వినాయక వ్రత కథ/ganesh puja story

వినాయకచవితి వ్రత కథ 


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
ఓం వినాయకాయ నమః

           వినాయకచవితి ఇది మనందరి పండుగ. హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు పండుగే. పండుగ వస్తున్నదంటే పిల్లలకు కూడా ఎంతో సంబరంగా ఉంటుంది. పండుగరోజు ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకోవటం, ద్వారానికి మామిడి తోరణాలు కట్టడం, పిండి వంటలు, నైవేద్యాలు చేసుకొని, కొత్తబట్టలు ధరించి భగవంతుణ్ణి ఆరాధించటం ముఖ్యంగా  చేసే పనులు. వినాయకచవితి పండుగరోజు - స్వామివారికి ఎంతో ఇష్టమైన పత్రి తెచ్చే కార్యక్రమం పిల్లలకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది.


లోకంలో భాద్రపద మాసం శూన్య మాసమని ఈ నెలలో ఏ శుభ కార్యక్రమాలు, వివాహలు, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు చెయ్యకూడదని చాలా మంది అభిప్రాయం. భద్రములకు (శుభములకు) స్థానమైన మాసం భాద్రపద మాసం, భాద్రపదశుద్ధ చవితి రోజున వినాయకుడు ఆవిర్భవించి చవితి తిధిలో ఉన్న దోషాన్ని, భాద్రపద మాసాని కున్న శూన్యతని తొలగించాడు. శ్రావణ మాసంతో వచ్చే వరలక్ష్మీవ్రతం కేవలం ముత్తైదువులకు -మాత్రం పరిమిత మైతే శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమగా ద్విజుల వరకే పరిమితమైంది. 


 వినాయకచవితికి అలాంటి నియమాలు లేవు. ఈ పండుగని కేవలం బ్రాహ్మణులే చెయ్యాలన్న విషయం ప్రత్యేకంగా కనిపించదు. అందరూ చేసుకోవచ్చు. స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. చిన్న, పెద్ద తేడా లేదు. పసిపిల్లల నుండి పండు ముసలి వారి వరకూ అందరూ భక్తి శ్రద్దలతో జరుపుకొనే పండుగ వినాయక చవితి. విశేషమైన నాయకుడు

వినాయకుడు. ఆయన సకల దేవగణానికి అధిపతి | సకల విఘ్నాలకు అధినాయకుడు ! మన సకల కార్యాలను నెరవేర్చగల వరసిద్ధి ప్రదాత. 

 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే |
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే || 

అని విద్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో, దేవాలయాల్లో అంతటా వినాయక ప్రార్ధన తోనే నిత్య కార్యక్రమాలు
కూడా ప్రారంభమౌతాయి. వినాయక చవితి రోజున
స్వామిని ఒక ప్రత్యేక రూపంతో ఆరాధిస్తారు. ఇతర రోజులలో పసుపుతో వినాయకుని చేసి పూజిస్తారు. సంపన్నులే కాక సామాన్యులు కూడా భక్తితో చేసుకొనే విశేషమైన పండుగ మన వినాయకచవితి. సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా మొదలుపెట్టిన పనులు విజయవంతం కావాలని సకల విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కుటుంబ సమేతంగా పూజిస్తుంటాం.

a

గణపతి పృధ్వీతత్వానికి సంకేతం. అందువల్ల బంగారం, వెండి, రాగి ప్రతిమలతో పూజ చేసినా మట్టి వినాయకునికి పూజ చేస్తేనే స్వామికి సంతృప్తి కలుగుతుంది. వినాయకుడు మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం ప్రాణశక్తి కేంద్రం. అందువలన ఈ స్వామిని ఆరాధిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పత్రి పూజకి ఉపయోగించే 21 రకాల ఆకులు ఓషధీ విలువలు కలిగినవే కాబట్టి ఆరోగ్యం కూడా చేకూరుతుంది..

వర్ష ఋతువులో వచ్చే అనేక వ్యాధుల నుండి రక్షించే వ్రతం. వినాయక వ్రతం. ఈ వ్రతాన్ని వినాయక చవితి రోజున ఆచరించాలి. ఈ కాలంలో ఆరోగ్యం అందరికీ అవసరమే. కాబట్టి మహాభాగ్యమైన ఆరోగ్యం పొందటానికి అందరం తప్పకుండా వినాయకుణ్ణి పూజించ వలసిందే. అటు సంప్రదాయంతో పాటు ఇటు సైన్సుని కూడా చాటుతున్నందు వలన వినాయక చవితి మనందరి పండుగ అయింది.

