మరో మూడు యాభైలు/ maro mudu yabhailu


మరో మూడు యాభయిలు


 

మరో మూడు యాభయిలు 

గురించి ఒకటి రెండు మాటలు :



విప్లవ సాహిత్యం విజృంభిస్తున్న ఈ రోజుల్లో, ఎప్పుడో రాపిన ఈ  విమాషక సాహిత్యాన్ని పత్రికల్లోనే నిద్ర పోనియ్యకుండా ప్పస్తక రూపంలో తీసుకురావడం అనేది ఎంతవరకు  ఔచిత్యంతో కూడిన చర్య అని జిజ్ఞాసువులైన పాఠకుల్లో చికిత్స జనించవచ్చును, అందుకు సమాధానముగా ఈ ఒకటి రెండు ముక్కలూ ఇక్కడ చెబుతున్నాను.


మొదటి సంగతి, ఎప్పుడో రాసిన రచనలతోబాటు ఈ సంపుటిలో.కొన్ని కొ త్తవికూడా (అవి చాలా కొద్దిపాటి వే ఆయినా) ఉన్నాయి, సిరిసిరి మువ్వ, ప్రాసక్రీడలు, లిమబుక్కులు = వీటన్నిటిలోనూ, ఒక్కొక్క దానిలో  50 కన్నా ఎక్కువగానే. రచనలు ఉండటం గమనార్హ మనుకొంటాను. 48 పుటల నోటుబుక్కు, ఆఅని పేరుచెప్పి అట్టల సంఖ్య కూడా కలిపి కీట్టింపు లెక్కలతో వ్యాపారులు ఒక విధంగా విద్యార్థులను మోసం చేసే ఈ కాలంలో 50 గేయాలని చెప్పి అంతకంటె ఎక్కువ సంఖ్యను ఇవ్వడం పాఠకులకు హర్షదాయకం కాగల దనుకుంటాను. 


ఇంగ్లీషులో Baker's dozen అంటే 13 అనే అర్థం ఉంది. అలాగే, నా చిన్న తనంలో  బహుశా  ఇప్పుడు కూడా, పాతిక మామిడికాయలులు అంటే 28 అర్థం పెట్టి బడిదారీ విధానపు చివరిదళలో జీవిస్తున్న మనం, కనీనం
ఈ అవసానదళలో నయిా ఆ విధానపు మంచిగుణాన్ని కొనుగోలుదారుకు సంతృప్తి, నంతోషమూ కలిగించడాన్ని  అందిపుచ్చుకోవడం. బాగుంటుందనుకొంటున్నాను. 60 కన్న ఎక్కువగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కొన్ని కొత్త రచనలను చేర్చడ మైనవి. త్వరలోనే వీటన్నిటినీ కలిపి ఒకే సంప్ప

టంగా “మూడు శతకాలు” అనే పేరుతో ప్రకటించాలనీ, అందుకు ముందుచర్యగా ఈ “మరో మూడు యాభయిలు”' గ్రంథస్థం చెయ్యడం జరిగిందనీ పాఠకులకు మనవి చేస్తున్నాను. ఇది “విదూషక సాహిత్యం"” అని మొదళే ఉగ్గడిందాను. అయితే కేవలం నవ్వించడానికి మాత్రమే వీటివి రాయలేదు నేను. వ్యతికా ప్రపంచంలో కార్టూనులు విర్వహించే విధిని ఈ కవిత్వంద్వారా. నేను సాధించ దలచుకున్నాను. అందుకే కొందరు. దీన్ని “కార్టూను కవిత్వం” అవి పేర్కొానడం జరిగింది. “బూతాడక దొరకు నవ్వు పుట్టదు” అని నవ్వించ డముతోనే తన వని తీరిపోయిం దనుకున్నాడు ఆనాడు కవిచౌడప్ప. కొనినా ఆదర్శం వేమన: ఆతని కవిత్వంలో కూడా హాస్యం ఉంది. దానితోబాటు
'పెకైర్‌, సీత, ఉవదేశం ఇవన్నీ ఉన్నాయి. Rabelais, Rousseau, Voltaire మొదలగువారి నిశితహస్య రచనలే ఫ్రెంచి  విష్లవానికి ప్రేరకశక్తులుగా పవిచేశాయన్న నిజాన్ని మనం మరచిపోకూడదు. “కన్యాకుల్క”నాటకాన్నీ ఒక ఫార్పుగా భమపదేవారు ఈనాటికీ ఉన్నారు. కాని అందులో పైకి కవివించే హస్యదనం వెనుక తన సమకాలీన నమాజాన్ని దుయ్యబిట్దినవీఠత్పరసాన్నే గురజాడ కవి ప్రదర్శించాడు, నా గురు ప్రముఖులలో గురజాడ తెలును.

విప్లవాలు విజయనంత మవుతున్న నేటి యుగంలో, ఒకప్పుడు కవితా స్నామాజ్యాన్ని పరిపాలించిన కరుణాళ్ళంగారరసాలు అడుగున పడిపోవడమూ, అడుగున పడిపోయినవారి ఆశలకూ, ఆవేశాలహ సంకేతప్రాయంగా వీర, బీభత్సరసాలు విజృంభించడమూ. ఇదీ నేటి సాహిత్య వాస్తవికత. ఒక “ sense of humour ” అనే తల్లిపేరు జీవిత మృ త్హికనుంచి వ్వైతన్య పోషకమైన పదార్థాలను అనుక్షణమూ ఈ కవిత్వానికి అందిస్తూ ఉంటూంది. ఈ విషయం తెలుసుకోకుండా ఊరికే నవ్వేసి ఊరుకునే వాస్తవికత అఖరకి తామే నవ్వులపాలయి పోతారు. 

