తెలుగు సాహిత్య ప్రశ్నలు/ Telugu Sahitya & literature questions/ poetry questions

                         సాహిత్య ప్రశ్నలు


1. శాసనాల్లో వారం పేరు చెప్పటం మొదట ఏ శాసనంలో కనిపిస్తుంది?

2. చామణకాలు అను ఉద్యోగి కత్తిశర్మ అనే బ్రాహ్మణుడికి భూమిని దానం చేస్తున్నట్లు వేసిన శాసనం?

3. రేనాడు ఏడు వేల గ్రామాల సీమ అని చెప్పబడిన శాసనమేది?

4. విప్పర్తి శాసనం వేయించినది?

5. భాషాశాస్త్రవేత్తల దృష్టిలో తొలి తెలుగు గద్యశాసనం?
6. మొదటిసారిగా గణబద్దమైన ఛందోరచన ఏ శాసనంలో కనిపిస్తుంది?

7. పండరంగడు వేయించిన శాసనపద్యాలను పండరంగడే రచించాడని అభిప్రాయపడినది?

8. పండరంగని అద్దంకి శాసన పరిష్కర్త?

9. " పట్టంబు గట్టిన ప్రథమంబు నేణ్డు " పాదం గల శాసనమేది?

10. పండరంగని అద్దంకి శాసనంలోని పద్యం?

జవాబులు:-
 
1. తిప్పలూరి శాసనం

2. తిప్పలూరి శాసనం

3. మాలెపాడు శాసనం

4. జయసింహవల్లభుడు

5. ఎర్రగుడిపాడు శాసనం

6. అద్దంకి శాసనం

7. నిడదవోలు వేంకటరావు

8. కొమర్రాజు లక్ష్మణరావు

9. అద్దంకి శాసనం

10. తరువోజ



ప్రశ్నలు:-


1. సంస్కృత శాసనాల్లో మొట్టమొదటి శాసనమేది?

2. ' భాగవత్ శ్రీ పర్వతస్వామి పాదానుథ్యాతస్య ' అని చెప్పుకున్న వారు?

3. ' జనాశ్రయ ఛందోవిచ్చితి ' అనే సంస్కృత ఛందో గ్రంథ రచయిత?

4. ' చెఱువు' ఏ మూల ద్రావిడ శబ్దం నుండి ఏర్పడింది?

5. శాసనాలను మొట్టమొదట తెలుగులో వేయించిన వారు?

6. తెలుగులో వేయబడిన మొట్టమొదటి శాసనం?

7. కలమళ్ళ శాసనాన్ని ప్రకటించిన వారు?

8. తెలుగులో సంపూర్ణంగా, అర్థవంతంగా ఉన్న మొదటి శాసనం?

9. ' ఎరికల్ముత్తు రాజుల్ల కుణ్డికాళ్లు నివబుకాను ఇచ్చిన పన్నస ' అన్న వాక్యం గల శాసనమేది?

10. సంఖ్యా వాచకం కనిపిస్తున్న తొలి తెలుగు శాసనం?

జవాబులు:-
                     
1. గిర్నార్ శాసనం

2. విష్ణుకుండినులు

3. గుణస్వామి

4. కెఱయ్

5. రేనాటి చోళులు

6. ధనంజయుని కలమళ్ళ శాసనం

7. ముట్లూరి వెంకట రామయ్య, కె.ఎ. నీలకంఠ శాస్త్రి

8. ఎర్రగుడిపాడు శాసనం

9. ఎర్రగుడిపాడు శాసనం

10. ఎర్రగుడిపాడు శాసనం


ప్రశ్నలు:-
    
     
1. శాతవాహనుల రాజభాష?

2. బృహత్కథ గ్రంథంలోని 11వ అధ్యాయానికి ఏమని పేరు?

3. ' మాల కుమారుని కథ ' గల గ్రంథం?

4. ' లీలావతి '  అనే  ప్రాకృత కావ్యాన్ని వ్రాసినది?

5. ' గాథా త్రిశతి ' రచయిత?

6. ప్రాకృత గాథాసప్తశతి - రచయిత?

7. " నాగబులోని ' బు ' అనునది అమహద్వాచక ప్రథమైక వచన ప్రత్యయం " అని అన్నది?

8. ' నాగబు ' తొలి తెలుగు మాట అని ప్రకటించినది? 

9. 'నాగబు ' అసలు పదమే కాదని అన్నది?

10. ' పహ్లవ ' శబ్దం కనిపించే శాసనం?


జవాబులు:-
     
1. ప్రాకృతం

2. పంచవింశతి

3. బృహత్కథ

4. కుతూహలుడు

5. నరాల రామిరెడ్డి

6. దీవి సుబ్బారావు

7. వేటూరి ప్రభాకర శాస్త్రి

8. వేటూరి ప్రభాకర శాస్త్రి

9. బి.ఎస్ . ఎల్ .హనుమంతరావు

10. గిర్నార్ శాసనం


-->       
   తెలుగు వ్యాకరణాశాంములలోని  అలంకారాలు
 గూర్చి తెలుసుకొనుటకు👆 నొక్కండి.




