తెలుగు సామెతలు/telugu samethalu/telugu proverbs
తెలుగు సామెతలు
-
అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది.
- అండలేని ఊళ్ళో ఉండ దోషం, అశలేని పుట్టింట అడుగ దోషం.
- అంతా మావాళ్ళే గాని, అన్నానికి రమ్మనేవాళ్ళే లేరు.
- అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్టూరం మేలు.
- అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్టు.
- అందరూ మాటలు చెప్పేవారేకాని, పూటకు బత్తెం ఇచ్చే వాళ్ళులేరు.
- అందితే సిగ, అందకుంటే కాళ్ళు.
- అగ్నికి వాయువు తోడైనట్టు.
- అగ్నిలో ఆజ్యం పోసినట్టు.
- అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
- అడకత్తెరలో జిక్కిన వక్క మాదిరి.
- అడగనిదే అమ్మయినా పెట్టదు.
- అడవిని గాచిన వెన్నెల. ముదిమిని చేసిన పెండ్లి.
- అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
- అడుక్కుని తినే వాడి ఆలు అయ్యేకంటే, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.
- అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.
- అడుక్కోవటానికి ఈ గడపకాకపోతే. ఇంకో గడప.
- అడుసు త్రొక్కనేల? కాలు కడగనేల?
- అడుక్కుతినే వాడికి అక్షంతలిస్తే మరుక్కుపోయి నోట్లో వేసుకున్నాట్ట.
- అడ్డాలనాడు బిడ్డలుగాని, గడ్డాలనాడు బిడ్డలా?
- అత్తమీద కోపం, దుత్తమీద చూపినట్టు.
- అత్తలేని కోడలుత్తమురాలు, కోడలు లేనత్త గుణవంతురాలు.
- అత్తసొమ్ము అల్లుడు ధారవోసినట్టు ( దానం చేసినట్టు) .
-
అదును ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
- అదిగో పులి అంటే , ఇదిగో తోక అన్నట్టు.
- అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.
- అదృష్టం అందలమెక్కిస్తానంటే, బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట.
- అదృష్టవంతుణ్ణి చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
- అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
- అనువుగానిచోట అధికుల మనరాదు.
- అన్నం పెడితే అరిగిపోతుంది. చీర ఇస్తే చిరిగిపోతుంది. కర్రుకాల్చి వాత పెడితే కలకాలముంటుంది.
- అప్పు ఇచ్చినవాడు బాగు కోరును, తీసుకున్నవాడు చెడుగోరును.
- అప్పుచేసి పప్పుకూడు.
- అభాగ్యునికి ఆకలెక్కువ. నిర్భాగ్యునికి నిద్ర ఎక్కువ.
- అభ్యాసం కూసువిద్య.
- అమ్మతాపెట్టదు, అడుక్కొని తినానివ్వదు.
- అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక.
- అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
- అమ్మయినా అడగందే పెట్టదు.
- అమ్మా అని పిలువని నోరు కుమ్మరి మన్ను ద్రవ్వినట్టి గుంట.
- అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
- అయ్యకు రెండు గుణాలు తక్కువ తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.
- అయ్యకు కోపం సంవత్సరానికి రెండుసార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
- అరటాకుమీద ముల్లుపడ్డా ముల్లుమీద అరటాకు పడ్డ అరటాకుకే ముప్పు.
- అరనిమిషం తీరికాలేదు, అరకాసు సంపాదనా లేదు.
- అరువు సొమ్ములు బరువుచేటు, తీయాబెట్ట తీపులచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.
- అవివేకి చెలిమికంటె వివేకి విరోధం మేలు.
-
అవ్వా కావాలి, బువ్వా కావాలి.
- అసలుకంటే వడ్డీ ముద్దు.
- అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది. పైన తేలుకుట్టింది.
- అయ్యవారొచ్చేదాక అమావాస్య ఆగుతుందా.
- అనుభవం ఒకరిది ఆర్భాటం ఇంకొకరిది.
- అరచేతిలో వైకుంఠం చూపినట్టు.
- అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి.
- అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది.
- ఆడబోయిన తీర్థం యెదురుగా వచ్చినట్టు.
- అగ్నిలో ఆజ్యం పోసినట్టు.
- ఆపదమొక్కులు సంపద మరపులు.