                                                                                                                                                    --శ్రీ శ్రీ 


“ఎవడు ఐతికేడు
మూడు యాభయిలు”- --ఒక సామెత.




సిరిసిరి మువ్వ

క్రువిమర్శా మృణ్మయ ని
ర్ధవ మస్తష్కులు గ్రహంప జాలుదురా, మత్‌
ఛవిమ్‌త్‌ పవివత్‌ కవితా
కివిలోకన తిక్షధార? సిరి సిరి మువ్వా!
మాల చాందస కవి నస

 

జ్వాలా జాల్యాగ్ర సంవసత్‌ సస్టీతా
లాలాపించే కవితా
శ్రీలోలుడు నహి నహీతి సిరి సిరి మువ్వా!
నీ నినీకులలొ గల
వ్యత్యాసం తెలిసిసట్టి (వా డెవ్వడు? నా
కత్యవసర మొకకే
చితర్ణం వర్తనము నే సిరి సిరి మువ్వా!

 

 

సంపాదకు డంకే నా
కింపారెడు భక్తి గలదు, ఎంచే తసగా,
సంపూర్ణ మనుజుడాతడు
చింపారిజీ కన్న నయము సిరి నిరి మువ్వా!

బేషరతు బ్రతుకు కోసం
ఇాషల్లైడు నూమకాత్మ చుట్టూ ఏవో
ఘోషలతో నియమా లా
శ్లేషిస్తే ఏది దారి? సిరి సిరి మువ్వా!



నాకూ ఈ లోకానికి
తూకం సరికుదర లేదు తొలినుంచ్చీ అ
బ్బే! కప్పల తక్కెడ వలె
చీకట్లో చిందులాట సిరి సిరి మువ్వా!


ముందుకు పోతానంటే
ఎందుకు నీ విరగబాటు ఇటనే నిలుచో
మందురు వెనక్కి పోవల
సించని శాసింత్రు కూడ సిరి సిరి ముద్వా!



గడియారం వెనుకకు త్రి
'ప్పెడు వారే నేడు మనకు పెత్తనదారుల్‌
నడికడలిని పడవను ముం
చెడు నావికు లిట్టివారె సిరి సిరి మువ్వా!


స్వాతంత్ర్యం, సామ్యం, ను
భ్రాతృత్వము లనుచు చిలుక పలుకుల తోడన్‌
నూతన నిగళ నిబంధన
చేతస్కులు వెలసినారు సిరి సిరి మువ్వా!


ఇంతెందుకు వింతల్లో
వింతైన విశేష మొకటి వినిపిస్తున్నా!
సొంతంగా సాంతంగా
చింతిస్తే పెద్దతప్పు సిరి సిరి మువ్వా!


తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొసుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెల వింక డెమోక్రసీకి సిరి సిరి మువ్వా!

 

గొర్రెల మందగ, వేలం
వెర్రిగ ఉద్రిక్త భావ వివశులయి జనుల్‌
 కిర్రై క్కి పోయినప్పుడు
చి ర్రేత్తుకు వచ్చురెత్తుకు వచ్చు నాకు సిరి సిరి మువ్వా!


ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్‌
కారాలు,  తెగ బుకాయి
స్తే రాజ్యా లేలవచ్చు సిరి సిరి మువ్వా!

యుద్ధం పోతేనేం? వా
గ్యుద్రాలూ కాగితాల యుద్రాలూ లో
కోద్రరణ పేర మళ్ళీ
సిద్ధమురా కుందవరపు సిరి సిరి మువ్వా!


వ్యవహారాంధ్రం జీవ
త్ర్పవాహా మది వదలిపెట్టి పాతదయిన, స్థా
ణువయిన గ్రాంథిక భాషను
చెవి నెవ్వడు పెట్టు నేడు? సిరి సరి మువ్వా!



జగణంతో జగడం కో
రగా దగదు కాన్మి దాని ఠస్సా  గొయ్యా!
నగలాగ వెలుగును గదా
చిగిర్చితే నాలుగింట సరి సిరి మువ్వా!


 
కందం తిక్కన గారిది;
కుందవరపువారి ముద్దు కుర్రని దంతే!
అందరి తరమా కందపు
చిందుల కిటుకుల్‌ గ్రహింప, సిరి సిరి మువ్వా!


భాష  కొక స్ధాయి నిచ్చే
ప్రాసలు యతు లలంకృతులు వ్యాకృతు లయ్యో
పై సొగసు పూతకైతే
చేసే దేమున్న దింక? సిరి సిరి మువ్వా!


వ్యాకరణం తో కుచ్చుకు
కాకవు లూరేగుతారు కానీ సుకవుల్‌
వ్యాకృతి ఆకృతి మార్చే
సే కావ్యా లల్లగలరు సిరి సిరి మువ్వా!



తేనెకు సీసా, బంగరు
పళ్ళెమునకు గోడ చేర్పు కావాలి సరే!
మధు కనక ప్రాముఖ్యం
సీసా గోడలకు లేదు సిరి సిరి మువ్వా!


వాగ్వాదము ఖేద మగున్‌,
భాగ్వత మనరాదు భాగవత మనవలయున్‌
దిగ్వాసుడు శంకరుడే!
ఋగ్వేదము బొమ్మరిల్టు ఋషితతికి సిరీ!

Gold వ్యామోహం చెడ్డది,
Mild వ్యాయామం శరీర మాద్యం ఖలుడా!
Child వ్యాపారం కూడదు,
Old వ్యూలను హోల్డ్ చేయకోయి సిరి సిరీ!