గణపతి అష్టోత్తర శతనామావళి:

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః -
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః 
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః 
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః |
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః 
ఓం హేరంబాయ నమః
ఓం లంబకర్ణాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మహోత్కటాయ నమః 
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః 
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్తే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాటత్పయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థతాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః 
ఓం పూష్టే నమః 
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః 
ఓం అగ్రగణ్యాయ నమః 
ఓం అగ్రపూజ్యాయ నమః 
ఓం అగ్రగామినే నమః 
ఓం మంత్రకృతే నమః 
ఓం చామీకరప్రభాయ నమః 
ఓం సర్వాయ నమః 
ఓం సర్వోపన్యాసాయ నమః 
ఓం సర్వకర్తే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థ పనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః 
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయనే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః 
ఓం అభీష్టవరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః 
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః. 
ఓం సమస్త దేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థతాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వక్టృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః |
ఓం కళ్యాణ గురవే నమః 
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః 
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః |

శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

గౌరీ పూజైనా, లక్ష్మీనోమైనా, శివుడి అభిషేకమైనా, మహావిష్ణువు వ్రతాలైనా గణపయ్యను ఒక్కసారి ఆవాహనం చేసిన తదుపరే ప్రారంభం అవుతాయి. అలాంటి ప్రథమ పూజ్యుడి పుట్టినరోజున ఆయన్ను శరణు వేడడం సర్వ శుభదాయకం.

(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు
చేతిలో వుంచుకొని కథ వినాలి).

సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.


పూర్వం గజరూప రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందు నివసించి ఉండమని కోరాడు. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీరి గజాసురుని ఉదరమందు ప్రవేశించాడు.

కైలాసాన పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశాలలో అన్వేషిస్తూ కొంత కాలానికి గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, "మహాత్మా! నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము"

   గణేశ్వరునిపట్ల కుబేరుడు అహంకార పూరితంగా వ్యవహరించిన ఒక సంఘటన క్రమంలో శివుడు సలహానుసారం కుబేరుడు గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేన్పులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి, మనలోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక.

అని విలపించింది, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యం చెప్పి పంపాడు. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రపించుటకి గజాసురుడు సంహారమునకు గంగిరెద్దుమెల్లమె సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరి చేత తలొక వాద్యమును ధరింపజేసి, తాను కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరాడు. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబులు బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై "మీకేమి కావలయునో కోరుకోండి" ఇచ్చెదను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వానిని సమీపించి, "ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చింది. కావున శివునొసంగు" అనెను.


ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని “నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు"మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారం తెలిపి నందిని ప్రేరేపించాడు నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. అప్పుడు శివుడు గజాసురగర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా "హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్లాడు. పిదప శివుడు నంది నెక్కి కైలాసానికి వేగంగా వెళ్లాడు.

కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగత సన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక్క ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసెను.


     ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు
కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపింది. స్నానానంతరం పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొని పతి రాకకోసం నిరీక్షించసాగింది. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోయాడు. ఇంతలో వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించాడు. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తనమందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలంతో బాలుని కంఠాన్ని ఉత్తరించి లోపలికి వెళ్లాడు.

అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్య పాద్యాదులచే పూజించింది. వారిరువురు పరమానందంతో ప్రియసంభాషణములు ముచ్చటించుకొంటుండగా ద్వారం దగ్గర వున్న బాలుని ప్రస్తావన వచ్చింది. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం ప్రసాదించి "గజాననుడు" అని పేరుపెట్టాడు. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనసాగారు. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తున్నాడు. అతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనంగా జేసికొన్నాడు.

కొంతకాలానికి పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. అతని వాహనరాజం నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.

ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరారు. గజాననుడు తాను పెద్దవాడు గనుక ఆ ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి. కూడా తండ్రిని వేడుకొన్నాడు.

సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, "మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో, వారికి యీ ఆధిపత్యం ఇస్తాను" అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయు వేగంగా వెళ్లాడు. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి "అయ్యా! అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా ! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయం తెలిపి రక్షించండి" యని ప్రార్థించాడు. అప్పుడు మహేశ్వరుడు దయతో, "కుమారా! ఒకసారి నారాయణ మంత్రం పఠించు" మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు.

"సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం. 
గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక ''

అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ కైలాసాన ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావంతో అంతకు పూర్వం గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. 


ఆ విధంగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడుతూ,కైలాసానికి వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలాన్ని నిందించుకుని "తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అట్లా అన్నాను. క్షమించు. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వండి" అని ప్రార్థించాడు.

అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత స్వీకరించడం ద్వార      
విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుతున్నాడు. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పాలు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు, మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించాడు.


 భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోయాడు. ఎంత ప్రయత్నించినా, ఉదరం భూమికి ఆని, చేతులు భూమికి అందటం లేదు. ఈ విధంగా ప్రణామం చేయడానికి శ్రమిస్తుండగా శివుని శిరస్సున అలంకరించి వున్న చంద్రుడు చూసి వికటంగా నవ్వాడు. అంత 'రాజదృష్టి' సోకిన రాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయాయి. మృతుడయ్యాడు.


 పార్వతి శోకిస్తూ చంద్రుని చూసి, అతడు "పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక' అని శపించింది. చంద్రునికి కలిగిన శాపం లోకానికి కూడా శాపమైంది.

ఋషిపత్నులకు నీలాపనిందలు:

     ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నిప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషి పత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అటువంటి నీలాపనింద కలిగిందన్నమాట.


ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య (స్వాహాదేవి) యే ఋషిపత్నుల రూపము ధాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధాన పరచాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.


అంత దేవాదులు, "ఓ పార్వతీదేవి! నీవిచ్చిన శాపం వలన లోకముల కెల్ల కీడు వాటిల్లుతోంది. దానిని ఉప సంహరింపు"మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, “ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజున చంద్రుని చూడరాదు” అని శాపానికి ఉపశమనం చెప్పాడు. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహాలకు వెళ్లి భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రం చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖంగా ఉన్నారు.

శమంతకోపాఖ్యానము


యదు వంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను
సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్య భగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్ష మయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు. వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి "శ్యమంతకమణిని కోరెను. 

అది విని సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చాడు. ఆ సమయాన సూర్యుడు సత్రాజిత్తుతో ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువులు బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఆ మణి ఉన్న దేశంలో అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిముల వల్ల ఉపద్రవాలు, దుర్భిక్షం మొదలగునవి ఉండవు. కానీ అశుచియై ధరిస్తే అది ధరించిన వానిని చంపుతుంది" అని చెప్పాడు.


 ఈ విషయాలను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యునినుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వస్తుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వస్తున్నాడని భావించి, ఆ విషయం శ్రీ కృష్ణునకు తెలియజేశారు. శ్రీకృష్ణుడు అట్టి రత్నం ప్రభువు వద్ద ఉంటే దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడు తుందని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పించాలనుకున్నాడు.

అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనుడికిచ్చాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్లాడు. కొంత సమయానికి శరీర శోధన కారణంగా ప్రసేనుడు. అశౌచాన్ని పొందాడు. ఈ కారణంతో ప్రసేనుడు సింహం దాడిలో మరణించాడు. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకం సంహరించి మణిని తీసుకొని పోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చింది. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.

ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వేటకై వెళ్ళివున్నాడు. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోషవేళలో ప్రసేనుడు సంహరింపబడ్డాడు. వానికోసం అడవిలో శ్రీకృష్ణుడు. వెదుకుతూ తలెత్తి చూడగా ఆకాశాన శుక్లపక్ష చవితినాటి చంద్రబింబం కనపడ్డాడు. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు. తన మందిరానికి తిరిగి వచ్చాడు. దానికి పూర్వం, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణం వల్ల, అతడే ప్రసేనునిచంపి మణిని అపహరించిందని సత్రాజిత్తు, పౌరులు భావించారు.


   అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు. మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, . శ్యమంతకమణిని అపహరించెనని, రాత్రివేళ సింహం ప్రసేనుని, అతని గుర్రాన్ని తిని ఉంటుందని నిష్టూరంగా పలికారు. ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభించాడు.

కొంత దూరం వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతక మణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించు నేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్పెను.

శ్లో॥ సింహః ప్రసేనమవధీః
సింహో జాంబవతాహతాః 
సుకుమారక మారోధీః 
తవ హ్యేష శ్యమంతకః

(తా॥ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి.. శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.). 
అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్య యుద్ధమునకు తలపడెను.

ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగావరమిచ్చెను.ఆకాలమునజాంబవంతు నా కు రాముని రామునిిఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె ఉండెడిది. కాని కృష్ణుడు. ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించసాగింది. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు. త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి "దేవాదిదేవ! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడు" అంటూ పలువిధాల అభ్యర్థించాడు.

శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి "జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చింది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను" అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా | శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపాడు.  ద్వారకానగర పౌరులకు ఈ సత్యం తెలిపి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొన్నాడు. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యార రత్న మేన (కుమార్తె) సత్యభామను, మణిరత్న మేనా శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించాడు.

శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన
ధృతరాష్ట్రునిఅనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడు ముగ్గురు ప్రముఖులుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి,. సత్రాజితును    సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయాడు, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురం నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథంలో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్యుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతుడు కృష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయాడు.

బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.

ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు. పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.

చంద్రకాంతిలేమిచే ఓషదులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువైంది. దీనితో దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయం కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు,), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించాడు. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహాన్ని పొందాడు. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన

భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను. అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతాలను స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించాడు. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికాడు. అంతట శ్రీ కృష్ణుడు తాను సమర్థతతో ఇంగంకనపడి౭ం గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహించమని కోరాడు.భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను పూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.

ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖంగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను.

దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగధాని                   శ్యమంతకోపాఖ్యానంలో శ్రీకృష్ణపరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోపాఖ్యానాన్ని అంటే అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి,వినయాలతో శిరమున అక్షతలు ధరించినయెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది.

ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.

"మంగళం మహత్"

చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి. మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.

- కథ సమాప్తం -

పునఃపూజ:

ఛత్రమాచ్చాదయామి। చామరేణ వీచయామి। నృత్యం దర్శయామి। గీతం శ్రవయామి|ఆందోళిక   నారోహయామి। గజానారోహయామి। అశ్వానరోహ యామి। సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి॥

(స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)

 మంగళహారతులు:

శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా
వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ||జయ||

సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు.                                || జయ||

పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు.                      || జయ||

ఓ. బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ | దినుచును పొరలుచును     || జయ||

వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి                        || జయ||

పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు|               ॥జయ॥

ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు.                            || జయ||

మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళముదేవ గణపతికినిపుడు|||జయ||

సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి                                     || జయ ॥

కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక.                                              ॥ జయ ||

అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు.                             ॥జయ॥

పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు| కోర్కెల                                         ॥జయ॥

బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు 'జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు.                           ॥జయ॥

పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని.                                    || జయ ||

దేవగణపతికి నిపుడు ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలి లింపజేతు॥ జయ||

మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ జేతుకోరి విఘ్నేశ                                                            ॥జయ॥

దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు                       ॥ జయ ॥ 

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను.                        ॥జయ॥

మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ.                                    ॥జయ॥

ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోన మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం!      ॥జయ॥

తీర్ధం విశిష్టత:

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం ! సమస్త పాప ప్రశమనం విష్ణు పాదోదకం శుభం !! తొలితీర్థం .... శరీర శుద్ధికి, శుచికి రెండవ తీర్థం... ధర్మ, న్యాయ ప్రవర్తనకు మూడవ తీర్థం... పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం కొరకు.


వాయనదానము:

శో॥గణేశః ప్రతిగృహ్లాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను)

మంత్రము - దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దాదా !

(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)
 ఉద్వాసన మంత్రము: 
(ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను)

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ || తేహనాకం మహిమానస్యచంతే! యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః || శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి|| పూజా విధానం సంపూర్ణమ్.🙏

(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.