం ఎవరు?
 జ) యోగానంద లక్ష్మీ నరసింహ కవి.


327. రాయలయుగ ప్రబంధాలలో ఉపాఖ్యానాలు అనే గ్రంథ కర్త ఎవరు?
జ) మందంపూడి వెంకటేశ్వర్లు.


328. కవిత పుట్టినిల్లు వెన్నెలకంటి ఇల్లు అని వెన్నెలకంటి వంశస్తుల గురించి అన్నది ఎవరు?
 జ) వెన్నెలకంటి వెంకటాచల కవి.


329. సంకీర్తనా చార్యులు చరిత్రను ద్విపద కావ్యంగా రచించింది ఎవరు?
 జ) చిన్న తిరుమలాచార్యుడు.


330. తెనుగునదేటగా తమదెల్పిన కావ్యం పొందలేదు అని అన్నది ఎవరు?
 జ) కొఱవి గోపరాజు.


331. పవిత్రమైన స్త్రీలకు సద్గుణ నికురుంబ అనే విశేషణాన్ని వాడటం ఏ కవికీ ఇష్టం?
 జ) శ్రీనాథుడు.


332. తెలుగులో వెలసిన మొదటి హేళన రచన ఏది?
  జ) క్రీడాభిరామం.


333. గోధూళి లగ్నమున బురము ప్రవేశించాలని ఎందులో చెప్పబడినది?
 జ) క్రీడాభిరామం.


334. శైవుడుగా ఉండి విష్ణు సంబంధమైన కావ్యాలను రచించిన కవి ఎవరు?
 జ) ఎర్రన్న.


335. దినచర్యలను గురించి వివరించే తొలి వైద్య గ్రంథం ఏది? ఎవరు రాశారు?
 జ) చారుచర్య.. అప్పన్న మంత్రి.


336. చలన స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి ఏ కవి వర్ణనా నైపుణ్యం?
 జ) తిక్కన్న.


337. సారకవితాభిరామునిగా పేరు గాంచినది ఎవరు?
 జ) మంత్రి భాస్కరుడు. 

338. అద్దంకి గంగాధరుడు కవి యొక్క గురువు ఎవరు?
 జ) కేదారనాథుడు.


339. మాటిమాటికి నన్ను మాలవాడుంచు నీకు రోయగనేల.. పలికిన వాక్యాలు ఏ కావ్యం లోనివీ? ఏ కవి కి సంబంధించినవి?
 జ) గౌరన ..హరిశ్చంద్ర పాఖ్యానంలో..


340. ఉషా పరిణయం అనే పేరుతో చిత్ర కావ్యం రచించింది ఎవరు?
 జ) దామెర్ల అంకన్న.


341. కావ్య ప్రక్రియ భేదాన్ని బట్టి సాహిత్య విభజన చేసిన వారు ఎవరు?
 జ) దివాకర్ల వెంకటావధాని.


342. బృహత్కథ లోనే భాగాలకు ఏమని పేరు? అవి ఎన్ని?
 జ) లంబ కములు (6).


343. మహాభారతాన్ని బహుపురాణ సముచ్చయం అని భావించారు?
 జ) పౌరాణికులు.


344. నన్నెచోడుడుకంటే ముందుగా వస్తు కవిత్వాన్ని కన్నడంలో ప్రస్తావించింది ఎవరు? అసలు వస్తుకవిత్వం అనగా ఏమిటి?
 జ) పంపకవి. సంస్కృతచంపూలక్షణాల్ని అనుసరించి రాయబడిన గద్యపద్యాత్మక కావ్యం.


345. వేదవతి ఇతివృత్తం కలిగిన తిక్కన్న కావ్యం ఏది? ఈమె ఎవరు కూతురు?
 జ) నిర్వచనోత్తర రామాయణం (కుశధ్వజుడు కూతురు).


346. పాండవుల యొక్క శంఖాల పేర్లు చెప్పండి?
 జ) ధర్మరాజు (అనంత విజయం)
      భీముడు (పౌం డ్రం)
      అర్జునుడు ( దేవదత్తం)
      నకులుడు ( ‌సుఘోషం)
      సహదేవుడు (మణిపుష్పకం).