సింహాలకు Zoo లుండును,
సంహారమె సృష్టియగునును సామాన్యముగా,
అంహస్సె యౌను పుణ్యము,
Somehow మన కవన మిట్లె స్రవియించుచు సిరీ!

 
మీసాలకు రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే!
సీసా లేబిల్‌ మార్చే
స్తే సారా బ్రాంది యగునె? సిరి సిరి మువ్వా!

“'ర”మ్మని ఆహ్వానిస్తే
పామ్మనడం పాడికాదు పూవిల్తుని రా
జ్యమ్మునకున్‌, మధుశాలకు--
చెమ్మ సుమీ రెండు చోట్ల సిరి సిరి మువ్వా!

అంతా సురా ఘటేశులె,
అంతింతో అచమాన మడిగే వారే!
పంతానికి మాత్రం శివ 
చింతా దీక్షితుల మండ్రు సిరి సిరి మువ్వా!

ఉగ్గేల  త్రాగుబోతుకు?
ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణశాస్త్రకి?
సిగ్గేలా భావకవికి? సిరి సిరి మువ్వా!

మాస్కోకు వెళ్ళగలిగే
ఆస్కారం లేకపోయి నప్పటికైనన్‌,
విస్కీ సేవిస్తూనే
శ్రీస్కీనై  బతక గలను సిరి సిరి మువ్వా!

నేనూ ఒక మూర్ఖున్నే 
ఐనా నాకన్న మూర్ఖు లగపడుతుంటే
ఆసంద పారవశ్యము
చె నవ్వక తప్పలేదు సిరి సిరి మువ్వా!

పెద్ద చెరువు దోమలలో
పెద్ద దయిన దిబ్బశర్మ  పేరింటిది తా
మొద్దబ్బాయి చరిత ర
చిద్దామని సిద్దపడదె సిరి సిరి మువ్వా!

హాస్య రచనలో నొక్క      
రహస్యం కలదనగ వచ్చు నది యేదన్నన్‌
వేశ్యా మాతల సన్నిధి
శిష్యరికం అరు నెలలు సిరి సిరి మువ్వా!


'పెదబాల శిక్ష చదివీ
చదవడమే తడవుగాగ సాహిత్య విశా
రదు లయినట్టుగ భావిం
 చెదరుగదా కొంతమంది సిరి సిరి మువ్వా!

మేం గొప్పవాళ్ళ మంటూ
సంగీతం తీయునట్టి చవటల నెల్లన్ 
బంగీ కట్టి పయోరా
శిం గూలగ ద్రోయవలదె సిరి సిరి మువ్వా!

ఎన్నికలకు నిలుచుంటే
తన్నెదిరించిన సమస్త తదితరుల పయిన్‌
మన్నెత్తి పోయు వీరుని
చెన్నెవ్వడు పాగడ గలడు? సిరి సిరి మువ్వా!

ఏ యెండకు సరిపోయే.
ఆయా గొడుగుల ధరించు నాతని (బ్రతుకే
హేయ మటువంటి మానిసి
చేయడు తుది చిల్లిగవ్వ సిరి సిరి మువ్వా!

తా దెచ్చిన కుందేటికి
పాదమ్ములు మూడె యనుచు పైగా తన దు
ర్వాదానికి  స్టాంపు గల      
రసీ  దిస్తా నను నొకండు సిరి సిరి మువ్వా!

పనిలేని యట్రి మంగలి
మునుకొని మాన్చాల శీర్షమును గొరిగెడు తి
రున రాస్తా నేదొ, రా
సీన దానికి కోప మేల? సిరి సిరి మువ్వా!


"దెయ్యాలను చూపిస్తా
నయ్యా ర” మ్మనుచు నొక్క ఆసామీ నా
కయ్యో, తన కూతుళ్ళను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరి సిరి మువ్వా!

వినుమానముగ ఖర క్షీ
ర సాగర గరంగరం తరంగాంతర దీ
ర్హ నుషుప్తిలోంచి మేల్కాం
చి సలాం క్రావించె నొకడు సిరి సిరి మువ్వా!

బంగాళాఖాతంలో
సంగీతం పారవైచి సాయంకాలం
కాంగానే ఆకాశపు
చెంగావిని త్రాగె నొకడు సిరి సిరి మువ్వా!

కప్పలను తెచ్చి ఒకరా
చ్చిప్పం బడవైచి కండ చీమలతో కా
రప్పిండి జల్లి తింటే .
చిప్పిల్లునె కవన. ధార? నిరి సిరి మువ్వా!

బీడీలు కాల్బుకుంటూ
గాడిదలను తోలుకుంటు, కసరత్‌ చేస్తూ
పాడుకొను నెవడు వాడే
జీడికి రా జగును నేడు సిరి సిరి ము;


ఇటువంటి పద్యములు నే
ఘటికా శతముల్‌ రచించగల నైతేనేం?
కుటిల మతులైన కొంవరు
చిటిలింతురు కనుల బొమల సిరి సిరి మువ్వా!

అదిరా అసలు రహస్యం
చదవేస్తే ఉన్న తెలివి బారిన రీతిన్‌
పదవీ స్వీకారంతో
మది చెదిరెను భారతీయ మంత్రులకు సిరి సిరి మువ్వా!

వెళ్ళిరి దొర లనుకుంటే
కోళ్ళు తినే వాళ్ళ బదులు గ్గొరెల్ని తినే
వాళ్ళొచ్చినట్లు కాంగ్రెస్ 
కుళ్ళాయిల వాళ్ళవల్ల ఘోరాలు సిరి సిరి మువ్వా!

'దోచేసే వాళ్ళను ఏ
దో చేస్తుందనీ శివాశతో చూస్తుంకే
దోచేస్తోంది కదా, కం
చే చేనును మేసినట్టు లీ ప్రభుత సిరి సిరి మువ్వా!