ప్రశ్నలు:-

1. కాలత్ , సరవాన్ , ఝులవన్ అన్న మాండలిక పదాలు ఏ ద్రావిడభాషకు చెందినవి?

2. ' శ్రీ రామా కుచమండలీ మృగమద శ్రీ గంధ సంవాసిత ' ఇది ఏ కావ్యంలోని తొలి పద్యం?

3. ' భావాను కరణమ్ రస: (భావానుకరణమే రసము) అన్న అలంకారికుడు?

4.' Brahui Language ' గ్రంథకర్త?

5. ' కవి ' శబ్దం మొట్టమొదట పరామాత్మపరంగా ఎందులో వాడబడింది? 

6. శ్రీనాథుని జన్మకాలం క్రీ.శ 1385 అని నిర్ధారించినది?

7. ' శ్రీ స్తన గంధ సార పరిషేక సమంచిత సాయక ప్రయో ' ఇది ఏ కావ్యంలోని తొలి పద్యం?

8. కవిత్వ విషయంలో మార్గదేశి భేదములను మొదట పాటించిన భాష ఏది?

9. కాళీపట్నం రాసిన ' భయం ' కథలో భయాన్ని జయించిన వీరుడిగా నిలిచిన పాత్ర ఏది?

10. తిక్కన ' భవ్యకవితావేశుని ' గా ఎవరిని కొనియాడాడు?


జవాబులు:-
                  
1. బ్రాహుయి

2. శృంగార నైషధం

3. శ్రీశంకకుడు

4. సర్ డేనిస్ బ్రే

5. వేదాల్లో

6. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి

7. భీమేశ్వర పురాణం

8. కన్నడభాష

9. సత్తెయ్య

10. వ్యాసున్ని

              
ప్రశ్నలు:-

1. ' శృంగార నైషధం ' కు వేదం వేంకటరాయశాస్త్రి వ్రాసిన వ్యాఖ్యానం ఏది?

2. శ్రీనాథుడు ' శాలివాహన సప్తశతి ' ని పెదకోమటి వేమారెడ్డికి అంకితమిచ్చనేమో అని ఊహించినది ఎవరు?

3. ' తెల్లని గడ్డంబు, తెల్లని మీసముల్ , నరసిన రోమ పాండుర శిరంబు ' అని శ్రీనాథుడు హరవిలాసంలో ఎవరిని వర్ణించాడు?

4. ' పురాణం సర్వ సాహిత్య ప్రక్రియలకు మాతృభూమి ' అని ఏ పురాణంలో చెప్పబడింది?
5. తెలుగులో రాసిన తొలి ఆత్మకథ?

6. " జీవద్భాషకు నియమకారుడు రచయితే కానీ లాక్షణికుడూ, వ్యాకరణకర్త కాదు " అన్నది?

7. సర్పవరక్షేత్ర వర్ణన గల శ్రీనాథుని కావ్యం?

8. తాపీ ధర్మారావు వ్రాసిన హృదయోల్లాసం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం?

9. కోస్తా , గిడ్డంగి, గోదాము ఏ భాషా పదాలు?

10. నాట్యాంబుజము ' గ్రంథ రచయిత?

జవాబులు:-
                  
1. సర్వంకష వ్యాఖ్య

2. పింగళి లక్ష్మీకాంతం

3. వృద్ధబ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రున్ని

4. నారదీయ పురాణం

5. నా యెఱుక (ఆదిభట్ల నారాయణదాసు)

6. గిడుగు రామమూర్తి పంతులు

7. భీమేశ్వర పురాణం

8. విజయవిలాసం

9. పోర్చుగీసు

10. పురాణం సూరిశాస్త్రి




                             
                              
ప్రశ్నలు:-
       

1. తెలుగు సంస్కృత ప్రాకృత జన్యమనే వాదాన్ని ప్రతిపాదించిన వారు?

2. తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు మున్నగు భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవనే వాదానికి మార్గదర్శకులు ఎవరు?

3. కాతంత్ర వ్యాకరణం వ్రాసింది?

4. ' బృహత్కథ ' భారత, రామాయణాల పక్కన  గౌరవం పొందిన కావ్యం అన్నది ఎవరు?

5. బృహత్కథాశ్లోక సంగ్రహ పేరుతో బృహత్కథను సంస్కృతీకరించినది ఎవరు?

6. బృహత్కథామంజరి వ్రాసినది?

7. కథాసరిత్సాగరం రచయిత?

8. కథాసరిత్సాగరాన్ని తెలుగులోకి 
    అనువదించిన వారు?

9. బృహత్కథ ప్రాచీనకాలంలోనే ఏ పేరుతో తమిళంలోకి అనువదించబడింది?

10. బృహత్కథలోని ఇతివృత్తం ఆధారంగా తెలుగులో ఉదయనోదయం ' అనే కథా కావ్యం వ్రాసినది?