- ఆ ఊరికి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికాఊరు అంతేదూరం.
- ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
- ఆడింది ఆట, పాడింది పాట.
- ఆదిలోనే హంసపాదు.
- ఆరునెలలు సామునేర్చి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు.
- ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్టు.
- ఆరునెలలు సావాసం చేస్తే, వారు వీరవుతారు.
- ఆలులేదు, చూలూలేదు, కొడుకు పేరు సోమలింగం.
- ఇంటగెల్చి, రచ్చగెలువు.
- ఇంటికన్నా గుడి పదిలం.
- ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత.
- ఇంత బ్రతుకు బ్రతికి, ఇంటివెనుకాల పడి చచ్చెనన్నట్టు
- ఇల్లలుకగానే పండుగౌతుందా?
- ఈతచెట్టు( తాటిచెట్టు) కింద పాలుతాగినా కల్లే అంటారు.
- ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి.
- ఉంటే అమీరు సాహెబు, లేకుంటే ఫకీరు సాహెబు, ఛస్తే పీరు సాహెబు.
- ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా?
- ఉట్టికి ఎగురలేనివాడు స్వర్గానికి ఎగురుతా నన్నట్టు.
- ఉద్యోగం పురుష లక్షణం, అది పోతే అవలక్షణం.
- ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు.
- ఉన్నమాట అంటే ఉలుకెక్కువ.
- ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టును, లేనివాడూ ఉన్నవాడికే పెట్టును.
- ఉన్నమ్మ ఉన్నమ్మకే పెడుతుంది. లేనమ్మా ఉన్నమ్మకే పెడుతుంది. లేనమ్మకే ఎవరూ పెట్టరు.
- ఉయ్యాలలో బిడ్డను పెట్టి, ఊరంతా వెదకినట్టు.
- ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు.
- ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది.
- ఊహ ఊళ్ళేలమంటే, రాత రాళ్ళు మోయమంది.
- ఋణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచరాదు.
- ఎంతచెట్టు కంత గాలి.
- ఎంత నేర్చినా ఎంతజూచినా ఎంతవారలైనా కాంతదాసులే.
- ఎంతచేసినా కూటికే, ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే.
- ఎక్కడిదిరా ఈ పెత్తనం అంటే, మూలనుంటే నెత్తెన వేసుకొన్నానన్నాడట.
- ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడట.
- ఎక్కడయినా బావ అనుగాని, వంగతోటలో( కాడ) బావ అనకు.
- ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు.
- ఎవరి పిచ్చి వారికి ఆనందం.
- ఏటి ఈతకు లంక మేతకు సరి.
- ఏ గ్రహం పట్టినా ఆగ్రహం పట్టరాదు.
- ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్టే మహావృక్షం.
- ఏటికి ఎదురీదినట్టు.
- ఏనుగు ఒళ్ళు ఏనుగుకు బరువు, చీమ ఒళ్ళు చీమకు బరువు.
- ఏపాటు తప్పినా సాపాటు తప్పదు.
- ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
- ఏరాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవడానికి?
- ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్టు.
- ఒకడిని చూస్తే పెట్టబుద్ధి, ఇంకొకడిని చూస్తే మొట్టబుద్ధి.
- ఒకరి కలిమికి ఏడిస్తే ఒక కన్ను పోయింది. తన లేమికి ఏడిస్తే రెండో కన్ను పోయింది.
- కంచే చేనుమేస్తె, కాచేవారెవరు?
- కందిచేలో ఉంగరం పారేసుకొని పప్పుకుండలో వెతికినట్టు.
- కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు?
- కందకులేని దురద కత్తి పీటకా?
- కాకై కలకాలం బ్రతికే కంటే, హంసయి ఆరు మాసాలు బ్రతకడం మేలు.
- కడుపునిండిన వానికి గారెలు చేదు.
- కథకు కాళ్ళులేవు, ముంతకు చెవులు లేవు.
- కన్ను మనదే, వేలూ మనదే.
- కరువులో అధికమాసం.
- కలిపి కొట్టరా కావేటిరంగా.
- కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు.
- కలుపు తీయని మడి, దేవుడి లేని గుడి.
-
కృషితో నాస్తి దుర్భిక్షం.
- క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదా లేదు.