దేశంకోసం త్యాగం
చెశా మని చెప్పి పదవి చేపడగానే
చూశారా! మన కాంగ్రెస్‌
చేసిన పని సిగ్గుచేటు సిరి సిరి మువ్వా!

నిజమైన శత్రువులతోతో
భుజం కలిపి ప్రజల బాధ పొడిగించే, స్వీ
యజనుల హింసించే ఫా
సిజపున్‌ ధోరణి వహించె సిరి సిరి మువ్వా!

దేన్నైతే పూర్వం కా
దన్నామో, రాక్షసత్వ మని యెంచామో,
దాన్నే ఆరాధిస్తే
చిన్నతనం వేరె కలదె? సిరి సిరి మువ్వా!

మన కాంగ్రెనని యసెంబ్లీ
కనుపగ నీది వున్న స్వేచ్చ నవరోధించెన్‌
మనను నపుంసక మని పం
చిన దయితన్‌ దవిలినట్లు సిరి సిరి మువ్వా!

దేవుడి పేరిట ఏవే
వో వెధవపనుల్‌ పానర్చు టున్నదె కద, హిం
సావాదం గాంధీజీ
'సేవకులే చేయలేదె! సిరి సిరి మువ్వా!

చీకటి బజారులో (వే
ళా కోళం కాదు) లక్షల కొలందిగ మ
స్కా కొట్టిన వాళ్ళంతా
శ్రీ శాంగ్రెస్‌ వాడనీ లౌర! సిరి సిరి మువ్వా!

గౌనూ బనాయిస్తే దొర
సానిగ గడసాని మార జాలునె? ఖాదీ
తానులు సైతాను ధరి
స్తే నాయకు డెట్టు లవును? సిరి సిరి మువ్వా!


ఎన్నా ళ్ళీ దార్మిద్యం?
ఎన్నా ళ్ళీ  అస్వతంత్ర హీన స్థితి? ఇం
కెన్నా ళ్ళీ వైఫల్యం?
చెన్న నగర రాజ్యమందు సిరి సరి మువ్వా!

కోయకుమీ్‌ సొరకాయలు
'వ్రాయకుమీ నవల లని అవాకు చెవాకుల్‌
వైఫల్యం అరవ ఫిలిం
చేయకుమీ చేబదుళ్ళు సిరి సరి మువ్వా!

ఊళ్ళొ తిరిగే కుక్కలు
మళ్ళీ కనబడని యెడల మన కేం పోయెన్‌?
జిల్లా కలెక్టరున క
రీ ల్లిఖయించిన పనేమి? సిరి సరి మువ్వా!

జెండా ధరించి కేకల
ఖండంగావేసి వేసి ఖైదుకు పోతే
పండువలె జాజిపూవుల
చెండువలెన్‌ పడునె స్వేచ్చ? సిరి సిరి మువ్వా!

బారెట్లా ఆయితే సాం
బా రెట్లా చెయ్యగలడు? భార్య యెదుట తా
నో రెట్లా మెదలించును?
చీ రెట్లా బేరమాడు? సిరి సిరి మువ్వా!

రామాయణాలనే మ
ల్లి మళ్లీ దెచ్చి ముచ్చిలించే కన్నా
అ మోస్తరు రచనల్లో
క్షేమంగద రామకోటి సిరి సిరి మువ్వా!

ఈ కావ్యం దట్టమగు పా
గాకు పొగల నట్టనడుమ కాంచెను జన్మన్‌
లోకంలో సహృదయులే
చేకుందురు గోక దీని సిరి సిరి మువ్వా!

ఈ శతకం యెవరైనా
చూసి చదివి, వ్రాస్కి పాడి సాగసిన సిగరెట్‌
వాసనలకు కొద.వుండదు
శ్రీశు కరుణ బలిమి వలన సిరి సిరి మువ్వా!



            ప్రాస క్రీడలు 



వాదానికి వాద ముంది
బాణానికి బాణం
స్నేహానికి రాగ ముంది
గానానికి ప్రాణం

వాదా న్నెదిరించలేని
వాడే తిడతాడు
వాదబలం మూలధనం
అదే వాడి కురతాడు

నేల మునగ చెక్రుక్కగ
నిచ్చెన వేస్తా దటగా
పెర్మనెంటు వామనుడికి
(తివిక్రమత వే రొకటా?

ధన స్వామ్య సంన్కృతికే
దన్నుగ నిలిచాడు
దంద్ర దేశంకోసం
తన్నుక చచ్చాడు

దేశభక్తి వాడికి ము
త్తాతగాడి సొత్తు
నిజమాడే వాడేమూ
పరదేశపు తొత్తు

బడబడ బెకబెక లాడే
నూతిలోని కప్పకు
చైనా దార్శనికత ఇక
బోధపడే దెప్పుడు?

సినిమా ఎంగిలి మెతుకులు
సద్ధాన్నం చేసుకొని
దిగంబరుల ఊ సెత్తడు
తెలివిగ నో ర్మూనుకొని

ప్రాడ్యూనరు కాలి బూటు
ష్యడస మిష్టాన్నం
తా రారాధన మె
తప్పనిసరి భష్టాధ్వం


ఐడియాల దారిద్యం
అయ్యయ్యో అనర్హం
ఇమ్మందే వో నాళ్లు చోట్ల
అమ్మాలని (వ్రేయత్నవ్‌

విదూషకుడి వివ్లవాన్ని
సవాల్‌ చేయు రెడ్డి
రవిలే వోల్లేర్‌ రాతల
చదపలేన జడ్జి

ఉక్కెన్సును చదివాడా?
చాప్లిన్‌నే మరిచాడా?
అందాకా ఎందుకు మన
గురజాడను విడిచాడా?