జవాబులు:-

                       
1. చిలుకూరి నారాయణరావు

2. కాల్డ్వెల్ 

3. శర్వవర్మ

4. ముదిగొండ సుజాతారెడ్డి

5. బుధాస్వామి

6. క్షేమేంద్రుడు

7. సోమదేవసూరి

8. వేదం వేంకటరాయశాస్త్రి

9. పెరుంగదై

10. నారన సూరన

                           

       🎵తెలుగోడు ఎంపిక చేసిన
👉  తెలుగు పాటలు వినండి.


ప్రశ్నలు:-

1. ఆంధ్రవాఙ్మయాన్ని ప్రాచీనకవులు,  
    మధ్యయుగపు కవులు, ఆధునిక కవులు 
    అని మూడు విధాలుగా విభజించినవారు?

2. ఆంధ్రవాఙ్మయాన్ని భారతకవులు, 
    రామాయణ కవులు, ప్రబంధ కవులు, గేయ 
    కవులని విభజించిన వారు?

3. కవులను పోషించిన రాజులను, 
    రాజవంశాలను, జమీందారులను బట్టి 
    యుగవిభజన చేసిన వారు?

4. కావ్య ప్రక్రియా భేదాలను బట్టి యుగ విభజన 
    చేసినవారు?

5. ప్రాఙ్నన్నయ యూగాన్ని అజ్ఞాతయుగం అని 
    పేర్కొన్నది ఎవరు?

6. కావ్యభేదాలను, రాజవంశాలను కలిపి 
   యుగవిభజన చేసినది ఎవరు?

7. కొంత ప్రధాన కవుల మీద, కొంత కాలం మీద, 
    కొంత కావ్యభేదముల మీద కొంత దేశం మీద 
   ఆధారపరచి యుగవిభజన చేసినవారు?

8. గాథా సప్తశతి ఏ భాషలో రచించబడింది?

9. బృహత్కథ ఏ భాషలో వ్రాయబడింది?

10. తెలుగు భాషకు మూల పురుషులు ఎవరు?

జవాబులు:-

1. కందుకూరి వీరేశలింగం

2. గురజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు

3. ఆరుద్ర

4. దివాకర్ల వేంకటావధాని

5. దివాకర్ల వేంకటావధాని

6. కాళ్ళకూరు వెంకట నారాయణరావు

7. ఖండవల్లి లక్ష్మీరంజనం

8. ప్రాకృతభాష

9. పైశాచీభాష

10. యానాదులు
                            
                  
ప్రశ్నలు:-                 


1. ' ఆకాశదేవర ' నాటక రచయిత ?


2. సాని కూతల సౌందర్య వర్ణన గల శ్రీనాథుని       కావ్యం?


3. పండిత వాదమున మధురలోని సరస్వతీ     భాండాగారమును గెలిచిన కవయిత్రి?


4. దిగంబర కవి అయిన జ్వాలాముఖి అసలు      పేరు?


5. వసుచరిత్రకు వచ్చిన వ్యాఖ్యానాలలో      మొట్టమొదటిది ఏది?


6. సాహిత్య భావలహరి గ్రంథకర్త ?


7. ' అపాద: పద సంఘాత: గద్యం ' అన్నది?


8. తిక్కన ఏ పర్వంలో మహాస్రగ్ధర ను      ప్రయోగించాడు?


9. శఠకోప విన్నపాలు గ్రంథ రచయిత?


10. ప్రతిభను కారయిత్రి, భావయిత్రిగా        నిర్ధారించినది?


జవాబులు:-


1. పాటిబండ్ల ఆనందరావు 


2. భీమేశ్వరపురాణం


 3. మధురవాణి 


4. వీరవెల్లి రాఘవాచార్యులు 


5. విద్వజ్జనరంజని - వేములవాడ సోమనాథుడు

 

6. యస్వీ జోగారావు 


7. దండి 


8. సౌప్తిక పర్వం 


9. కృష్ణమాచార్యులు 


10. రాజశేఖరుడు



> తెలుగోడు రాసిన 👉 తెలుగు కవులను చూడండి.





ప్రశ్నలు:-


1.    ‘నాదబ్రహ్మ’ బిరుదాంకితుడు’ ఎవరు?

    1) రామదాసు            2) త్యాగయ్య      
    3) క్షేత్రయ్య            4) అన్నమయ్య


2.    ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ ప్రబంధ కర్త ఎవరు?

    1) శంకర కవి    
    2) వెలగపూడివెంగయామాత్యుడు    
    3) రామరాజు రంగప్పరాజు   4) నాదెండ్ల గోపన


3.    ‘సాంబోపాఖ్యానం’ కర్త ఎవరు?

    1) రామరాజు రంగపురాజు  
    2) దానేరు కోనేరునాథ కవి  
    3) శంకర కవి       4) నాదెండ్ల గోపన్న కవి


4.    ‘చంద్రభాను చరిత్ర’ రచన ఎవరిది?

    1) తరిగొప్పుల మల్లన      2) హరిభట్టు      
    3) ఎడపాటి ఎర్రన            4) చిన తిమ్మన


5.    ‘సిద్దేశ్వర చరిత్ర’కు మరో పేరు ఏమిటి?

