మహా ప్రస్థానం/ maha prasthanam-srisri

  మహా ప్రస్థానం  


మరో ప్రపంచం,

మరో ప్రపంచం ,

మరో ప్రపంచం పిలిచింది!

పదండి ముందుకు,

పడండి త్రోసుకు!

పోదాం, పోదాం పైపైకి!


కదం  త్రోక్కుతూ,

పదం పాడుతూ,

హృదంతరాళం గర్జిన్తూ-

పదండి పోదాం,

వినబడలేదా

మరో ప్రపంచపు జలపాతం?


దారిపొడుగునా గుండె నెత్తురులు

తర్చణచేన్తూ  పదండి ముందుకు!

బాటలు నడచీ

 పేటలు కడచీ 

కోటలన్నిటిని దాటండి!

నదీ నదాలు ,

అడవులు, కొండలు,

ఎడారులా మన కడ్డంకి? 

పదండి ముందుకు!

పడండి (తోసుకు!

పోదాం, పోదాం , పై పైకి



ఎముకలు  క్రుళ్ళిన

వయస్సు మళ్చిన

సోమరులారా! చావండి!

నెత్తురు మండే,

శక్తులు నిండే

సైనికులారా! రారండి!

"హారోం! హరోం హార!

హర!హర!హర!హర!

హరోం హరా!" అని కదలండి!



మరో ప్రపంచం,

మహా ప్రపంచం 

ధరిత్రి నిండా నిండింది!

పదండి ముందుకు!

పడండి  త్రోసుకు!

ప్రభంజనంవలె హోరెత్తండీ!

భావ వేగమున ప్రసరించండీ!

వర్షుకాభ్రముల వ్రళయభఘోషవలె

 పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!

 పదండి,

 పదండి,

పదండి ముందుకు!

కనబడ లేదా మరో ప్రపంచపు 

కణకణమండే  త్రేతాగ్ని?


ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి

ఎనభై లక్షల మేరువులు!

తిరిగి, తిరిగి, తిరిగి  సముద్రాల్‌

జలప్రళయ నాట్యం చేస్తున్నవి!

సలసల క్రాగే చమురా? కాదిది,

ఉష్ణరక్త కాసారం! 

శివసముద్రమూ,

నయాగరావలె

ఉరకండీ! ఉరకండీ ముందుకు!

పదండి ముందుకు!

పడండి  త్రోసుకు!


మరో ప్రపంచపు  కంచు నగారా

విరామ మెరుగక (మోగింది!

త్రాచులవలెనూ,    

రేచులవలెనూ,

ధనంజయునిలా సాగండి!

కనబడలేదా మరో వ్రవంచవు

అగ్ని కిరీటవు ధగధగలు,

ఎర్రబావుటా నిగనిగలు,

హోమజ్వాలల భుగభుగలు? 



కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.