347. ఆంధ్ర భారత కవితా విమర్శనము రాసింది ఎవరు?
 జ) కోరాడ రామచంద్ర శాస్త్రి.


348. ప్రభావతీ ప్రద్యుమ్నం లో ప్రభావతి చెల్లెలు పేరు ఏమిటి?
   జ) శుచిముఖి


349. ఇంద్రునికే ఉపాయం చెప్పగల దిట్ట గా ప్రబంధంలో  పాత్రను తీర్చిదిద్దిన కవి ఎవరు రచన ఏది?
జ) ప్రభావతి ప్రద్యుమ్నం లో. కవి పింగళి సూరన.


350. ఇల్లలకి న పండు గగునే అనే జాతీయాన్ని వాడిన కవి?
 జ) పింగళి సూరన.


351. ఉపమాతిశయోక్తి కామదేనువు అనే బిరుదుగల ప్రబంధ పాత్ర ఏది ఎవరు ఇచ్చారు? ఈ బిరుదు ఏ రచన లో కలదు?
జ) సరస్వతి దేవి ..శుచిముఖీ.గురించి ప్రభావతీ ప్రద్యుమ్నంలో.


352. కడుపు బంగారు బొక్కసము చేసిన మేటి అనే అచ్చ తెనుగు పదాన్ని పొన్నగంటి తెలగన్న ఏ పురాణ పాత్ర కీ వాడారు?
 జ) హిరణ్యగర్భుడు.


353. నక్షత్రకుడు చంద్రమతిని.లోహితసుడునీ ఎవరికి విక్రయించాడు? (సంస్కృతంలో హరిశ్చంద్రోపాఖ్యానం రాసిన శంకర్ కవి గ్రంథంలో)
 జ) కాల కౌశికుడు.


354. అఖిల విద్యా విశారదుడుగా పిలవబడిన కవి ఎవరు?
జ) చేమకూర వెంకటకవి.


355. చేమకూర వెంకటకవి పద్యరూపంలో రచించిన సారంగధర చరిత్ర రచనలో చిత్రాంగద. సారంగధరల మధ్య గల రసంఏమిటి?
జ) శృంగార రసాభాసం.


356. విజయరాఘవుడు పట్టపుకవి కామర సువెంకటపతి సోమయాజి విజయరాఘవుడునీ  కృష్ణుడిగా అర్జునుడి గా పోల్చి రచించిన కావ్యం ఏది?
 జ) ముక్కోటి రామాయణం.


357. చెంగల్వకాళకవీ ఏ కావ్యంలో శ్రీకృష్ణునీ అష్ట మహిఘలు అష్టవిధ శృంగార నాయికలుగా వర్ణించాడు?
 జ) రాజగోపాల విలాసం.
 
358. అన్నూరు శాసన కర్త ఎవరు?
 జ) అల్లసాని పెద్దన్న.


359. తెలుగులో మార్గ కవిత పద్ధతికి ఆద్యుడు ఎవరు?
 జ) నన్నయ్య.


360. దృతరాష్ట్రుడు తండ్రి ఎవరు?
  జ) విచిత్రవర్యుడు.


361. వీరశైవుల నమ్మకం ప్రకారం బసవేశ్వరుడు పండితారాధ్యుడు పాల్కురికి సోమనాథుడు ఏమవుతారు?
 జ) బసవేశ్వరుడు (నందీశ్వరుని అవతారం)
      పండితారాధ్యుడు (ప్రమదుల అవతారం)
      పాల్కురికి సోమనాథుడు (భృంగిరిటీ) అవతారం.


362. పురాణ శైలిలో రచించబడ్డ ఇతిహాసం ఏది?
 జ) ఉత్తర హరివంశం.


363. పల్నాటి వీర చరిత్రలో కోళ్ల పోరు ..గోపన్న విరుగు భాగాలు.. కొమ్మరాజు యుద్ధం రాసింది ఎవరు?
 జ) కోళ్ళ పోరు.. గోపన్న వీరుగు(మల్లయ్య)
       కొమ్మరాజు యుద్ధం (కొండయ్య )


364. సంస్కృతంలో కథాసరిత్సాగరం రాసిందెవరు?
 జ) సోమదేవ భట్టు.


365. అన్నమయ్యను దర్శించుకున్న కన్నడ వాగ్గేయకారుడు ఎవరు?
 జ) పురంధర దాసు.