    1) సిద్దేశ్వర మహత్యం        2) ప్రతాపచరిత్రం     
    3) కాకతీయ రాజవంశావళి     4) పైవన్నీ


6.    ‘నరపతి విజయం’ కర్త ఎవరు?

    1) విశ్వనాథనాయకుని స్థానాపతి      
    2) అందుగుల వెంకయ్య     
    3) రావణూరి వేంకటాచార్యుడు        
    4) వేంకటాచార్యుడు


7.    కుమార ధూర్జటి రచన ఏది?

    1) పెద్దన విజయం        2) తిమ్మన విజయం     
    3) ధూర్జటి విజయం      4) కృష్ణార్జున విజయం


8.    ‘శకుంతలా పరిణయం’ కర్త ఎవరు?

    1) రేవణూరి వేంకటాచార్యుడు  
    2) కుమార ధూర్జటి   
    3) బాల సరస్వతి             
    4) ముదరాజు రామన


9.    ‘లక్షణ సార సంగ్రహం’ కర్త ఎవరు?

    1) వెల్లంకి తాతం భట్టు         2) చిత్రకవి పెద్దన   
    3) వేంకటాచల కవి             4) లక్ష్మణ కవి


10.    ‘పరతత్త్య రసాయనం’ వేదాంత గ్రంథకర్త                  ఎవరు?

    1) ఈశ్వర ఫణిభట్టు           2) తురగా రాజకవి    
   3) అయ్యంకి బాలసరస్వతి      4) పైవేవీ కాదు


11.    తెలుగు కావ్యాలను మొదటగా                                వ్యాఖ్యానించింది ఎవరు?

    1) వేదం వెంకటరాయశాస్త్రి      
    2) తాపీ ధర్మారావు    
    3) ముదరాజు పెదరామన    
    4) లింగమకుంట తిమ్మకవి


12. రఘునాథ నాయకుని తెలుగు రచనలెన్ని?

           1) 5        2) 7        3) 9        4) 11


13. విక్రమార్క చరిత్ర కర్త ఎవరు?

         1) రంగరాయ కవి      2) సిద్ధనమంత్రి    
         3) జక్కన          4) ఏకామ్రనాథుడు


14. ‘సౌభరి చరిత్ర’ కర్త ఎవరు?

        1) ఏకామ్రనాధుడు      2) చెన్నశౌరి  
        3) రాయలు                 4)ప్రౌఢదేవరాయలు


15. ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ రచన ఎవరిది?

          1) జక్కన         2) శంకర కవి  
          3) అయ్యలరాజు         4) ఎవరూ కాదు


16. రాజా మల్లారెడ్డి రచన ఏది?

        1) షట్చక్రవర్తి    2) శివధర్మోత్తరం 
        3) పద్మపురాణం  4) పైవన్నీ


17.‘కృష్ణార్జున సంవాదం’ కర్త ఎవరు?

       1) సంకుసాల నృసింహకవి      
       2) నాదెండ్ల గోపన
       3) రుద్రకవి                         
       4) మల్లన


18.    దేనిని ప్రథమాంధ్ర సంగ్రహ రామాయణంగా              పరిగణిస్తారు?

         1) రంగనాథ రామాయణం
         2) భాస్కర రామాయణం
         3) ఉత్తర రామాయణం
         4) మొల్ల రామాయణం


19.    ‘ప్రతాప చరిత్ర’ రచన ఎవరిది?

         1) జక్కన                    2) మంచన     
         3) ఏకామ్రనాథుడు         4) గోపన


20.    ‘అర్థమెల్ల దోచకుండ గూఢ శబ్దములను                    గూర్చి వ్రాసినచో అది మూగ చెవిటి వారి                  ముచ్చటగును’ అనే అభిప్రాయమెవరిది?

               1) తిక్కన        2) శ్రీనాథుడు   
               3) మొల్ల           4) కంకంటి పాపరాజు


21.    ‘వరలక్ష్మీత్రిశతి’ ఎవరి స్మృతి కావ్యం?

              1) రాయప్రోలు                2) సినారె   
              3) విశ్వనాథ                   4) పానుగంటి


22.    ‘విషాదమోహనం’ కర్త ఎవరు?

           1) కృష్ణశాసి్త్ర               2) బసవరాజు   
            3) నాయని                   4)దువ్వూరి


23.    అబ్బూరి రామకృష్ణారావు రచన?

             1) జలాంజలి            2) మల్లికాంబ   
             3) పూర్వప్రేమ           4) పైవన్నీ


24. కూలే్ట్ర దొర ప్రభావంతో కవితా రంగంలో                 అడుగుపెట్టిన కవి?

      1) కృష్ణశాసి్త్ర        2) కవికొండల వెంకటరావు 
      3) అబ్బూరి            4) దువ్వూరి


25. కృష్ణశాస్త్రి రచన ‘కృష్ణపక్షం’ ఎప్పుడు                        వెలువడింది?

