ఆది కవి నన్నయ్య / nannayya telugu first poet

                  నన్నయ్య భట్టారకుడు


              తెలుగు సాహిత్యంలో ఆదికవిగా పేర్కొనబడిన వ్యక్తి నన్నయభట్టు. నన్నయ 11వ శతాబ్దానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. నన్నయ్య గారి తండ్రి పేరు భీమన భట్టు.


        నన్నయ్య బిరుదులు ఆదికవి, వాగనుశాసనుడు. నన్నయ్యగారు ఆంధ్రశబ్దచింతామణి మరియు మహాభారతం చాముండికా విలాసం, ఇంధ్రవిజయం ఎటువంటి రచనలను చేశారు. 



ఆదికవి నన్నయ కవితా రీతులు:-


1.ప్రసన్న కథా కవితార్థయుక్తి


2.అక్షర రమ్యత 


3.నానారుచిరార్ధ సూక్తి నిధిత్వం.



-->నన్నయ్యచే లిఖింపబడిన శాసనాలు:- 

నందంపూడి శాసనం, మండ శాసనం.


నన్నయ్య గారి సూక్తులు:-

 విశ్వశ్రేయ: కావ్యమ్

గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్,

వార్తయందు జగము వర్ధిల్లుతుందని అని అన్నారు.


నన్నయను గురించి ఇతరులు:

మారన తను రచించినటువంటి మార్కండేయ పురాణంలో నన్నయను ఆంధ్రకవితా గురువు అని అన్నారు.


కొలని గణపతిదేవుడు తను రచించినటువంటి శివయోగ సారంలో నన్నయను ఆంధ్ర కావ్యపదమును తెచ్చిన వాడని అన్నాడు. అదేవిధంగా తిక్కన నన్నయను కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు అని ప్రశంసించారు. రాజ రాజ భూషణుడు రచించినటువంటి ప్రబంధమనుడి వసుచరిత్రలో నన్నయను మహిమను వాగనుశాసనుడు సృజియింపన్ అని పలికాడు.


        ఋషి వంటి నన్నయ్య రెండు వాల్మీకి అని విశ్వనాథ సత్యనారాయణ గారు పలికారు. నన్నయను ప్రథమ ఆచార్యునిగా ఆచార్య తిరుమల రామచంద్ర కీర్తించారు. 


తెలుగుకి ఈనాడు ఇట్టి భావమైనా ఇట్టి రసమైనను మెప్పించు శక్తివంతమైన భాష ఉన్నది- అనగా అది నన్నయ్య పెట్టిన భిక్ష అని సి నారాయణ రెడ్డి (సినారె) గారన్నారు. 


నన్నయ మొదట తెలుగు భాషకు సంస్కృత వృత్తాలతో కూడిన " ఆంధ్రశబ్దచింతామణి " అనే పేరుతో వ్యాకరణ గ్రంథాన్ని రచించారు.


         సంస్కృతంలో వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని నన్నయ తెలుగులోకి అనువదించారు. భారతంలో మొత్తం అష్టాదశ పర్వాలు ఉన్నాయి. నన్నయ మహాభారతం లోని ఆది సభ అరణ్యపర్వ సగ భాగం వరకు అనువదించడం జరిగింది. నన్నయ భారత అనువాదాన్ని స్వేచ్ఛానువాదంతో చేశారు. అనగా స్వతంత్రతాయుక్తంగా తనంతటతానుగా అనువదించడం జరిగింది.


 నన్నయ భారతాంధ్రీకరణకు ఎంచుకున్న పద్ధతి కథాకథన పద్ధతి. తెలుగుసాహిత్యంలో కథాకథన పద్ధతికి మార్గదర్శకుడు నన్నయ్య. నన్నయ్య భారతంలో ఖాండవ వన దహన వృత్తాంతం, శకుంతలోపాఖ్యానం ఉన్నాయి.


        నన్నయ యొక్క కవితాగుణం ఉభయ వాక్ప్రౌడి అని శ్రీనాధుడు అన్నాడు. " భాషింతు నన్నయ్యభట్టు మార్గంబునుబయ వాక్ప్రౌడి నొక్కక్క మాటు "అని శ్రీనాధుడు తన కాశీఖండం కావ్యపీఠికలో చెప్పారు.


 ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని,

అధ్యాత్మ విధులు వేదాంతమనియు,

నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని 

కవి వృషభులు మహాకావ్యమనియు,

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని,

ఐతిహాసికులు ఇతిహాసమని,

పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని,

అంటూ మహాభారత వైశిష్ట్యాన్ని నన్నయ్య సీస పద్యంలో చెప్పారు.


నన్నయ్య తన కవిత్వమును మరియు కవితా రీతులను గురించి భారత కావ్యావతారికలోని ఆరంభ పద్యంలో ఇలా చెప్పారు.

 "సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకవితార్థయుక్తిలో

నారసిమేలునా నితరులక్షరరమ్యత నాదరింపినా

నారుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు దెనుంగునన్ మహా

భారత సంహితారచన బంధరుడయ్యె జగద్దితంబుగన్".


నన్నయ్య కు భారత అనువాదంలో సహకరించిన వారు నారాయణభట్టు


నన్నయ భారతంలో వచ్చే ప్రసిద్ధమైన ఉపాఖ్యానాలు :-

1. ఖాండవ వన దహన వృత్తాంతం 

2. శకుంతలోపాఖ్యానం 

3. గాంధారీ వివాహ కథ 

4. యయాతికి దేవయాని వృత్తాంతం 

5. ఉపరిచర వసు వృత్తాంతం

6. హరిశ్చంద్రోపాఖ్యానం


నన్నయ భారతం పై వచ్చిన పరిశోధనలు:-

1. ప్రసన్న కథాకలితార్థ యుక్తి - విశ్వనాథ సత్యనారాయణ

2. సారమతి నన్నయ్య - ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

3 నన్నయ భారతం - దివాకర్ల వేంకటావధాని

2 కామెంట్‌లు:

  1. నన్నయ ఆదికవి అనడానికి ఆధారాలున్నాయా? ఆయన తెలుగు ఎక్కడ చదివారు, ఎలా కవి అయ్యారు వివరాలున్నాయా?

    రిప్లయితొలగించండి

Blogger ఆధారితం.