ఆంధ్రము తెనుగు తెలుగు / andhramu tenugu telugu

 ఆంధ్రము, తెనుగు, తెలుగు



 తెలుగు సాహితీ విద్యార్థులు, uppsc వంటి పోటీపరీక్షలలో తరుచుగా ఎక్కువ మార్కులకు అడుగుతున్న ప్రశ్న ఆంధ్రము, తెనుగు, తెలుగు పదాలను లేదా రూపాలను విశదకరించండి?



పైన పేర్కొన్న మూడు పదాలు కూడా భాషాచరిత్ర ప్రకారం మూడు వాచకాలుగా ఇలా చెప్పడం, అనడం లేదా వాడటం జరిగింది.
అవి :

1). జాతి వాచకంగా :- అనగా జాతులను గూర్చి తెలిపేందుకు వీలుగా ఉపయోగించేవి. ఉదాహరణకు ప్రాచీన కాలంలోని మన పురాణాలు, వేదాలు మొదలగు వాటిలో ఆంధ్రము...మున్నగు పదాలు జాతిని తెలిపేలా ప్రయోగించారు.


2). దేశవాచకంగా :-  అనగా దిక్కును బట్టి రాజ్యాలను, ప్రాంతాలను పూర్వులు దేశవాచకాలుగా ఉచ్చరించేవారు. ఇలా  మనకి వాగ్మయాలలో, శాసనాలలో కనబడతాయి.

  ఉదాహరణ: ఉత్తర భారతదేశం వారిని - ఆర్యులని
                     దక్షిణ భారతదేశం వారిని - ద్రావిడులని అంటారు.

3). భాషావాచకంగా :-  అనగా అక్కడ మాట్లాడేటటువంటి లేదా రాసేటటువంటి కవుల, ప్రజల యొక్క భాషను - యాసను బట్టి ఈవిధంగా పలికేవారు.

  ఉదాహరణ: మన తెలుగుని కూడా పూర్వులు ఆంధ్రము, తెనుగు, తెలుగు అని మూడు విధాలుగా పిలిచారు.

   అలాగే మనభాషకు సంస్కృతంలో అంధ్ర, అంధ్రక అనే రూపాంతరములు వున్నాయి. అదేమాదిరి తెలుగు కావ్యాల్లో తెనుఁగు, తెనుగు, తెలుఁగు, తెలుగు, త్రిలింగ అనే పదాలు ప్రయోగంలోనున్నాయి. తమిళంలో తెలుగు భాషకు వడగు, వడుగా అనే పదాలున్నాయి.

   క్రీ. శ. 16, 17వ శతాబ్ద కాలంలో దేశపర్యటనకు వ్యాపార నిమిత్తము వచ్చిన పోర్చుగీసు వారు తెలుగు వాళ్ళని జెంతియు(Gentio)అనీ మనం మాట్లాడే తెలుగు భాషను జెంతూ(Gentoo) అని పిలిచారు!

    అది సరే మాష్టారు అసలు మొత్తమ్మీద తెలుగుని తెలిపే పదాలు ఎన్ని? అవి ఏవి? అంటే
 --> అంధ్ర, ఆంధ్ర, తెనుఁగు, తెనుగు, తెలుఁగు, తెలుగు, త్రిలింగ, వడగు, వడుగ, జెంతూ....మొదలైనవి. ఇవన్నియు ఏకార్థభోదకాలైన పదాలు...


                                                             (---సశేషం త్వరలో)

4 కామెంట్‌లు:

Blogger ఆధారితం.