తిరుపతి వెంకట నుకవుల
తిట్టు కవిత ఫలితంగా
మూగనోళ్ళు మారలేదొ
కవితా సంకీలితంగా?

లోని కుళ్టు పైకొస్తే
ఆద్‌ మంచిది వంటికి
మానసాల కల్మషాల
కెథార్సిస్సు వంటిది

సమకాలిక జీవితమే
సత్మవితా వస్తువు
అన్ఫషీ, కుకవీ చచ్చిన
వంక పడి చన్తురు

నవరసాల నాయకున్ని
యుధం
ఈ శతాభ్రి నేలుతుంది
బీభత్స రసాయనం

 

రాతలు శ్రోతల్లో
పుట్టించాయంట రోత 
అయితే నా ఉద్దేశం 
నెరవేరిం దన్నమాట

బీభత్సం రసరాట్టు
దాని స్టాయి జుగుప్స
అజీన్ధాని కౌొషధ మది
అనవసరం విచికిత్స

అసహ్యాన్ని పుట్టించడ

కరుణరసం, శృంగారం
వాడిన పూరేకులు
వీరరసం, టభత్సం
ఈ నాటి తుపాకులు

అనాడూ ఈనాడూ
హాస్యానికి విలువ కద్దు
సాహిత్య సభాంగణాన
వ్యంగ్యానిది మొదటిపద్దు

శాంత్యహింసలను జపించి
చవటలుగా మారినాం
పోరాటం చేతకాని
బోకుల మైపోయినాం

ఆలోచన మీద నిఘా
వేస్తున్న లఫంగులు
పోలీనుల కొత్తపేరు
పుస్తకాల దొంగలు
 

విస్సిగాన్ని నమ్ముకున్న 
వెరీ వెంగెళప్పలు
సాహిత్యం మీద చెయ్యి
వేస్తున్నా రిప్పుడు


క్రైమ్ , సెక్సు పుస్తకాలు 
కమ్మనైన భోజనం
జాతిని మేల్కొలుపు యుంరు
విష్ణవ నీరాజనం

పరుపు కింద బూతు బుక్కు
గది గోడలు గలీజు
నడి తరగతి నాగరికత
న్వవంచనల రివాజు

పరమానందయ్యగారి
శిష్యుల్లో ఒకడు
(బ్రహ్మానందయ్యగారి
టులమధ్య శగటు

కనిపించని మాధవువ్న
కాన్మలతో కొలుస్తాడు
కనిపించే మానవుల్ని
క్రాలరాయ దలుస్తాడు

 
ఈ పదపులు, ఈ బ్రదుకులు
శాశ్వతమని (భ్రమించినా
ఎరుపెక్కిన తూర్పుదిక్కు
అపరాధుల క్రమించునా

కమ్మని కలలే కంటూ
చల్లగ నిద్రిస్తున్నా
నిద్రాభంగం చేసే
దోమల మర్దిస్తున్నా

నిదురలేచి స్యషప్పాలను
మలుస్తాను కావ్యంగా
మనుషులార రారండని
పలుస్తాను శ్రావ్యంగా

ఫిల్ట్లు జల్లి మశకాలను
ప్రజలే చంపేస్తారు
నా కలలే వాస్త్రవమై
నాకం చవి చూస్తారు

అంతస్సుల రహస్యాలు
తెలుసు'నాకు బాగా
ఛండస్సులు తోకముడిచి
చేయు నాకు జాగా

అంతస్తుల చదునుచేసి
అధికారుల పనిపడతా
సంత్రస్తుల కభయమిచ్చి
సంకెళ్ళను విడగొడతా

పాతబడ్డ పురాణాలు
పఠనీయ గ్రంథాలు
అందుకనె విద్యార్థులు
అశాస్త్రీయ దివాంధాలు

భట్రాజుగ చట్రాతిగ
'పేరు గొన్నవాడు
పారితోషికాలు లాగి
బలే బలుస్తాడు

ఆక్థనెన్సు పరిఫాలన
ఆర్డినరీ 'రుటిను
దివాలా దివాణానికి
గవర్షరే అమీను

కాంగ్రెసు కింకా యెందుకు
కాయకల్ప చికిత్స?
దాని పేరు చెబితేనే
మేరలేని జుగుప్ప

'ప్రజల కెవరు
మేలు చేయ వలంతులు
వారలకే అధికారం
వారలే జయింతురు

లాటిలకు లోటుండదు.
బైళ్లలో చోటుండదు
రాబోయే ఎన్నికలో
రౌడీలకు వోటుండదు.

పోలీసుల రాజ్య మిది
పోలిం గొక బూటకం
ఫాసిజమై మారుతోంది
ప్రజాస్వామ్య నాటకం

కరువు కాటకాల మధ్య
పెరిగె ప్రజల ఆర్తి
గాలి వానతోనే ఇక
కథకు పరిసమాప్తి

క్రయ విక్రయ సమాజ మిది
లాభలబ్ధి లక్ష్యం
విజ్బంభించు విప్లవాలె
ప్రజను చేర్చు గమ్యం 

క్రమబద్ధం కానట్లే 
కనిపించే చరిత
పరిణమించి ధరిస్తుంది  
జనన విప్లవ పాత్ర

ఉద్యమాలు పొందవచ్చు
తాత్కాలిక పరాజయం
ఆఖరి సంగ్రామంలో
అరుణారుణ మహోదయం

పాతకి వేస్తారు జనం
పది నిలువుల పాతర
భావికి చేస్తారు జనం
భవ్యమైన జాతర

విప్లవ ప్రతీఘాతక
విభ్రమాల చేత
గుడ్డికన్ను చదవలేదు
గోడమీది వ్రాత

విలసిల్లుత వెలుగు జల్లి
తెలుగు తల్లి ప్రాంగణం
సమగ్రాంధ్ర వసుంధరకు
జయ జయ జయ మంగళం!