            1) 1920     2) 1923    
            3) 1925     4) 1930


26.‘సత్యాంజనేయులు’ జంట కవుల రచన ఏది?

         1) అడవిపిల్ల        2) సన్యాసి     
         3)రాధ                  4) పైవన్నీ


27.‘చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిన’ కవి          ఎవరు?

        1) దువ్వూరి                  2) నండూరి   
        3) అడవి బాపిరాజు       4) విశ్వనాథ


28. దువ్వూరి రచన పేరేమిటి?

      1) జలదాంగన          2) పానశాల   
      3) గులాబితోట          4) పైవన్నీ


29. ‘సాహితీ సమితి’ ఎప్పుడు ఏర్పడింది?

        1) 1915                2) 1918          
        3) 1919                4) 1920


30.    తల్లావఝల శివశంకర శాసి్త్ర ఆధ్వర్యంలో              సాహితీ పత్రికను ఎప్పుడు స్థాపించారు?

         1) 1915              2) 1920          
         3) 1924              4) 1928


31.    ‘తపసుచే తాల్మిచే, ధ్యానధార చేత లీనమై               ఐక్యమీయజారినదె ప్రేమ’ అన్నదెవరు?

              1) కృష్ణశాసి్త్ర         2) రాయప్రోలు   
              3) చిలకమర్తి           4) పానుగంటి


32.    ‘ఈ శతాబ్ది (20) రెండో పదిలోనే సమగ్రాంధ్ర              స్వరూపాన్ని సందర్శించగలిగిన క్రాంతిదర్శి’               రాయప్రోలు అని అన్నదెవరు?

               1) విశ్వనాథ   2) ఖండవల్లి 
               3) సినారె        4) శ్రీశ్రీ


33.    ‘ఆధునిక కవిత్వాన్ని’ గీత కవిత్వం అన్నది               ఎవరు?

        1) నోరి నరసింహశాసి్త్ర   2) దువ్వూరి   
        3) గాడిచర్ల                      4) కృష్ణశాసి్త్ర


34.    ఆధునిక కవిత్వాన్ని ‘కాల్పనిక కవిత్వం’                  అన్నదెవరు?

        1) నోరి నరసింహశాసి్త్ర     2)  కృష్ణశాసి్త్ర   
        3) సినారె                           4) పైవేవీకావు


35.    ఆధునిక కవిత్వాన్ని రాయప్రోలు ఏ విధంగా             పిలిచారు?

               1) గీత              2) కాల్పనిక    
               3) అభినవ       4) నవ్య


36.    ఆధునిక కవిత్వాన్ని నోరి నరసింహశాస్త్రి                  ఏవిధంగా పిలిచాడు?

                1) అభినవ    2) నవ్య
                3) గీత           4) కాల్పనిక


37.    ‘తెలుగులో కవితా విప్లవాలు స్వరూపం’ కర్త            ఎవరు?

     1) కడియాల        2) వేల్చేరు నారాయణ రావు   
     3) ఖండవల్లి         4) పింగళి
 

38.    ‘ఒక కవి యొక్క అవి స్పష ్టవాంఛాంకురం,            ఒక అంతర్నిగూఢ తాపం, ఒక చిన్న                        కావ్యంలో ఊదబడినచో అది భావ కవిత్వం’            అన్నదెవరు?

              1) రాయప్రోలు             2) కృష్ణశాస్త్రి  
              3) విశ్వనాథ               4) నండూరి


39.    భావ కవిత్వానికి ఆ పేరు పెట్టింది ఎవరు?

           1)  కృష్ణశాస్త్రి                     2) గాడిచర్ల    
           3) నోరి నరసింహశాస్త్రి       4) రాయప్రోలు


40.    ‘భగ్న హృదయం’ కర్త ఎవరు?

                 1) విశ్వనాథ           2) దువ్వూరి      
                  3) నాయని             4) జాషువా



41.    ‘కుప్పుస్వామి’ శతక కర్త ఎవరు?

          1) విశ్వనాథ           2) నార్ల చిరంజీవి   
          3) త్రిపురనేని          4) తుమ్మల


42.  రసము ‘వేయి రెట్లు గొప్పది నవ                               కథాధుృతినిమించి’ అన్న పల్కులెవరివి?

               1) శ్రీశ్రీ                    2) సినారె
               3) విశ్వనాథ         4) రావిశాస్త్రి


43. ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ            మెలగవలెనోయ్‌’ అన్న కవి ఎవరు?

             1) రాయప్రోలు         2) కందుకూరి   
             3) గురజాడ             4) చిలకమర్తి


44.    ‘’చావలేదు, చావలేదు ఆంధ్రుల మహోజ్జ్వల            చరిత్ర’ అన్నదెవరు?

         1) చిలకమర్తి               2) గరిమెళ్ల   
         3) రాయప్రోలు             4) గురజాడ


45. ‘ఎన్ని జన్మములు గాగ నీతనువునన్‌                        ప్రవహించునొ ఆంధ్ర రక్తముల్‌’ అన్న                        పల్కులెవరివి?