366. నాయక నామంతో గెలిచిన మొదటి ప్రాచీనాంధ్ర గ్రంథం ఏది?
 జ) ఆముక్తమాల్యద.


367. దిన వెచ్చము. వ్రాయిస ప్రవృత్తి.. కనక క్రోవి జాతీయాలు ఎవరివి?
 జ) తెనాలి రామకృష్ణుడు.


368. కళాపూర్ణోదయం అనగా నేమి?
 జ) ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనం.


369. లలాటే క్షణ భక్తి శీలుడు ఎవరు?
 జ) పింగళి సూరన.


370. సాహిత్యంలో నాయకభ్యుదయనకు ఆద్యుడు ఎవరు?
 జ) రఘునాథ నాయకుడు.


371. తెలుగు లో వెలసిన తొలి స్వాంతన గ్రంథం ఏది? కర్త ఎవరు? స్వాంతనము అనగా అర్థం ఏమిటి?
 జ) లింగనముఖి కామేశ్వరి కవి..(అలుక).


372. కనుపర్తి అబ్బయామాత్యుడు రాసిన కవిరాజ మనోరంజనంలోని ఇతివృత్తం ఎవరికి సంబంధించింది?
 జ) పూరురువ.


373. వక్రోక్తియే సర్వాలంకార బీజం.. అతిశయోక్తియే సర్వాలంకార బీజం.. ఉపమాన అలంకారమే సర్వాలంకార బీజం అన్న అలంకారికులు ఎవరు?
జ) భామహుడు. మమ్ముటుడు. వామనుడు.


374. నిద్ర ..మతి అనేవి వీటిని తెలుపుతాయి అలంకార శాస్త్ర పరంగా?
 జ) సంచారి భావములు.


375. బీభత్సము .భయానకంలో ఉండే పాకం ఏమిటి?
 జ) నారికేళ పాకం.


376. నాట్యదర్పణం అనే అలంకార గ్రంథాన్నిరాసిన జంట కవులు ఎవరు?
 జ) రామ చంద్ర...గుణ చంద్రులు.


377. సాహిత్య పరిశీలనలో పాశ్చాత్య దృక్పథంను ప్రవేశపెట్టింది ఎవరు?
 జ) సి.పి.బ్రౌన్.

378. గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క గురువు ఎవరు? (తొమ్మిదవ తరగతి ఉపవాచకం పాఠం ఆధారంగా)
 జ) వారణాసి గున్నయ్య శాస్త్రి.


379. కాంభోజి రాగం ఏకవికీ సంబంధించినది?
 జ) భట్టుమూర్తి.


380. పరిచిత లేఖలు ఎవరికీ సంబంధించినవి?
 జ) అబ్బూరి ఛాయాదేవి.


381. శహాజిచే కనకాభిషేకం గౌరవాన్ని పొందిన కవి ఎవరు? శహాజీకీ గల బిరుదు ఏమిటి?


382. యక్షగానం.. చిత్రకవిత్వం.. రగడ ..పురాణం.. మొదలైన ప్రక్రియలకు లక్షణాలు చెప్పిన వారు ఎవరు?
 జ) యక్షగానం ( అన్నమయ్య)
      నాచన సోమన (చిత్ర కవిత్వం)
      రగడ (విన్నకోట పెద్దన్న)
      పురాణం(అమరసింహుడు)


383. ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు యొక్క భార్య పేరు ఏమిటి? అతనిరాజధాని ఏమిటి?
 జ) భార్య చిత్రరేఖ రాజధాని మహెదయం.


384. ద్విపదలో రుక్మాంగద చరిత్ర రచించింది ఎవరు? ఇది అలభ్య రచన!
 జ) చదలవాడ మల్లన్న.


385. లక్షణ దీపిక లక్షణ గ్రంథం ఎవరిది?
 జ) వార్త కవి రాఘవయ్య.


386. ఏరచనలో మొల్ల తిక్కన సమకాలికురాలు అని పేర్కొనబడింది అలా చెప్పిన కర్త ఎవరు? రచన ఏది?
 జ) ఏక్రమనాథుడు రచించిన ప్రతాప చరిత్రలో


387. రాజవంశాలను కావ్య భేదాలను బట్టి సాహిత్య రచన చేసిన వారు ఎవరు? అతని కలం పేరు ఏమిటి?
 జ) కవిత్వవేది కేవీ నారాయణరావు.


388. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు. ఈ పద్యం ఎవరి భారతం లోనిది? ఏ ఉపాఖ్యానం లోనిది?
 జ) పౌష్యోదం కో పాఖ్యానం.


389. ఆంధ్ర శబ్ద చింతామణికీ వికృతి వివేకానికి కలిపి కవి శిరోభూషణము పేరుతో సంస్కృతంలో వ్యాఖ్య రాయబడింది దీనికి ఏమని పేరు?దీనిని దేనికి సమానంగా పండితులు కీర్తించారు?
జ) అహోబల పండితుడు రాసిన అహోబల పండితీయం.               పతంజలి మహాభాష్యంతో పోలుస్తారు.


390. తిక్కన్న చేవిశేష వృత్తాలు వాడిన పర్వం ఏది?
 జ) స్త్రీ పర్వం.


391. బ్రహ్మర్షి నామంతో ప్రచారమైన పురాణం ఏది?
   జ) మార్కండేయ పురాణం.


392. ఎర్రన అరణ్య పర్వం ప్రారంభంలో ఏ దేవిని ప్రార్ధించాడు?
 జ) వాగ్దేవి.


393. ఎర్రన్న రచనను పుష్ప గుంఫితము అన్నది ఎవరు?
 జ) వేలూరిశ్రీరామ శాస్త్రి.


394. అన్ని విధాల తిక్కన వారసత్వము దక్కించుకున్న కవి ఎవరు?
 జ) నాచన సోమన.


395. బసవ పురాణంలో సిరియాళుని భార్య తిరువెంగనాచి అయితే హరవిలాసంలో  చిరుతొండనంబి భార్య ఎవరు?
 జ) తిరువెంగనాచి


396. గోదావరి అందాలు ..పరిసర వర్ణన చేసిన శ్రీనాథుని రచన ఏది?
జ) భీమ ఖండం.


397. శ్రీనాథుడు వీరభద్రారెడ్డి కొలువు నందు ప్రవేశం పొందుటకు చేసిన రచన ఏది?
 జ) భీమఖండం.


398. సత్య కథనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వవలసిన సాహిత్య ప్రక్రియ ఏది?
 జ) స్వీయ చరిత్ర లేదా ఆత్మ కథ.


399. దువ్వూరి రామిరెడ్డి తన రచనలు అన్నిటినీ ఏ పేరుతో ప్రచురించాడు?
 జ) voiceoftheread.


400. జానపదకథ సాహిత్యంలో ఎల్లమ్మ కథ తప్ప మిగతా స్త్రీపాత్రలు అన్నిటినీ పురుషులు ధరించే జానపద కళారూపం ఏది?
 జ) చిందు భాగవతం.


401. నేత్ర తోత్సవం అనే జాతీయాన్ని ఎవరు ప్రయోగించారు?
 జ) శ్రీనాథుడు.


402. శ్రీనాథుడు రాసిన కాశీ ఖండానీకి మణికర్ణిక పేరుతో వ్యాఖ్యానం రాసిందెవరు?
 జ) మల్లంపల్లి శరభయ్య.


403. పింగళి సూరన కళాపూర్ణోదయంకి వెన్నెల పేరుతో వ్యాఖ్యానం రాసిందెవరు?
 జ) కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి.


404. పాణినీయ సూత్రాలకు పతంజలి భాష్యం రాయగా భాష్యానికి కైయటుడు రాసిన ఉప వ్యాఖ్యపేరు ఏమిటి?
 జ) ప్రదీపం.


405. మహాభారతంలోని కొన్ని పర్వాలకు గచ్ఛత్ వ్యాఖ్య అనే పేరుతో సమకూర్చింది ఎవరు?
జ) చదలవాడ సుందరరామశాస్త్రి.. పురాణపండ మల్లయ్య శాస్త్రి.


406. మందారం వ్యాఖ్యానం వాల్మీకి రామాయణానికి తెలుగులో అనువాదంగా రాసిన కర్త ఎవరు?
 జ) వావిలికొలను సుబ్బారావు.