- కాకిపిల్ల కాకికి ముద్దు.
- కాకి ముక్కున దొండపండులా . . . . .
- కాకులను కొట్టి గెద్దలకు వేసినట్టు.
- కాచిన చెట్టు. కే కర్ర దెబ్బలు. కాచిన చెట్టుకే కరకు రాళ్ళ దెబ్బలు.
- కాలికివేస్తే మెడకు, మెడకువేస్తే కాలికి.
- కాలు జారితే తీసుకోగలంగాని, నోరు జారితే తీసుకోలేం.
- కిందపడ్దా పైచేయి నాదే అన్నట్టు.
- కీలెరిగి వాత పెట్టాలి.
- కుండలో కూడు కుండలోనే ఉండాలి, బిడ్డలుమాత్రం దుడ్డుల్లా పెరగాలి.
- కూడు ఉంటే కులగోత్రాలెందుకు?
- కూర్చుండి తింటూవుంటే కొండ అయినా కరిగిపోతుంది.
- కొండంత దేవుడికి గోరంత దీపం.
- కొండనాలుకకు మందువేస్తే, ఉన్న నాలుక ఊడిపోయిందట.
- కొంపలు తగలబడిపోతూ ఉంటే, బావులు తవ్వడం మొదలెట్టినట్టు.
- కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.
- కోటి విద్యలు కూటి కొరకే.
- కోతిపుండు బ్రహ్మరాక్షసి.
- కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండినమ్మ తినకా మానదు.
- కల్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగవు.
- కాకిపిల్ల కాకికి ముద్దు.
- కాకులను కొట్టి, గద్దలకు వేసినట్టు.
- కామెర్ల రోగికి కనపడే దంతా పచ్చనే.
- కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు ( దాటినట్టు. )
- కులం కన్నా గుణం ప్రధానం
- కూసేగాడిద వచ్చి మేసే గాడిదను చెరచిందట ( చెరచినట్టు. )
- కొత్త ఒక వింత, పాత ఒక రోత.
- కోటి విద్యలు కూటికొరకే.
- గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్టు
- గంజాయితోటలో తులసి మొక్కలాగ.
- గంతకు తగిన బొంత.
- గారాం గజ్జలకేడిస్తే వీపు దెబ్బలకేడ్చిందట.
- గాలిలో దీపం పెట్టి దేవుడా నేదే మహిమన్నట్టు.
- గుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినట్టు.
- గుడిని మింగేవాడొకడయితే గుడిని గుళ్ళో లింగాన్ని మింగే వాడింకొకడు.
- గోరుచుట్టపై రోకలిపోటు.
- గుడ్డి కన్నా మెల్ల మేలు.
- గుడ్డు కన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే.
- గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు.
- గుమ్మడి కాయల దొంగ అంటే, భుజాలు తడుముకున్నాట్ట.
- గుఱ్ఱం గుడ్డిదైనా దాణాకు తక్కువలేదు.
- గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్టు.
- గోటితో పోయే పనికి గొడ్డలి ఎందుకు?
- గోరు చుట్టుపై రోకటి పోటు.
- గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని ఊరంతా వెదికినట్టు.
- గొర్రెను తినేవాడు పోతే, బర్రెను తినేవాడు వచ్చినట్టు.
- గోరంత కొండంత చేయటం.
- చంకలో పిల్ల నుంచుకొని, సంతలో వెదకినట్టు
- చక్కనమ్మ చిక్కినా చక్కనే ( అందమే)
- చచ్చినట్టు. కల వచ్చినా మేలుకోక తప్పదు.
- చదువక ముందు కాకరకాయ. చదివిన తరువాత కీకరకాయ.
- చదువ నేర్తువా? వ్రాయ నేర్తువా? అంటే చదువ నేరను, చించ నేర్తును అన్నాడట.
- చదువేస్తే ఉన్న మతిపోయినట్టు.
- చదువురానిమొద్దు కదలలేని ఎద్దు.
- చద్దికూడు తిన్నమ్మ మగని ఆకలి ఎరుగదు.
- చల్లకు వచ్చి, ముంత దాచనేల?
- చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు.
- చాలని బట్ట కొంటే చినిగే వరకు దుఃఖం, చాలని మగని చేసుకుంటే చచ్చేవరకు దుఃఖం.