           1) రాయప్రోలు            2) విశ్వనాథ   
           3) గురజాడ                4) చిలకమర్తి


46. ‘నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై            దేశమును కాల్చి వేయు’ అనే పలుకులు                  ఎవరివి?

       1) గురజాడ           2) త్రిపురనేని   
       3) తుమ్మల           4) జాషువా


47. ‘నాకు నిశ్వాస తాళ వుత్తాంతాలు కలవు’ అని         చెప్పుకొన్నది ఎవరు?

        1) పింగళి                    2) కృష్ణశాస్త్రి        
        3) రాయప్రోలు              4) చలం


48. ‘పల్లె యెల్లయె సర్వ ప్రపంచ సీమ’ అన్న కవి             ఎవరు?

         1) జాషువా          2) తుమ్మల   
         3) దువ్వూరి         4) పానుగంటి


49. ‘ఆంధ్రయన మెత్తబడనట్టి యాత్మలేదు’ అన్నది         ఎవరు?

        1) ఫరిపండా           2) పుట్టపర్తి   
        3) రాయప్రోలు         4) గురజాడ


50. ‘రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద ఆంధ్ర            వాణి కిన్‌’ అన్న కవి ఎవరు?

       1) జాషువా             2) త్రిపురనేని     
       3) పురిపండా          4) పుట్టపర్తి


51. ‘సరస్వతీ మహల్‌’ లైబ్రరీని ఎక్కడ                           నిర్మించారు?

       1) నెల్లూరు              2) తిరుపతి     
       3) తంజావూరు       4) హైదరాబాద్‌


52. ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం’ కర్త          ఎవరు?

               1) మూర్తి కవి             
               2) కట్టా వరదరాజు   
               3) గణపవరపు వేంకట కవి
               4) శేషం వేంకట కవి


53. ‘అశ్లీల మోహ శృంగార కావ్యం’గా నింద                   మోసిన గ్రంథం ఏది?

     1) మనుచరిత్ర               2) వసుచరిత్ర  
     3) రాధికాసాంత్వనం     4) పాంచాలీ పరిణయం


54. ‘ఆనందరంగ రాట్భందం’ గ్రంథకర్త ఎవరు?

              1) కస్తూరి రంగ కవి
              2) కాకుమాను మూర్తి కవి   
              3) సవరం చిననారాయణ
              4) కట్టా వరదరాజు


55.  ప్రథమాంధ్ర వాగ్గేయకారుడు ఎవరు?

          1) అన్నమయ్య         2) త్యాగయ్య   
          3) క్షేత్రయ్య                4) రామదాసు


56.  ‘అపౌరుషేయాలు’ ఏవి?

             1) వేదాలు        2) పురాణాలు    
             3) కావ్యాలు         4) ప్రబంధాలు


57.  ఆర్షప్రోక్టాలు ఏవి?

              1) పురాణాలు          2) వేదాలు   
              3) కావ్యాలు              4) చారిత్రక కావ్యం


58. ‘భక్త చింతామణి’ శతక కర్త ఎవరు?

           1) కృపాంభనిది 
           2) వసురాయ కవి   
           3) కాసుల పురుషోత్తమ కవి 
           4) అన్నమయ్య


59. ‘దేవకీనందన’ శతక కర్త ఎవరు?

        1) కాసుల పురుషోత్తమ కవి 
        2) వెన్నెలకంటి జన్నయ 
        3) పుష్పగిరి తిమ్మన
        4) వసురాయకవి


60. ‘మాతృ శతక’ కర్త ఎవరు?

         1) మంగిపూడి వేంకట శర్మ 
         2) దువ్వూరి రామిరెడ్డి   
         3) నిడదవోలు వెంకటరావు
         4) ఎలకూచిబాలసరస్వతి


61. ద్విపద రచనకు ఆద్యుడు ఎవరు?

         1) నన్నెచోడుడు       2) పాల్కురికి సోమన  
         3) త్యాగయ్య           4) క్షేత్రయ్య


62. ‘శృంగార దండకం’ కర్త ఎవరు?
 
             1) అన్నమయ్య
             2) చిన్నన్న   
             3) చిన తిరుమలాచార్యుడు 
             4) పెద తిరుమలాచార్యుడు


63. ‘పరమయోగీ విలాసం’ కర్త ఎవరు?
 
           1) చిన్నన్న 
           2) పెదతిరుమలాచార్యుడు    
           3) అన్నమయ్య 
           4)  తిమ్మక్క


64. ‘భాగవత దశమస్కంధ ద్విపద’ను రచించింది           ఎవరు?

             1) మడిక సింగన            2) గౌరన    
             3) నాదెండ్ల గోపన్న         4) చిన్నన్న



65. ‘అష్టమహిషీ కళ్యాణం’ కర్త ఎవరు?

        1) తాళ్ళపాక చిన్నన్న
        2) పాల్కురికి సోమన   
        3) అన్నమయ్య  
        4) వేంగమాంబ



66. ‘దండక’ రచన మొదట ఎవరి భారతంలో                  కనిపిస్తుంది?