407. బువ్వకు సరిపోవునన్నీ గవ్వలు లేకపోయినా మువ్వపు కైతలు రచించిన కవి ఎవరు?
 జ) వానమామలై వరదాచార్యులు.


408. పొనగంటి తెలగన రచించిన యయాతి చరిత్రకు వ్యాఖ్యానం రాసిందెవరు?
 జ) కపిలవాయి లింగమూర్తి కవి.


409. తెల్లని గడ్డం బు.. తెల్లని మీసముల్. నెరిసినరోమపాండురశిరంబు అని శ్రీనాథుడుహర విలాసంలో ఎవరిని వర్ణించాడు?
 జ) ఇంద్రుడుని.


410. సాని కూతల సౌందర్య వర్ణన గల శ్రీనాథుని రచన
 ఏమిటి?
 జ) భీమేశ్వర పురాణం.


411. మోక్ష సాధన సామాగ్రామాం భక్తి రేవ గరియసి అనే వాక్యానికి లక్ష్యంగా , బోగన్న, అనే కథ గల శివకవి యుగములోనీ కావ్యం ఏది?
 జ) శివ తత్వ సారం.


412. విదూషకుడు మైత్రేయుడు ఒక పాత్ర గల సంస్కృత నాటకం పేరేమి?
 జ) మృచ్ఛకటికం.


413. నాయకి భాష పై ప్రభావం చూపిన భాష ఏది?
 జ) మరాఠీ.


414. ఉదంకోపాఖ్యానంలో ఉదంకుని శాపించిన రాజు ఎవరు?
 జ) పౌఘ్యడు.


415. మా తెలుగు వాణికి మల్లెపూదండ గీతం ఎవరిది?
 జ) దామరాజు పుండరీకాక్షుడు.


416. మూర్తిత్రయో పాఖ్యానం కర్త ఎవరు?
 జ) దంతులూరి బాపిరాజు.


417. మహాభారతంలో భీష్ముడి ధ్వజము పేరు ఏమిటి?
 జ) తాళ ధ్వజం.

418. అనిమిష నాధుడు అర్థం ఏమిటి?
 జ) ఇంద్రుడు.


419.తీర్థం నానార్థాలు?
జ) పుణ్య నది.. జలం.. ఉపాధ్యాయుడు.. మంత్రి.


420. పడతి పర్యాయ పదాలు?
జ) స్త్రీ .ఉవిధ.ఇంతి. మహిళ. నవల .కోమ్మ.


421. స్రవంతి వ్యుత్పత్తి అర్థం?
 జ) పర్వతాల నుండి స్రవించేది (నది).


422. ఘటము వికృతి?
 జ) కడవ.


423. కద్రువ ..వినత. గరుత్మంతుడు.. ఇంద్రుడు.. కశ్యప ప్రజాపతి మొదలైన పాత్రలు ఎవరి భారతంలో ఏ పర్వంలో ఏ ఆశ్వాసంలో వస్తాయి?
జ) నన్నయ్య మహాభారతం, ఆదిపర్వం..ద్వితీయాశ్వాసం.


424. అనుసృజన పద్ధతిలో శైలిలో తరువాత కవులకు మార్గదర్శి అయిన కవి ఎవరు?
 జ) నన్నయ్య.


425. అనిమిష సుగుప్తమయిన యమృతము దెచ్చి మీకు ఇచ్చితిని అని పలికిన పాత్ర ఎవరు?
 జ) గరుత్మంతుడు.


426. జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని పలికిన మాటలు ఎవరు? ఏ కావ్యంలోనివి?
 జ) శ్రీనాథుడు క్రీడాభిరామంలో.


427. హద్దులు హద్దులు పాఠం రచయిత ఎవరు?
 జ) నండూరి సుబ్బారావు.


428. అజంతా మనసు ఏదో స్వప్నిక జగతులోకీ తీసుకుని వెళుతుంది అయినా అది వాస్తవికమైన లోకమే అన్న వారు ఎవరు?
 జ) జవహర్.లాల్ నెహ్రూ.


429. యాత్రరచన ప్రక్రియలో భావాలను తెలియజేయు శైలి ఏమిటి?
 జ) ఆత్మాశ్రయత శైలి.