ఈ దినాలు సుదినాలా,
చేదు చేదు దినాలా?
మాధుర్యం, సౌందర్యం
లేదు లేద ననాలా?

మైసా వలలో చిక్కిన
మన దేశపు స్మగ్లర్సు
మాఫియాకు దారి చూపు
మహ డేంజరు సిగ్నల్సు !

దొంగనోట్లు సంపదలో
దోపిడి సర్దారు
పోటి సర్కారు పెట్టి
లూటీ చేస్తాడు!

ప్రజల గోడు మరచిపోవు
ప్రభుల నెవరు మెచ్చ రిక!
పదవి వదలలేని వాళ్ళ
కిది కడసరి హెచ్చరిక!


లిమఋక్కులు


నేను___
ముసలివాన్ని 
కాను, అసలు వాన్ని!
పడగె త్తిన తాచుపాము .బుసలవాణ్న!
పీడితుల్ని వెంటేసుకు మసలు వాణ్నే!
అందుకున్న ఆకాశపు కొసలవాన్ని! 

ఔను
నిజంగా నేను
ప్రజల కవినేను
ఎంచేతంటేను
వాళ్ళని చదివేను
చదివిందే రాసేను.

రంగు (1)
ఎరుపు
ద్రోహుల గుండెల్లో కురుపు
ఆరావానికి ఆటవిడుపు
పోరాటానికి పిలుపు
'దానిదే గెలుపు

రంగు (2)
నల్ల దొరలు
దుష్పరిపాలన ధురంధరులు
పెంచుతున్నారు ధరలు
నించుతున్నారు చెరలు
దించుతున్నారు చీకటి తెరలు

రంగు (3)
తెల్ల కమ్యూనిస్టులు 
రక్తపాతాని కనిష్టులు 
విప్లవానికి బహిఘైలు
ఇంది రారాధనలో శ్రేఘ్రలు
నవభారత థార్తరాష్ట్ర లీ రివిజనిస్టులు

“రంగు (4)
ఆకుపచ్చ విప్లవం
ఆహార సమృష్దికి విత్తనం
అయినా అలగాజనానికి విక్లబం
అది చేసే అన్యాయాల విక్రయం 
ఆపండని నా విన్నపం!

హాళ్ళీసకం

వారే గుళ్ళీ
బిగించి కారాకిళ్ళి
ఇలా వచ్చావేం కాళ్ళి
డ్చుకుంటూ మళ్ళీ?"
ఇక్కడేముంది, సున్నకి సున్నా-హళ్ళీక హళ్ళీ!

పరిమిత వాదులు

నిన్నటి కమ్యూనిస్టులు
నేటి మర్యాదస్తులు
ఉదారవాదులు, సంపన్న గృహస్థులు
వ్యాపారైక  దృష్టులు
తపోభ్రష్టులు!

 క్ష్వేళ

నమ్మెల వేళ
కవి సమ్మళ
నా లేల? ఓరోరి కూళ
వినరా దిగంతరాళ
కరాళ దిగంబరగ్రీవ మేళ!

సినీసిజం

ఫిలిం ప్రపంచం ఫిల్తీ
ఆందులో దంతా కల్తీ
ఎలాగైనా లాభాల్తీ
'సేందుకే సిద్దం అందులో ప్రతీ శాల్తీ
దాన్ని జాతీయం చేయక పోవడం గల్తీ 

ఆక్సిజనులు

దిగంబర కవులు
ముళ్ళగులాబీ పువులు
ఆగ్రహ భార్గవులు
ప్రభువుల శిరసులపై పరశుపులు
పగపట్టిన చక్షుశ్శవులు!

ఏం లా%భం?

పెరిగితే వ్యాపార దృష్టి
మరిగితే లాభాల వృష్టి
దొరికితే అమెరికా ముష్టి
మిగిలేది వ్యిగహవుప్టి,
నైవేద్య నప్టి

స్వాహాకార్లు
పిల్లికి బిచ్చం పెట్టని సాహుకారు 
కుదరని మతపిచ్చి  పట్టిని స్వాములారు
పెద్ద పెద్ద మాటల వెనుక దాగుతారు
డబ్బుతో రౌడీలను సాకుతారు
ఆంచేత క్రామేడ్స్‌! పారాహుషారు

ఆరోగ్య స్నానం

'విచిత్రమైన వియత్నమైజేషన్ 
అసహ్యమైన సిఫిలిజేషన్ 
అసభ్యమైన సెగ్జామినేషన్ 
అనుచితమైన కంటామినేషన్
అవనరం డీ-అమెరికనైజేషన్‌

హుష్ 
స్పేస్
సుభాస్
చంద్రబోస్ 
లా, సెబాష్
అంతా కామోష్ 

సమాజ శస్త్రవైద్యులు

విచిత్ర వీరులు నక్స్‌లైట్లు
అన్యాయాలకి డైనమైట్లు
అంధకారంలో టార్చిలైట్లు
నవయువ జీవన కాస్మోనాట్లు
వాళ్ళంటే హడిలిపోతారు నిక్సనైట్లు


పత్రికా స్వాతంత్ర్యం 

ఎడిట రయ్యవార్లంగారు
నీరస గంగాధరం గారు
వచ్చి వెలక్కాయ మింగారు
దిగంబరు లంటే కంగారు
ఇ త్తడే వారికి బంగారు

మందులకు మందులు

కందకు
లేని దురద బచ్చలి కెందుకు?
అయినా వాదించేందుకు
నా ముందుకు
వస్తే ఇస్తా కాస్త మందుకు

అది వాళ్ళ తద్దినం

అప్పుల వాళ్ళ బాధ ఉందే
తస్సాదయ్యా
(సందేహం లేదు ) చాలా ఇబ్బందే!
ఆయినా చెబుతున్నా ముందే,
బాధ వాళ్ళదైతే సుఖం మందే!

