మా తెలుగు తల్లికి మల్లెపూదండ/ ma telugu thalliki mallepudanda

 మాతెలుగు తల్లికీ మల్లెపూదండ




మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

మా కన్న తల్లికీ మంగళారతులు 

కడుపులో బంగారు కనుచూపులో కరుణ,

చిరునవ్వుతో సిరులు దొరలించు మాతల్లి.


గలగలా గోదారి కదిలిపోతుంటేను

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను 

బంగారు పంటలే పండుతాయి. 

మురిపాల ముత్యాలు దొరలుతాయి..


అమరావతీ నగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు

నిత్యమై నిలచి ఉండేదాక.


రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి 

తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారు మ్రోగే దాక 

నీ ఆటలే మేము అడతాం నీ పాటలే మేము పాడతాం.


జై తెలుగు తల్లి

జై తెలుగు తల్లి

జై తెలుగు తల్లీ!

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.