430. శ్రామికుల బాధలను కళ్లకు కట్టినట్టుగా రాబోయే తరాలకు చెప్తాను అన్న కవి ఎవరు? ఈ మాటలు ఏ కవితా వాదానికి చెందినది?
జ) శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యం లోని ప్రతిజ్ఞ గేయం అభ్యుదయ కవిత్వానికి చెందింది.


431. పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు సముద్రం ఎవడి కాళ్ళ కింద మొరగదు నేనింత పిడికెడు మట్టే కావచ్చు. కానీ కలము ఎత్తితే నాకు ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది అన్న మాటలు ఏ కావ్యం లోనిది? ఏ కవి కి సంబంధించిన వి?(ప్రతి సమావేశంలో జనసేన అధినేత చెప్పేమాట)
జ) గుంటూరు శేషేంద్రశర్మ.. కవిసేన మేనిఫెస్టో రచనలో.


432. దేశభక్తి ఏ సమాసం?
 జ) సప్తమీ తత్పురుష సమాసం.


433. సరస సాహిత్య విచక్షణుడు.. మనోహరమైన శైలి కలిగిన కవి ఎవరు?
 జ) గౌరన.


434. మధుపర్కాలు అర్థపరిణామంలో దేనికి చెందినది?
 జ) అర్థ సంకోచం.


435. ఎస్టి ..జ్ఞానానందకవికి 1975 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ తరపున ఉత్తమ సాహిత్య రచయిత పురస్కారం ఏరచనకు లభించింది?
 జ) అమ్రపాలి.


436. ఒక విద్యార్థి అమ్మ కోసం పాఠం అయిన తర్వాత ముగింపు లేని అంశాలకు ముగింపు ఇవ్వగలిగాడు మరి విద్యార్థి సాధించగలిగిన విద్యా ప్రమాణాలులో ఏ సామర్థ్యానికి చెందింది?
జ) సృజనాత్మకత.


437. జీవనభాష్యం పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
 జ) గజల్.

438. విజయనగర సాళువ వంశం విశేషాలు దేవులపల్లి శాసనం ద్వారా తెలుస్తాయి మరి ఈ శాసనం కర్త ఎవరు?
  జ) జయంతి రామయ్య పంతులు.


439. శైవ సాంప్రదాయం గల జానపద కళలను ప్రదర్శించేవారు ఎవరు?
 జ) కొమ్ముల వారు.


440. ప్రాచీన కవులలో సమగ్రమైన అనువాద విధానాన్ని ప్రస్తావించిన ప్రాచీన కవి ఎవరు?
 జ) శ్రీనాథుడు.


441. రోలు అనే పదం అర్థ పరిణామంలో ఏమిటి?
 జ) వర్ణవ్యత్యయం.


442. తుల్యుడు.రంభ.చతుర్ధన మహారాజు పాత్రలు గల కావ్యం ఏది?
 జ) చిత్ర భారతం.


443. మొట్టమొదటి అచ్చతెలుగు నిఘంటువు ఏది? కర్త ఎవరు?
 జ) వెంకటేశనాంధ్రము.. గణపవరపు వేంకటకవి.


444. తెలుగు ఛందస్సు గురించి సంస్కృతంలో రాయబడిన గ్రంథం ఏది? కర్త ఎవరు ?
 జ) గౌరన. లక్షణ సారము.


445. మత్తకోకిలలోని మొదటి రెండు గురువులను రెండు లఘువులుగా మారితే వచ్చే పద్యం ఏమిటి?
 జ) తరళము


446. వీరగండ గోపాలుడు బిరుదు కలిగిన వారు ఎవరు?
 జ) రెండో మనుమసిద్ధి.


447. యుద్ధమల్లుడు బెజవాడ శాసనం వెలికి తీసింది ఎవరు? మొదట కనిపెట్టింది ఎవరు? ఆధారాలతో గుర్తించింది ఎవరు?
 జ) టేకుమళ్ళ రాజగోపాల్ రావు.
      జయంతి రామయ్య పంతులు.


448. శ్రీ పండితుడు యుద్ధమల్లుని బెజవాడ శాసనము రాశాడని అభిప్రాయపడింది ఎవరు?
జ) నిడదవోలు వెంకట్రావు.