1963లో
పిడుక్కీ బియ్యానికి ఒకే
మంత్రం పఠించేడానికే
తయారయింది చీనా -- అందుకే
నిజం చెప్పిందికే
వెళ్ళింది సిరిమావో బండార నాయకే


1970: లంకా జనా స్సుఖినోభవన్తు
సింహళ దేశపు వోటర్లు
సిరిమావో వెనరేటర్లు
విప్లవానికి థర్మామీటర్లు
విద్యుచ్చక్తి జెనరేటర్లు
వాళ్ళే అమెరికాకి వాటర్లూ!

వివాదాంధ్ర 
దిక్కులేని దివాళాయధ్ర
పెంటమీద పిశాచాంధ్ర 
కృత్తపుచ్చ సృగాలాంధ్ర
మ త్తత్త మసాలాంధ్ర 
వెర్రెత్తిన విషాదాంధ్ర

సినీ మాయ 
నీతి నిమా
ల్లేని సినిమా 
ముందు ప్రణామా
లెందుకురా? అది మనీ మా
ర్కెట్‌ ఎనీమా

క్రిమినల్లులు

క్రిమినల్‌ సెక్స్‌ క్రిములు
పురజనుల ఎముకలు నములు
అవి నిండిన పత్రికలే యములు,
వాటిని (ప్రచురించే నరాధములు
ఆ క్రిములతోనే సములు

దూ  దూ దూ దూ దూ

ఎల్ల వేళల నిజం చెప్పరా...దూ
తల్లిదండ్రుల మాట వినరా...దూ
ఎదుటివాడి మేలు కోరరా...దూ
ఎంచి ఎంచి మంచి పెంచరా...దూ
మంచివారి పంచ చేరరా...దూ

సలహా
అబ్బబ్బా - బలే జోరుగా
అన్నన్నా = బలాదూరుగా
అమ్మమ్మా - ఇదే తీరుగా
'అర్మర్రే = మరీ హోరుగా
అయ్యయో్య్యో = తిరగకురా సవా సేరుగా!

KG దాటని-

మాజీ కమ్యూనిస్టులు
ఈజీ బతుకుల కిష్టులు
రాజీ భావాకృష్ణులు
నాజీ భూతావిష్టులు
ట్రాజీ-కామికల్‌ నియో -కేపిటలిస్టులు

అ. భా ...
జనసంఘం
మారణ సంఘం
ప్రతారణ సంఘం
విదారణ సంఘం
కలహ కారణ సంఘం

నిర్‌___
జన సంఘం
హరే రాం భజన సంఘం
ఆశక్త దుర్జన సంఘం
అపకీర్తి నేమార్దన సంఘం
అమేధ్య భోజస్‌ సంఘం

చిట్కా

సమస్య
లు అమావాస్య
లైతే అవశ్య 
కరణీయాలు హాస్య
కిరణాల ప్రసారణాలురా శిష్య!

నక్కాళ

ఇది జనస్వామ్యం
కాదు, ధనస్వామ్యం
యాంకీ బుణస్వామ్యం
రూసీ వ్రణస్వామ్యం
నిశ్శేఫన నిర్వీర్య వృషణ స్వామ్యం

స్వార్ధపరులకు హెచ్చరిక

ఈ నాడు నేషనల్‌
అంటే ఇరేషనల్‌
పైగా సెన్సేషనల్
ఏతత్సంబంధ ఘోషణల్‌
నిరర్థక దుర్భాషణల్‌

ఎండా వానా కుక్కల నక్కల పెళ్ళి

సర్వత్రా శవసేనల శివాలా?
స్వయంసేవ సంఘీయుల సవాలా?
'ఫేరవాల ఖైరవాల రవాలా?
ఇక రాజ్యం రణరంగం అవాలా?
అయితే వాళ్ళ గతే తుదకు దివాలా!

కళాకాళీ

సామ
సుందర దోమ
రామరామ
సుకవితామ
తల్లికి ప్రవాస  సీమ !

 మిల్క్ ఆఫ్‌ మెగ్నీషియా

ఆరుద్ర  చేస్తున్న విమర్శనాలు
అసాహిత్యానికి నిదర్శనాలు
అబద్దాల ప్రదర్శనాలు
అతగాడి ఇటీవలి. 'ప్రరోచనాలు
అజీర్తి సుఖ విరేచనాలు

అహాహాః

ఇహ
లోకం ఒక ప్రహ
సనం బక రాక్షసుడి గుహ
అక్కడ తప్పకు స్పృహ
అహ్హహ్హహ్హహ్హ హ!