- చింత చచ్చినా పులుపు చావలేదు.
- చిత్తం శివుడిమీద, భక్తి చెప్పుల మీద.
- చీదితే ఊడే ముక్కు ఎన్నాళ్ళు నిలుస్తుంది?
- చినికి చినికి గాలివాన అయినట్టు.
- చెప్పడం తేలిక, చేయడం కష్టం.
- చెప్పడం కంటే చేయడం మేలు.
- చెప్పుడు మాటలు చేటు.
- చాదస్తపు మొగుడు చెపితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.
- చెప్పేవాడికి చేసేవాడు లోకువ.
- చేతకానమ్మకు చేష్టలు మెండు, చెల్లని రూకకు గీతలు మెండు.
- చూచి రమ్మంటే, కాల్చి వచ్చినాడట ( హనుమంతుడి వలె) .
- చెప్పివి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
- చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
- చేసిన పాపం గోసి( చి) లో పెట్టుకొని కాశికి పోయినా కర్మం తప్పదు.
- చేసిన పాపం చెబితే తీరుతుంది ( పోతుంది) .
- చేసినవారికి చేసినంత మహదేవ.
- చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదు.
- చేటు కాలానికి చెడ్డ బుద్ధులు.
- జన్మానికో శివరాత్రి.
-
జీలకర్రలో కర్రలేదు, నేతిబీరలో నేయిలేదు.
- జీవితం ఒక వ్యాధి, నిద్రావస్థ ఉపశమనం, మరణమే ఆరోగ్యం.
- జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా పెట్టవచ్చు.
- జోగి జోగి రాసుకుంటే, బూడిద రాలిందట?
- తడి గుడ్డలతో గొంతు కోసినట్టు.
- తలలు బోడులైన తలపులు బోడులా?
- తల్లిని నమ్మినవాడు, భూమిని నమ్మినవాడు చెడడు.
- తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.
- తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డబేరం.
- తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురునా?
- తానుతవ్వుకున్న గోతిలో తానే పడతాడు.
- తాదూర సందులేదు, మెడకొక డోలు.
- తాను ఒకటి తలిస్తే, దైవమింకొకటి తలచినట్టు.
- తంతే బూర్లు బుట్టలో పడ్డట్టు.
- తాచెడ్డకోతి వనమెల్ల చెరిచినట్టు.
- తనదాకావస్తేనేకాని తలనొప్పి బాధ తెలియదు.
- తా పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు.
- తల్లిపాలు తాగి, రొమ్ము గుద్దినట్టు.
- తలచుకొన్నప్పుడే పెళ్ళి.
- తల్లికి కూడు పెట్టలేనివాడు పినతల్లికి గాజులు చేయించినట్టు.
- తిండికి పిడుగు, పనికి బడుగు.
- తింటేకాని రుచి తెలియదు, దిగితేగాని లోతు తెలియదు.
- తినగ తినగ వేము తియ్యగనుండు.
- తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ.
- తాడు చాలదని బావి పూడ్చుకుంటారా ?
- తగిలించుకోవడం సులభం, వదలించుకోవడ కష్టం.
- తద్దినం భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట.
- తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డబేరం.
- తలలు బోడులైన తలపులు బోడులా?
- తా చెడ్డకోతి వనమెల్ల చెరచిందట.
- తాదూర సందులేదు, మెడకొక డోలు అన్నట్టు తాను మెచ్చింది రంభ? తాను మునిగింది గంగ.
- తానొకటి తలచిన దైవమొకటి తలచు.
- తింటే గారెలు తినవలె, వింటే భారతం వినవలె.
- తిట్టేనోరు, తినే నోరు, తిరిగే కాళ్ళు ఊరకుండవు.
- తినబోతూ రుచులడిగినట్టు.
- దున్నపోతు ఈనింది అంటే, దూడను కట్టివేయమన్నట్టు.
- దెబ్బకు దెయ్యం దిగొస్తుంది.
- దమ్మిడీ ఆదాలేదు. క్షణం తీరికా లేదు.
- దానాలలోకెల్లా నిదానం శ్రేష్ఠం.
- దిక్కులేని వారికి దేవుడే దిక్కు.
- దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
- దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి.
- దూరపు కొండలు నునుపు.
- దొంగచేతికి తాళమిచ్చినట్టు.
- దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే.
- దేవుడు వరమిచ్చినా పూజారి వరమీయడు.
- దుడ్డుకర్రా ఎవరిమాట వింటావే. అంటే ఎవరి చేతిలో ఉంటే వారి మాట అన్నాదట.
- దున్న ఈనిదంటే, దూడను గాట కట్టి వేయమన్నాడట.
- దురదృష్టాన్ని అనుభవించలేనివాడు అదృష్టాన్ని అనుభవించలేడు.
- దూరపు కొండలు నునుపు.
- దేవుడు వర మిచ్చినా, పూజారి వరమీయడు.
- దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినవట.
- ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోవును.
- ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.
- నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.
- నర్మదలో మునిగినా కర్మం తప్పదు.
- నవరత్నాలున్నా నరరత్న ( నారీరత్నం) ఉండాలి.
- నవ్విన నాపచేనే పండుతుంది.
- నా కోడి, కుంపటి లేకపోతే, ఎట్లా తెల్లవారుతుందో ఎట్లా నిప్పు దొరుకుతుందో చూస్తాను అందిట ఒక అవ్వ.
- నక్క ఎక్కడ నాగలోకమెక్కడ?
- నా నోట్లో వేలు పెట్టు, నీ కంట్లో వేలు పెడతానన్నట్టు.
- నిండా మునిగిన వాడికి చలేమిటి?
- నోరు ఉన్నవాడిదే రాజ్యం.
- నానాటికిి తీసికట్టు నాగంబొట్టూ.
- నారు పోసినవాడు నీరు పోయక మానడు.
- నిండుకుండ తొణకదు.
- నిజ మాడితా నిష్ఠూరం.
- నిజం నిలకడ మీద తెలుస్తుంది.
- నిత్యకళ్యాణం. పచ్చతోరణ మన్నట్టు.
- నిత్యమూ చచ్చేవడికి ఏడ్చేదెవరు?
- నిద్ర సుఖమెఱుగదు, ఆకలి రుచి ఎఱుగదు.
- నిప్పు లేందే పొగ రాదు .
- నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు.
- నేర్చినమ్మ ఏడ్చినా బాగుంటుంది.
- పండుగనాడు కూడా పాత మొగుడేనా? అన్నదట.
- పగటి మాటలు పనికి చేటు, రాత్రిమాటలు నిద్రకు చేటు.
- పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చనే.
- పడ్డవారు చెడ్డవారు కారు.
- పదిమంది నడిచింది బాట, పదిమంది పలికింది మాట.
-
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినాడట.
- పాండిత్యానికి తనకంతా తెలుసునన్న అహంకారముంది. వివేకానికి తనకేమీ తెలియదన్న వినమ్రత ఉంది.
- పాత రోత, కొత్త వింత.
- పాత్ర మెఱిగి దానం, క్షేత్రమెరిగి విత్తనం.
- పాపీ చిరాయువు, సుకృతిః గతాయువు.
- పాలుపోసి పెంచినా పాముకు విషం పోదు.
- పిండికొద్దీ రొట్టె తిండి కొద్దీ పసరం.
- పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట.
- పిచ్చి కుదిరితేగాని పెళ్ళి కాదు, పెళ్ళి అయితేగాని పిచ్చి కుదరదు.
- పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.
- పిట్ట కొంచెం, కూత ఘనం.
- పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.
- పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగుతా, ఎవరూ నన్ను చూడలేదని అనుకొంటుందట.
- పిల్లికి ఎలుక సాక్షి.
- పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం.
- పిల్లి కడుపున పులి పుడుతుందా?
- పురిటిలోనే సంధి కొట్టినట్టు.
- పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకొన్నట్టు.
- పెట్టనమ్మ పెట్టనే పెట్టదు, పెట్టేముండ కేమొచ్చింది పెద్దరోగం?
- పెరటిచెట్టు మందుకురాదు.
- పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ కొరికి పెట్టిందట.
- పైన పటారం, లోన లొటారం.
- పొట్టివానికి పుట్టెడు బుద్దులు.
- ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, అభావ వైరాగ్యం పండుకున్నవారకి పరుపులు వేస్తారు, ఎగిరేవారికి రెక్కలు కట్టేస్తారు.
- పిండికొద్దీ రొట్టె.
