పాల్కురికి సోమనాథుడు/ palkuriki somanathudu
---> పాల్కురికి సోమనాథుడు <---
తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగ్గ కవుల్లో సోమనాథుడు ఒకరు. ఇతను శివకవుల్లో ఒకరిగా సుప్రసిద్ధులు అయినారు. సోమనాథుని కాలం కాకతీయ రాజులనాటి 1160 నుండి 1240 వ శతాబ్దంలోని వాడిని తెలుస్తుంది. ఇతని తల్లిదండ్రులు శ్రియాదేవి మరియు విష్ణురామిదేవుడు. పాల్కురికి సోమనాథుడు వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మండలం జనగామ దగ్గర జన్మించారు.
పాల్కురికి సోమనాథుడు సంస్కృతాంధ్ర, కన్నడ భాషలలో పండితునిగా పేరొందారు. అంతేకాకుండా దేశికవితొద్యమకారునిగా, ప్రథమాంద్ర విప్లవకవిగా, ద్విపద ప్రక్రియకు, ఉదాహరణ ప్రక్రియకు ఆద్యునిగా ప్రసిద్ది పొందారు. సోమనాథుని రచనా శైలి "అల్పాక్షరములలో అనల్పార్థ రచనను చేయడం ".
అవసానదశలో తనంతటతానుగా పాల్కురికి సోమనాథుడు కర్ణాటకలోని మైసూరు రాష్ట్రం, బెంగుళూరు జిల్లా వద్ద ఉన్న కల్య క్షేత్రంలో జీవసమాధి (శివైక్యం) కావడం జరిగింది.
పాల్కురికి సోమనాథుడి కావ్యాలు -రచనలు :-
పద్య కృతులు :- అనుభవసారము, --> (తెలుగులోని తొలి నిర్వచన కావ్యం).
చెన్నమల్లుసీసములు,
వృషాధిపశతకం.
లఘు కృతులు :- బసవరగడ,
నమస్కారగద్య,
పంచప్రకార గద్య,
శరణుబసవగద్య,
బసవాష్టకం,
బసవోదాహరణము.
ద్విపద కావ్యాలు :- బసవ పురాణం,
పండితారాధ్య చరిత్ర,
మల్లమదేవి పురాణం (అలభ్యం).
సంస్కృత గ్రంథాలు :- సోమనాథ భాష్యం,
రుద్ర భాష్యం,
త్రివిధ లింగాష్టకం,
వృషభాష్టకం,
బసవోదాహరణము,
సోమనాథస్తవం.
కన్నడ గ్రంథాలు :- సద్గురు రగడ,
చెన్నబసవ రగడ,
శరణుబసవ రగడ.
--->
style="font-family: sans-serif;">"ఆరూఢ్య గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ఠ రచన మానుగా సర్వ సామాన్యంబుగామి జానుతెనుంగు విశేషము ప్రసన్నతకు’’అని సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో చెప్పాడు.
---> ‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట గూర్చెద ద్విపదలు కోర్కి దైవార’’ మని బసవ పురాణ అవతారికలో చెప్పాడు.
---> పాల్కురికిసోమనాథుడు ప్రవేశపెట్టిన "మార్గ - దేశి - జానుతెనుగు " అన్న అంశాలపై పరిశోధన చేసిన వ్యక్తి మరియు గ్రంథకర్త శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు.
Super....
రిప్లయితొలగించండి