ఇహిహీ
ఇందిర పందిరి నీడ
ఓ హోయి గజ్జెల కుర్రోడ
జయేందిరను వెదుకాడ
బోతున్న నిన్ను జూడ
నవ్వొస్తుంది నాకుగూడ

తెలుసా

విరసాని కెదురొడ్డి
అబ్బాయ్‌ డియర్‌. మళ్లా రెడ్డి
నువ్వు రాస్తున్న గుడ్డి
విద్వేషపు రాతల జడ్డి 
తనం వల్ల విరుగుతుంది ఆరసం నడ్డి

భూత వైదులు

సిండికేటు గాళ్ళు
పుండులాంటి వాళ్ళు
రియాక్షన్‌కి గీటు రాళ్లు,
ఇక్ష్వాకుల నాటి కుళ్లు!
వాళ్ళంతా జోడెడ్ల నాటు బళ్లు

ఏం చేస్తాం

“దాశరథి
నవ్య కళానిధి
కాప్యపయోదదధి
ఐనా చైనా అంటే అధి
కాధిక భయం ఆతని దుర్విధి

కిరాణా కొట్టు

సినారె
బళారె
అన్నిట్లో హుషారె
సినిమా రె
డీమేడ్‌ సరుక్కి తయారె

చూస్తారుగా

మీ ఇష్టం
ఏదైనా అనండి, బాలారిష్టం
లేదా సారన్వతారిష్టం
మరేదైనా! కాని మా సిస్టం 
రేపటి విప్లవానికి నాంది అనేదే స్పష్టం!

మానిఫెస్టో

విస్తప సాహిత్యం
పోయే దారి కంటక భూయిష్టం
దాని ప్రధాన రసం బీభత్సం
దాని పునాది సాంఘిక యాఖార్హ్యం
దాని ఆదర్శం వర్గ రాహిత్యం

 
గ్. మ్. ఫ్ 
కువిమర్శకుల ఊహల్లో చిల్లులు
అచ్చుల్లేని హల్లులు
రుద్రాక్ష పిల్లులు
వాళ్ళ తల్లులు
నెత్తురు పీల్చే నల్లులు

వార్నింగ్‌   
నోటి దురుసు నోరి
నీరసపు టెడారి
పేరులేని మారి
అటుపోతే కాలు జారి
చెడిపోతావ్‌ నీళ్లు కారి

నారాయణ నారాయణ

వెయ్యి పడగలు
లక్ష పిడకలు
అక్క పిడతలు
కాగితపు వడవలు
చాదస్తపు గొడవలు

శుభం భూయాత్‌

అమెరికా జులుం బెడిసింది
రష్యా హయాం ముగిసింది
ఇంగ్లాండ్‌ తోక ముడిచింది
ఐరాస కోరస్‌గా అరిచింది
జనచైనా గెలిచింది

విరసం=1

విరసం ప్రణాళిక 
విప్లవ సాహిత్య ప్రకాశిక 
నవయువ రక్త ప్రవేశిక 
భవితవ్య భవ్య ప్రతోలిక 
అరసానికి కొరకరాని ప్రహేళిక

విరసం-2

విరసం విరోధుల నోళ్లు
వాంతి చేసుకుంటున్నాయ్‌ కుళ్లు
కదులుతున్నాయ్‌ వాళ్ల కిళ్లు
నెమకుతున్నాయ్‌ నెరసులకై వాళ్ళ కళ్లు
పరుగిడుతున్నాయ్‌ వాళ్ళ గుండెల్లో రైళ్లు

విరసం-3

విరసం అరణ్య కంఠీరవాలు
వేస్తున్నాయ్ బ స్తీమీద సవాలు
వీస్తున్నాయ్ ఝాం ఝునిలాలు 
పదును పెట్టి కత్తుల కలాలు
తెరుస్తున్నాయ్ వెలుతురు కవాటాలు శతాధికాలు 

అగ్ని పరీక్ష 
చెయ్యాలి పరిస్థితుల సమీక్ష 
వహించాలి దీక్ష 
వర్గ శత్రువులపై కక్ష 
పరిష్కరించి సమస్యలు సవాలక్ష 
విధించాలి వెధవలకు తగ్గ శిక్ష

చిత్తశుద్ది 

విస్తవకారుల విధ్వంస
బీభత్సృకాండకు నా  ప్రశంస 
అదెన్నడూ  కానేరదు హింస 
అది నూతన చేతనా రిరంన
మానవ మానస మానసరోపర హంస

 
సుజలాం, సుఫలాం

సామ్యవాదం
ఈనాటి వేదం
అందరిలో మారుమ్రోగే నినాదం 
అందరికీ అందిస్తుంది మోదం
ఆది సఫలం, సుఫలం, శ్రీదం!

పిలుపు

కదన విహారానికి కత్తి పట్టు
కార్మిక వీరుడవై సుత్తి తిప్పు 
ప్రగతి విరోధుల భిత్తి కొట్టు 
పామ్యవాదాన్ని నీ గుండెల్లో హత్తిపెట్టు 
సమానతా సదాశయాన్ని నెత్తి కెత్తు 

మలుపు

సమైక్య  సందేశం చాటి
ఈ నాటి
ఖండాంతర సహస్రకోటి
కష్టజీవుల విజయథాటి
ఇస్తోంది సరిహద్దుల దాటి!

 
 

ముగింపు :- 
"అ నాడూ ఈ నాడూ 
హాస్యానికి విలువ కద్దు- 
సాహిత్య సభాంగణాన
వ్యంగ్యానిది. మొదటి పద్దు”


ప్రతికలలో కార్టూనులు పడుతూండటం చూస్తూంటారు.
వద్యంలో అ మాదిరి పద్ధతి ప్రవేశపెడుతూ. శ్రీశ్రీ 'మూడు
యాభయిలు వెలువరించడం, పాఠకలోకం రసించడం జరి
గింది. ఇప్పుడు “మరో మూడు యాభయిలు" వెలువడుతున్నాయి.
అవే __ పిరిసిరిమువ్వలు, _ ప్రాసక్రీడలు , లిమబుక్కులుః రకానికి పాఠకులకు 500 కన్న ఎక్కువగానే,
“కొనరు" రచనలు ముట్టగలవు. వీటివి గురించి "ఒకటి. రెండు
మాటలు" కూడా చేర్చారు మరి శ్రీశ్రీ,


 

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.