- పులి కడుపున పిల్లి పుడుతుందా?
- పరుగెత్తి పాలుతాగేకన్నా నిలబడి నీళ్ళుతాగడం మేలు.
- పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
- పెద్దల మాట చద్దిమూట.
- ప్రజలమాటే ప్రభువు కోట.
- ప్రీతితో పెట్టింది పిడికెడైన చాలు.
- బంగారముంటే, సింగారానికేమి తక్కువ.
- బజారు బత్తెం, బావినీళ్ళు.
- బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు.
- బావిలో కప్పకు, గానుగ ఎద్దుకు అవే లోకాలు.
- బూడిదలో పోసిన పన్నీరు బుడబుడ ( వలె) .
- బ్రతికి వుంటే బలుసాకు తిని బతకవచ్చు.
- బ్రహ్మచారీ శతమర్కటః భయమైనావుండాలి, భక్తయినా ఉండాలి.
- భార్య అనుకూలవతి అయితే సుఖి అగును, లేకుంటే వేదాంతి అగును.
- మంత్రసాని పనికి ఒప్పుకున్నపుడు, బిడ్డ చచ్చినా పట్టాల, గడ్డ వచ్చినా పట్టాల.
- మనబంగారం మంచిదయితే. కంసాలి ఏమి చేయగలడు?
- మనోవ్యాధికి మందు లేదు.
- మనసుంటే మార్గముంటుంది.
- మంత్రాలకు చింతకాయలు రాలవు.
- మొక్కై వంగనిది మానై వంగుతుందా ?
- మనుష్యులు పోయినా మాటలు నిలుస్తాయి.
- మట్టిలో మాణిక్యం అన్నట్టు.
- మసిపూసి మారేడు కాయ చేసినట్టు.
- మాటకు పడి చస్తాం కాని, మూటకు పడి చస్తామా?
- మానవ సేవే మాధవ సేవ.
- మింగను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె.
- మీన మేషాలు లెక్కబెట్టినట్టు.
- ముందు వచ్చిన చెవులకంటే, వెనకవచ్చిన కొమ్ములు వాడి.
- మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు.
- మొరిగే కుక్క కరవదు.
- ముందు నుయ్యి, వెనక గొయ్యి.
- మూడు పువ్వులు ఆరు కాయలుగా.
- మాట తేటలు మా ఇంటికాడ, మాపటి తిండి మీ ఇంటికాడ.
- మాటలు కోటలు దాటును. కాలు గడప దాటదు.
- మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకపోతే, ఇసుకో అంటే, ఇసుకో అన్నదట.
- మాట్లాడే వానికి వినేవానికి అర్థం కానిదే వేదాంతం.
- మా తాతలు నేతులు తాగారోయి మా మూతులు వాసన చూడండోయి.
- మానవసేవే మాధవ సేవ.
- మా బావ వామ హస్తానికి తోడు ఛాదస్తం.
- మింగను మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అట.
- ముంజేతి కంకణానికి అద్దమెందుకు.
- ముందు గోయి, వెనుక నుయ్యి.
- మెడలో రుద్రాక్షలు, మదిలో మదిరాక్షులు.
- మొండివాడు రాజుకంటె బలవంతుడు.
- మొక్క అయి వంగనిది, మానై వంగునా?
- మొగుడు కొట్టినందుకు కాదుగాని, తొడికోడలు నవ్వినందుకు.
- మతిలేని మాట శ్రుతిలేని పాట.
- యద్భావం, తత్ భవత్.
- యదార్థవాది లోక విరోధి.
- యథారాజా తథాప్రజా.
- యోగికీ, రోగికీ, భోగికీ నిద్రలేదు.
- రమాపతే, సీతాపతే, పొద్దున లేస్తే పోట్టేగతి?
- రాజుల సొమ్ము రాళ్ళపాలు.
-
రామాయణమంతా విని రామునికి సీత ఏం కావాలని అడిగాడట.
- రూపంచేత స్త్రీలు, పరాక్రమం చేత పురుషులు రాణింతురు.
- రెంటికి చెడ్డ రేవడి వలె.
- రక్షించిన వాణ్ణి భక్షించినట్టు.
- రాజ్యం వీరభోజ్యం.
- రానురాను గుర్రం గాడిదయిందట.
- రావణాసురుడి కాష్టంలాగ.