        1) నన్నయ        2) తిక్కన    
        3) ఎర్రన             4) పై ముగ్గురిలో కనిపించదు



67. ‘కుకవుల్‌ ధర దుర్విటులు’ అన్న కవి ఎవరు?

       1) నన్నెచోడుడు                  2) తిక్కన   
       3) పాల్కురికి సోమన           4) నాచన సోమన



68. ‘ఉచ్ఛారణ దక్షుచే అభిహితంబగు                           శబ్దంబునట్లపోలె’ అన్న కవి?

               1) నన్నయ   2) తిక్కన
               3) శ్రీనాథడు  4) పోతన


*పురాణ విజ్ఞానం*


1.ప్రహల్లాదుడు కొడుకు ఎవరు?

జ): *వాతాపి, ఇల్వలుడు, విరోచనుడు*

2.కృతయుగంలో వేదాలను దొంగలించినది ఎవరు?

జ): *సోమకాసురుడు*

3.బలిచక్రవర్తిని దానం అడిగిన విష్ణుమూర్తి అవతారం ఎవరు?

జ): *వామనుడు*

4.రాక్షసుల గురువు ఎవరు?

జ): *శుక్రాచార్యూడు*

5.ఇంద్రుడి రాజధాని ఏది?

జ): *అమరావతి*

6.ఇంద్రుడి ఆయుధం పేరు?

జ): *వజ్రాయుధం*

7.దేవతల గురువు ఎవరు?

జ): *బృహస్పతి*

8.వజ్రాయుధం ఎవరి వెన్నెముకతో తయారయింది?

జ): *ధధీచి*

9.కశ్యప ప్రజాపతి భార్యల పేర్లు ఏమి?

జ): *21 మంది - దితి, అదితి, వినిత, కద్రువ.....*

10.సూర్యుడి రథసారథి ఎవరు?

జ): *అనూరుడు*

11.ఆదిశేషుడు కర్కోటకుడు తల్లి ఎవరు?

జ): *కద్రువ*

12.వినత కుమారులు ఎవరు?

జ): *అనూరుడు, గరుత్మంతుడు*

13.హిరణ్యకశిపుని భార్యలు ఎవరు?

జ): *లీలావతి, దత్త*

14.హిరణ్యకశిపుడి తల్లి ఎవరు?

జ): *దితి*

15.కృతయుగంలో భూదేవిని పాతాళంలో దాచి నది ఎవరు?

జ): *హిరణ్యాక్షుడు*

16.వాలి మెడలోని దండ పేరు ఏమి?

జ): *నాగ కేసర పూలదండ*

17.యమధర్మరాజు వెంట పడిభర్త ప్రాణాలు దక్కించుకున్నది ఎవరు?

జ): *సావిత్రి*

18.యుగాల పేర్లు ఏమి?

జ): *కృత, త్రేతా, ద్వాపర, కలి*

19.విష్ణువు ద్వారపాలకులు జయ విజయలకు శాపం పెట్టినది ఎవరు?

జ): *సనకసనందాదులు*

20. ద్రౌపది వస్త్రాపహరణం లో ధర్మం మాట్లాడినది ఎవరు?

జ): *వికర్ణుడు*

21. ద్రోణాచార్యుడి అజ్ఞాత శిష్యుడు 6?

జ): *ఏకలవ్యుడు*

22. అభిమన్యుడి తల్లిదండ్రులు ఎవరు?

జ): *సుభద్రార్జునులు*

23. క్షత్రియ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసినది ఎవరు?

జ): *పరశురాముడు*

24. విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నినది ఎవరు?

జ): *భృగువు*

25. అమృతాన్ని తాగిన రాక్షసుల పేర్లు ఏమి?

జ): *రాహువు, కేతువు*

26.శోణితపురం అనే రాజ్యానికి రాజు ఎవరు?

జ): *బాణాసురుడు*

27. నరకాసురుడి స్నేహితుడు ఎవరు?

జ): *బాణాసురుడు*

28. కృతయుగంలో జన్మించి ద్వాపర యుగంలో మరణించిన రాక్షసుడు ఎవరు?

జ): *నరకాసురుడు*

29. వేద విభజన చేసినది ఎవరు?

జ): *వ్యాసుడు*

30. బ్రహ్మకు భూలోకంలో గుడి ఉండదు అని శాపం పెట్టినది ఎవరు?

జ): *భృగువు*

31. కృత యుగం ఎన్ని సంవత్సరాలు జరిగింది?

జ): *1728000*

32. త్రేతా యుగం ఎన్ని సంవత్సరాలు జరిగింది?

జ): *1296000*

33. ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు జరిగినది?

జ): *864000*

34. కలియుగం కాల పరిమితి ఎంత?

జ): *432000*

35. జాంబవతి తండ్రి ఎవరు?

జ): *జాంబవంతుడు*

36. ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు?

జ): *కుబేరుడు*

37. కృతయుగంలో భూదేవి ద్వాపరయుగంలో ఏ అంశతో జన్మించింది?