449. మధుర నగర్ వర్ణన కలిగిన కావ్యాలు ఏవి?
 జ) ఆముక్తమాల్యద.. శ్రీకాళహస్తి మహత్యం.


450. ఆంధ్రభాషా మహాకావ్యం అని శ్రీనాథుడు ఏకావ్యంని పిలిచాడు?
 జ) శృంగార నైషధం.


451. ఆంధ్ర వల్లభుడు ఆస్థాన కవి ఎవరు?
 జ) అనంతామాత్యుడు.


452. చిదానందానగర వర్ణన గల కావ్యం ఏది?
 జ) ప్రబోధ చంద్రోదయం.


453. వీరశైవ భక్తి ఉద్యమం లక్షణమైన కుల భేద నిరసనను పేర్కొన్న సోమనాధుని రచన ఏది?
 జ) అనుభవసారం.


454. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర పోరాట గాథ ను స్వాతంత్ర్య వీరుడు అనే పేరుతో రాసిందెవరు?
 జ) పాణ్యం నరసయ్య.


455. సంసార వృక్షానికి రెండు అమృత ఫలాలు ఒకటి కావ్యామృత రసావం రెండోది సజ్జన సాంగత్యం అని అన్నది ఎవరు? ఈ మాటలు ఏ పాత్ర చేత   పలికించారు?
 జ) చిన్నయ్య సూరి.. ధన్యుడు పాఠం లోని మంధరుడు పాత్ర చేత.


456. కవి గాలిని గురించి రాయి గాలిని మాత్రం నీ గేయాల్లో నింపకు అన్నది ఎవరు?
 జ) నగ్నముని.


457. బాణాసురుడు దేనికి రాజు?
 జ) శోణీతపురం.


458. తన ఊహ ప్రేయసిని అమ్మ అని సంబోధించి నా ఊహలలో విలక్షణ చూపించిన భావ కవి ఎవరు?
 జ) నండూరి సుబ్బారావు.


459. నాయని సుబ్బారావు మాతృ గీతాలకు హాస్య పేరడీ రచన చేసింది ఎవరు?
 జ) మాదిరాజు దేవిప్రసాద్.


460. కావ్యం కోసం కాకుండా చమత్కారం కోసం కావ్యం అనిపించేలా వ్రాయబడిన కావ్యం ఏది?
 జ) విజయ విలాసం.


461. సాన బట్టని గనిలోనే రత్నము అని సురవరం ప్రతాపరెడ్డి ఏ గ్రంథంగురించి చెప్పాడు?
 జ) ఆముక్తమాల్యద.


5 కామెంట్‌లు:

  1. మాత్రా చంధస్సు కి ఒక నాలుగు పాదాలు ఉదాహరణ చెప్పగలరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాత్రా అంటే రెప్పపాటు కాలాన్ని సూచించారు. దీనిలో ఏక,ద్వి,త్రి మాత్రా కాలాలు ఉన్నాయి.ఇక మాత్రా ఛందస్సు ఉదాహరణకు వస్థే నాకెప్పుడూ మన మహాకవి శ్రీశ్రీ గారి కవిత్వం గుర్తుకు వస్తుంది.

      1.పదండి పదండి
      పదండి ముందుకు
      పడండి త్రోసుకు లాంటి... మహాప్రస్థానం

      2. పోలాలనన్ని హలాలు దున్ని
      ఇలాతలంపై హేమం పండగ
      జగానికంత సౌఖ్యం నిండగ....ప్రతిజ్ఞ.

      3.అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల
      కాదేది కవిత కనర్హం
      తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్లెం... ఋక్కులు

      4. అరె ఝం ఝటక్ మటక్
      ధ్వంసరచన హింస వచన....లాంటి కవితలు అన్నింటినీ
      శ్రీశ్రీ గారు మాత్రా ఛందస్సులో ఉన్నటువంటి చతుర్సగతిలో రాశారు.
      ధన్యవాదాలు...భార్గవ గారు... మీ తెలుగోడు.👍🙏:-).

      తొలగించండి
  2. చంద్రమతి తల్లి తండ్రుల పేర్లు తెలియజేయండి

    రిప్లయితొలగించండి
  3. నాగార్జునసాగర్ కు ఆపేరెలా వచ్చింది??

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.