- రెండు చేతులు కలిస్తేనే చప్పుడయ్యేది.
- రెండు పడవల్లో కాళ్ళు బెట్టినట్టు.
- రెండు వ్రేళ్ళతో నాటవచ్చును కానీ, అయిదు వ్రేళ్ళతో పీకకూడదు.
- రేపు అనే మాటకు రూపులేదు.
- రైతు బీదకాని, చేను బీదకాదు.
- రొట్టెవిరిగి నేతిలో పడ్డట్టు.
- రొయ్యకు లేదా బారెడు మీసం.
- రోగి కోరింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే.
- రౌతుకొద్దీ గుర్రం.
- రౌతు మెత్తనయితే గుర్రం మూడుకాళ్ళతో నడుస్తుంది.
- లోకులు కాకులు.
- లేడికి లేచిందే ప్రయాణం.
- లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
- లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.
- వచ్చిన పేరు చచ్చినా పోదు.
- వచ్చేటపుడు తీసుకురారు. పోయేటప్పుడు తీసుకుపోరు.
- వత్తులు చెయ్యాలంటే పత్తి కావాలి.
- వరదలు వస్తాయని వర్షాలాగవు. వసుదేవుడంతవాడు గాడిదకాళ్ళు పట్టుకొన్నాడట.
- వండుకున్నమ్మకు ఒకటే కూర, అడుక్కుతినే అమ్మకు ఆరుకూరలు.
- వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం.
- వసుదేవుడంతవాడు గాడిదకాళ్ళు పట్టుకొన్నాడట.
- విత్తు మంచిదేస్తే మొక్క మంచిది వస్తుంది.
- వచ్చిన పేరు చచ్చినా పోదు.
- వచ్చేటపుడు తీసుకురారు. పోయేటప్పుడు తీసుకుపోరు.
- వజ్రానికి సాన, బుద్ధికి చదువు.
- వాన రాకడ ప్రాణం పోకడ తెలిదు.
- వానలుంటే పంటలు, లేకుంటే మంటలూ.
- వాపు మానును గాని వాతలు మానునా.
- విగ్రహపుష్టి, వైవేద్య నష్టి.
- విత్తనంముందా? చెట్టు ముందా?
- విత్తనం కొద్దీ మొక్క.
- వెదుకపోయిన తీగ కాలికి తగిలినట్టు.
-
వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడయినట్టు.
- శంఖంలో పోస్తేకాని తీర్థం కాదన్నట్టు.
- శాపాలకు చచ్చినవాడు, దీవెనలకు బ్రతికనవాడు లేడు.
- శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
- శల్య సారధ్యం
- శుష్కప్రియాలు, శూన్య హస్తాలు.
- శుభం పలకరా మంకెన్నా అంటే, పెళ్ళికూతురు ముండ ఏదన్నాడట.
- శీలంలేని సౌందర్యం తావిలేని పువ్వు వంటిది.
- శంకులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు.
- శంఖంలో పోస్తేకాని తీర్థం కాదన్నట్లు.
- శ్వాస ఉండే వరకు ఆశ వుంటుంది.
- శ్రుతిమించి రాగాన పడినట్లు.
- సరసము విరసము కొఱకే, పెరుగుట విరుగుట కొరకే, పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే
- సర్వేజనా సుఖినోభవంతు.
- సర్వేజనా స్సుఖినోభవంతు అంటే, సర్వేవాళ్ళేనా? మా సంగతేమి? అన్నారట రెవిన్యూ వాళ్ళు.
- సూర్యునిముందు దివిటీ పట్టినట్లు.
- సంతోషం సగం బలం.
- సొమ్మొకడిది సోకొకడిది.
- స్వామికార్యం స్వకార్యం కలికివచ్చినట్టు.
- స్వాతివానకు ముత్యపుచిప్ప లాగ.
- హనుమంతుని ముందు కుప్పిగంతులా?
అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది.
అదును ఎరిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
అవ్వా కావాలి, బువ్వా కావాలి.
కృషితో నాస్తి దుర్భిక్షం.
జీలకర్రలో కర్రలేదు, నేతిబీరలో నేయిలేదు.
పనిలేని మంగలి పిల్లి తల గొరిగినాడట.
వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడయినట్టు.
Leave a Comment