జ): *సత్యభామ*

38. శ్రీ కృష్ణుడి మేనమామ ఎవరు?

జ): *కంసుడు*

39. విరాట రాజు కొలువులో నకులసహదేవులు పేర్లు ఏమి?

జ): *థామగ్రంథి, తంత్రిపాల*

40. మహాసాధ్వి అనసూయ తల్లిదండ్రులు ఎవరు?

జ): *దేవహూతి, కర్దమ*




> తెలుగు బాషా-సాహిత్యాలలోని
   👉 పుస్తకాలు చూడండి.


పురాణం క్విజ్ ❓:-


1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు?

2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు?

3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరిఇంటివద్ద అతిధిగా ఉన్నాడు?

4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు?

5.ఆంజనేయుని వాహనం ఏమిటి?

6.ద్రోణుని కుమారుని పేరేమి?

7.భీష్ముని తలిదండ్రులెవరు?

8.దశరధుడు ఎవరినిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను?

9.సీతాదేవితల్లిదండ్రులెవరు?

10.వాలికుమారునిపేరేమి?

11.జఠాయువు సోదరుడెవరు?

12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు?

13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు?

14.సుగ్రీవుని మంత్రి ఎవరు?

15.కుచేలుని అసలు పేరేమి?

16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు?

17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి?

18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు?

19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?

20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు?


సమాధానాలు:-:-


1. పూతన

2.తాటకి

3. విదురుడు

4. శ్రీరాముడు

5. ఒంటె

6.అశ్వత్థామ

7.గంగాశంతనులు

8.ఋష్యశృంగుడు

9.సునయనాజనకులు

10.అంగదుడు

11.సంపాతి

12.దేవకీవసుదేవులు

13.శకుని

14.హనుమంతుడు

15. సుధాముడు

16.శ్రీకృష్ణార్జునులు

17. అర్జునుడు

18. దుశ్శాసనుడు

19.త్రిజట

20. ద్రోణుడు



*శ్రీశ్రీ* వాక్యాలు గురజాడ అప్పారావు గారి రచనలు గురించి. 


*1. ఆది మధ్యాంతరహితమైన నాటకం కన్యాశుల్కం.*

*2. కన్యాశుల్కం గొప్పది. జీవితమంత గొప్పది. సాహిత్యం లో వాస్తవికతను ఇంత సమగ్రంగా ప్రదర్శించిన నాటకం ఈనాటి మన దేశంలో లేనే లేదు.*

*3. కన్యాశుల్కం భీభత్స రసప్రధానమైన విషాదాంత నాటకం.*

*4. విశ్వసాహిత్యంలో మధురవాణి తో సరిపోల్చగలిగిన పాత్ర మరోకటి లేదు.*

*5. వసంతసేన వెసెల్ ఆఫ్ లవ్ (ప్రేమ పాత్రిక) అనీ, మధురవాణి వెసెల్ ఆఫ్ లైఫ్ (జీవిత పాత్రిక) అనీ నేను అంటాను.*

*6. నిజానికి తెలుగు భాషలో ప్రథమ శ్రేణిని నిలిచే పది పుస్తకాలలో కన్యాశుల్కానికి నేను ప్రథమ స్థానం ఇస్తాను. ప్రపంచపు నూరు పుస్తకాలలో కన్యాశుల్కం ఒకటి.*

*7. చిన్నయసూరి నవీన కాలంలో పరిశేషించిన ప్రాచీనుడు.*

*8. మన దేశ భాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారికశైలిలో మొట్టమొదటి సారిగా నాటకం వ్రాసింది గురజాడ అప్పారావు గారు అనే అనుకుంటాను.*

*9. ఆధునిక సాహిత్య ప్రపంచంలో తెలుగు దేశపు సరిహద్దుల కవతల అంతర్జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు వారి తరపున ప్రతినిధిగా నిలుచుకోగలిగినవాడు గురజాడ అప్పారావు.*

*10. కవి మాత్రమే కాదు, కథా రచయితగా గురజాడ ధృవతార.*

*11. దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతం.*

*12. తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతి తీసుకురాగల సృజనా సామర్థ్యం ప్రదర్శించే మహాకవి గా గురజాడకి నా నమోవాకాలు.*

*13. కనిపించని వంద కల్పవృక్షాలకన్నా "దేశభక్తి" గీతం మిన్న. సన్మానాలు పొందే లక్ష సామ్రాట్టులకన్నా ఒక కామ్రేడ్ గురజాడ ‌మేలు.*

*14. ఆది కాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగు లో మాహా కవులు.*

పుస్తకం    : *గురజాడ* వ్యాసాలు 
ప్రక్రియ     : *వ్యాసం*
రచయిత  : *శ్రీశ్రీ*

ఇటువంటి సాహిత్య ప్రశ్నలను గూర్చి మరింత
తెలుసుకోవాలంటే క్రింద పుస్తకాన్ని కొని చదువుకోవచ్చు....👇



కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.